Jump to content

పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల సమాఖ్య శాసనసభ

వికీపీడియా నుండి

పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ శాసనసభ, భారతదేశం లోని పాటియాలా తూర్పు పంజాబ్ రాష్ట్రాల సమాఖ్య ఏకసభ రాష్ట్ర స్థాయి శాసనసభ.[1] ఈ శాసనసభకు రెండు ఎన్నికలు జరిగాయి. ఒకటి 1951లో, రెండవది 1954లో జరిగింది.[2][3] ఈ శాసనసభలో 60 స్థానాలు ఉన్నాయి. [2][3] ఈ సమావేశం దర్బార్ (కిలా ముబారక్ కోర్టు, పాటియాలా రాజ కోట) లో జరిగేది.

1951లో 40 ఏక-సభ్యుల నియోజకవర్గాలు, 10 ద్వంద్వ-సభ్యుల నియోజకవర్గాలున్నాయి (వాటిలో ఏదీ షెడ్యూల్డ్ కులాలకు గానీ, షెడ్యూల్డ్ తెగలకు గానీ కేటాయించలేదు).[2] ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ 26 స్థానాలను గెలుచుకుంది. అకాలీదళ్ 19 సీట్లతో, స్వతంత్రులు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మద్దతును సేకరించి యునైటెడ్ ఫ్రంటును ఏర్పాటు చేసింది.[4]భారత జాతీయ కాంగ్రెస్ మంత్రివర్గం 1952 ఏప్రిల్ 18న రాజీనామా చేసింది. యునైటెడ్ ఫ్రంటుకు చెందిన జియాన్ సింగ్ రారేవాలా 1952 ఏప్రిల్ 22న మంత్రివర్గాన్నిఏర్పాటు చేశారు. రారేవాలా 1953 మార్చి 11న రాజీనామాచేశారు.[5]

భారత రాజ్యాంగం ఆర్టికల్ 172 (1) నిబంధనల ప్రకారం 1951లో ఎన్నికైన శాసనసభకు ఐదేళ్ల పదవీకాలం ఉండేది.1953 మార్చి 4న భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద ఈ శాసనసభను రద్దు చేశారు.[6] నియోజకవర్గాల డీలిమిటేషన్ కమిషన్ పునర్య్వస్థీకరణ పూర్తయిన వెంటనే కొత్త ఎన్నికలు జరుగుతాయని అధ్యక్షుడు ప్రకటించారు.[6] డీలిమిటేషన్ కమిషన్ ఉత్తర్వు 1953 సెప్టెంబరు 15న ప్రచురించబడింది. పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల శాసనసభకు 1954 ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరిగాయి.[6]1954 ఎన్నికలలో 34 రిజర్వు చేయని ఏక-సభ్యుల నియోజకవర్గాలు,2 ఏక-సభ్యుల స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు,12 రిజర్వు చేయబడని ద్వంద్వ-సభ్యుల నియోజకవర్గాలకు రిజర్వు చేయబడ్డాయి.[3]ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించింది.కల్నల్ రఘ్బీర్ సింగ్ 1954 మార్చి 6న భారత జాతీయ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.రెండురోజుల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.[5] రాంసరంచంద్ మిట్టల్ స్పీకర్గా, సర్దార్ చేత్ సింగ్ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు.[7]

1956 అక్టోబరు 31న పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ శాసనసభను పంజాబ్ శాసనసభలో విలీనం చేశారు.పాటియాలా,తూర్పు పంజాబ్ రాష్ట్రాల సమాఖ్య శాసనసభ సభ్యులు 1956 నవంబరు 1 నాటికి పంజాబ్ శాసనసభలో సభ్యులుగా మారారు.[8] పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ శాసనసభ సభ్యులు కూడా పంజాబ్ శాసన మండలి ఆరుగురు సభ్యులను ఎన్నుకున్నారు.[1]

కూర్పు

[మార్చు]
పార్టీ 1952–1954 1954–1956
అకాలీదళ్ 19
భారతీయ జన్ సంఘ్ 2
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 2 4
భారత జాతీయ కాంగ్రెస్ 26 37
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 1
లాల్ కమ్యూనిస్టు పార్టీ 1
షెడ్యూల్డ్ కులాల సమాఖ్య 1
శిరోమణి అకాలీదళ్ (మన్ గ్రూప్) 10
శిరోమణి అకాలీదళ్ (రామన్ గ్రూప్) 2
స్వతంత్రులు 8 7

మూలాలు

[మార్చు]

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

  1. 1.0 1.1 Economic and Political Weekly. Punjab—PEPSU Merger
  2. 2.0 2.1 2.2 Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1951 TO THE LEGISLATIVE ASSEMBLY OF PATIALA & EAST PUNJAB STATES UNION
  3. 3.0 3.1 3.2 Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1954 TO THE LEGISLATIVE ASSEMBLY OF PATIALA & EAST PUNJAB STATES UNION
  4. Guha Thakurta, Paranjoy, and Shankar Raghuraman. Divided We Stand: India in a Time of Coalitions. Los Angeles: SAGE Publications, 2007. p. 361
  5. 5.0 5.1 Bhargava, Gopal K., and S. C. Bhatt. Punjab. Delhi: Kalpaz publ, 2006. p. 389
  6. 6.0 6.1 6.2 Punjab District Gazetteers: Faridkot. Controller of Print. and Stationery, 2000. p. 559
  7. The Times of India Directory & Yearbook, Including Who's who. Times of India Press, 1954. p. 1157
  8. Grover, Verinder, and Ranjana Arora. Encyclopaedia of India and Her States. Vol. 4. New Delhi [India]: Deep & Deep, 1996. p. 359