జమ్మూ కాశ్మీర్ శాసనసభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమ్మూ కాశ్మీర్ శాసనసభ
12వ జమ్మూ, కాశ్మీర్ శాసనసభ
(రద్దు)
Coat of arms or logo
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
స్థాపితం1957
అంతకు ముందువారుజమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ
నాయకత్వం
స్పీకరు
ఖాళీ
2019 అక్టోబరు 31 నుండి
డిప్యూటీ స్పీకరు
ఖాళీ
2019 అక్టోబరు 31 నుండి
సభా నాయకుడు
(ముఖ్యమంత్రి)
ఖాళీ
2019 అక్టోబరు 31 నుండి
సభ ఉప నాయకుడు (ఉప ముఖ్యమంత్రి)
ఖాళీ
2019 అక్టోబరు 31 నుండి
ప్రతిపక్ష నాయకుడు
ఖాళీ
2019 అక్టోబరు 31 నుండి
సీట్లు119 (90 సీట్లు + 24 సీట్లు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్కి రిజర్వ్ చేయబడ్డాయి) + 5 నామినేట్ చేయబడ్డాయి
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
25 నవంబరు నుండి 20 డిసెంబరు 2014
తదుపరి ఎన్నికలు
2024 మే (అంచనా)

జమ్మూ కాశ్మీర్ శాసనసభ, జమ్మూ కాశ్మీర్ విధానసభ అని కూడా పిలుస్తారు, ఇది జమ్మూ కాశ్మీర్ భారత కేంద్రపాలిత ప్రాంత శాసనసభ. జమ్మూకాశ్మీర్ శాసనసభను 2018 నవంబరు 21న గవర్నరు రద్దు చేశారు.[1] 2019కి ముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం శాసనసభ (దిగువ సభ), శాసన మండలి (ఎగువ సభ)తో ద్విసభ శాసనసభను కలిగి ఉంది. 2019 ఆగష్ఠులో భారత పార్లమెంటు ఆమోదించిన జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, దీని స్థానంలో ఏకసభ్య శాసనసభను ఏర్పాటుచేసింది. అదే సమయంలో రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా పునర్వ్యవస్థీకరించింది.

చరిత్ర

[మార్చు]

ప్రజాసభ అని పిలువబడే జమ్మూ కాశ్మీర్ రాచరిక రాష్ట్రం మొదటి శాసనసభ 1934లో మహారాజా హరిసింగ్ ప్రభుత్వంచే స్థాపించబడింది. ఇందులో 33 మంది నియోజకవర్గ స్థానాల నుండి ఎన్నికైన అభ్యర్థులు, 30 మంది నియమించిన సభ్యులు,12 మంది మాజీ అధికారులకు చెందిన సభ్యులు ఉన్నారు.[2]

1934లో జరిగిన మొదటి ఎన్నికలలో పండిట్ రామ్ చందర్ దూబే నేతృత్వంలోని లిబరల్ గ్రూప్ అతిపెద్ద పార్టీగా, ముస్లిం కాన్ఫరెన్స్ రెండవ అతిపెద్ద (14 స్థానాలతో) అవతరించింది.[3] తదుపరి ఎన్నికలు 1938, 1947లో జరిగాయి.

1939లో, ముస్లిం కాన్ఫరెన్స్ పార్టీ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్‌గా పేరు మార్చుకుంది. అన్ని మతాల ప్రజలకు దాని సభ్యత్వాన్ని తెరిచింది. ఇది 1946లో క్విట్ కాశ్మీర్ ఉద్యమాన్ని ప్రారంభించింది.1947 ఎన్నికలను బహిష్కరించింది.[4]

భారతలో చేరిన తరువాత

[మార్చు]
2010లో జమ్మూ కాశ్మీర్ శాసనసభ

1947లో జమ్మూ కాశ్మీర్ రాచరిక రాష్ట్రం భారత యూనియన్‌లోకి ప్రవేశించిన తర్వాత, మహారాజా షేక్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రముఖ ప్రభుత్వానికి అధికారాలను అప్పగించారు. 1951లో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ మొత్తం 95 స్థానాలను గెలుచుకుంది.1957లో ఒక కొత్త రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. ఇది ఎగువ సభ, జమ్మూ కాశ్మీరు శాసన మండలి, దిగువ సభ జమ్మూ కాశ్మీరు శాసనసభతో కూడిన ద్విసభ శాసనసభను ఏర్పాటు చేసింది.[5]

ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ

[మార్చు]

2019లో, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేయబడింది.[6] జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్,లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్నిర్మించడానికి జమ్మూ, కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడింది.2019 అక్టోబరు 31 నుండి అమలులోకి వచ్చింది.[7] జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ఏకసభ్య శాసనసభను కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 2019 అక్టోబరు 16న అధికారికంగా రద్దు చేయబడింది.[8][9]

2019 మార్చిలో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం డీలిమిటేషన్ కోసం రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.[10] కమిషన్ తన మధ్యంతర నివేదికను 2022 ఫిబ్రవరిలో వెల్లడించింది.[11] తుది డీలిమిటేషన్ నివేదిక 2022 మే 5న [12] విడుదల చేయబడింది. ఇది 2022 మే 20 నుండి అమల్లోకి వచ్చింది.[13]

కూర్పు

[మార్చు]

శాసనసభ ప్రారంభంలో 100 మంది సభ్యులతో కూడి ఉంది. తర్వాత 1988 నాటి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం (ఇరవయ్యవ సవరణ) చట్టం ద్వారా 111 స్థానాలకు పెరిగింది.[5] వీటిలో 24 స్థానాలు 1947లో పాకిస్తాన్ నియంత్రణలోకి వచ్చిన రాష్ట్రంలోని ప్రాదేశిక నియోజకవర్గాలకు కేటాయించబడ్డాయి.[5] అప్పటి రాష్ట్ర రాజ్యాంగంలోని సెక్షన్ 48 ప్రకారం, ఇప్పుడు భారత రాజ్యాంగంలో కూడా ఈ స్థానాలు అధికారికంగా ఖాళీగా ఉన్నాయి.[5] శాసనసభ మొత్తం సభ్యత్వాన్ని లెక్కించడానికి, ప్రత్యేకించి కోరం నిర్ణయించడానికి, కొత్త చట్టం అమలుకు, సవరణలకు, ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీల ఓటు వేయడానికి ఈ సీట్లు పరిగణనలోకి తీసుకోబడవు.[5] కాబట్టి శాసనసభలో పోటీ చేయదగిన, నిండిన మొత్తం స్థానాలు 87 సీట్లు. కాశ్మీర్ లోయ ప్రాంతంలో 46 సీట్లు, జమ్మూ ప్రాంతంలో 37 సీట్లు, లడఖ్ ప్రాంతంలో 4 సీట్లు ఉన్నాయి.

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, డీలిమిటేషన్ చట్టం

[మార్చు]

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్నిర్మించడానికి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడింది.[7] 2020 మార్చిలో తదుపరి జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలకు ముందు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం డీలిమిటేషన్ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడింది.[10] డీలిమిటేషన్ నివేదిక జమ్మూ విభాగానికి 6 స్థానాలు, కాశ్మీర్ విభాగంలో ఒక స్థానం అదనంగా చేరింది. డీలిమిటేషన్ తర్వాత, శాసనసభ లోని మొత్తం స్థానాలు 114 సీట్లకు పెరిగాయి. అందులో 24 సీట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధి లోకి వచ్చే ప్రాంతాలకు కేటాయించబడ్డాయి. మిగిలిన 90 సీట్లలో 43 సీట్లు జమ్మూ విభాగంలో, 47 సీట్లు కాశ్మీర్ విబాగంలో ఉన్నాయి.[12]

ఎస్.సి/ఎస్.టి. అభ్యర్థులకు స్థానాలు కేటాయింపు

[మార్చు]

షెడ్యూల్డ్ కులాలకు 7, షెడ్యూల్డ్ తెగలకు 9 స్థానాలు కేటాయింపు సౌకర్యం కల్పించే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును 2023ని పార్లమెంట్ ఆమోదించింది.[14][15]

నామినేటెడ్ సభ్యుల కోసం నిబంధనలు

[మార్చు]

జమ్మూ, కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 చట్టసభలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోతే లెఫ్టినెంట్ గవర్నరుకు ఇద్దరు మహిళా సభ్యులను శాసనసభకు నామినేట్ చేయవచ్చు.[16] 2023లో చట్టానికి సవరణ చేసిన తర్వాత, లెఫ్టినెంట్ గవర్నర్ కాశ్మీరీ వలస కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రతినిధులను (ఒక స్థానం మహిళకు కేటాయింబడింది) పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వలస వచ్చిన వారి తరపున ఒక సభ్యుడిని నియామకం చేయవచ్చు.[17]

పదవీకాలం, విధులు

[మార్చు]

శాసనసభ సభ్యులు 2019 వరకు ఆరేళ్ల కాలానికి, ఆ తర్వాత ఐదేళ్ల కాలానికి ఎన్నికయ్యారు. మొదటి పాస్ట్ పోస్ట్ పద్ధతిని ఉపయోగించి ఏకసభ్య స్థానాల నియోజకవర్గాల నుండి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా స్థానాలు భర్తీ చేయబడతాయి. ముఖ్యమంత్రి సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నరు, శాసనసభ పూర్తి పదవీకాలం పూర్తి కాకముందే శాసనసభను రద్దు చేయవచ్చు. లెఫ్టినెంట్ గవర్నరు శాసనసభ ప్రత్యేక సమావేశాలను కూడా ఏర్పాటు చేయవచ్చు.

పార్టీల వారీగా సభ్యత్వం

[మార్చు]

ప్రస్తుత శాసనసభ రద్దయింది.

కార్యాలయ నిర్వాహకులు

[మార్చు]

మూలం:[18]

 • స్పీకర్: ఖాళీగా ఉంది
 • ముఖ్యమంత్రి: ఖాళీ
 • ప్రతిపక్ష నాయకుడు: ఖాళీ
 • కార్యదర్శి: మనోజ్ కుమార్ పండిట్

శాసనసభ సభ్యులు

[మార్చు]

ప్రస్తుతం శాసనసభ రద్దయింది.

ఇది కూడ చూడు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Amid contrasting claims, J&K Governor dissolves Assembly". The Hindu. 2018-11-21. ISSN 0971-751X. Retrieved 2022-02-28.
 2. Rai, Mridu (2004), Hindu Rulers, Muslim Subjects: Islam, Rights, and the History of Kashmir, C. Hurst & Co, p. 274, ISBN 1850656614
 3. Copland, Ian (1981), "Islam and Political Mobilization in Kashmir, 1931-34", Pacific Affairs, vol. 54, no. 2, pp. 228–259, doi:10.2307/2757363, JSTOR 2757363
 4. Choudhary, Dipti (19 January 2024), "The Constitutional Development in the State of Jammu and Kashmir" (PDF), State autonomy under indian constitution a study with reference to the state of jammu and kashmir, Kurukhsetra University/Shodhganga, pp. 60, 69
 5. 5.0 5.1 5.2 5.3 5.4 "Constitution of Jammu and Kashmir" (PDF).
 6. "President declares abrogation of provisions of Article 370". The Hindu. PTI. 2019-08-07. ISSN 0971-751X. Retrieved 2022-06-27.{{cite news}}: CS1 maint: others (link)
 7. 7.0 7.1 "President Kovind gives assent to J&K Reorganisation Bill, two new UTs to come into effect from Oct 31". The Indian Express (in ఇంగ్లీష్). 2019-08-09. Retrieved 2022-06-27.
 8. "J&K administration orders abolition of legislative council, asks its staff to report to GAD". Financial express. PTI. 17 October 2019. Retrieved 5 February 2021.
 9. "Abolition of Jammu and Kashmir Legislative Council in terms of Section 57 of the Jammu and Kashmir Reorganization Act, 2019" (pdf). jkgad.nic.in. Retrieved 5 February 2021.
 10. 10.0 10.1 "Delimitation of Constituencies in Jammu-Kashmir, Assam, Arunachal Pradesh, Manipur and Nagaland - Notification dated 06.03.2020 - Delimitation - Election Commission of India". Retrieved 5 February 2021.
 11. "Many seats redrawn in J&K delimitation draft". The Hindu. 2022-02-05. ISSN 0971-751X. Retrieved 2022-02-11.
 12. 12.0 12.1 "The Jammu and Kashmir Delimitation report". The Hindu. 2022-05-09. ISSN 0971-751X. Retrieved 2022-05-16.
 13. "Orders of J&K Delimitation Commission take effect". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-05-21. Retrieved 2022-05-21.
 14. "Parliament passes J-K Reservation, J-K Reorganisation (Amendment) Bills". The Economic Times. 2023-12-12. ISSN 0013-0389. Retrieved 2023-12-12.
 15. "Rajya Sabha passes J&K Bills on reservation, Assembly representation". Moneycontrol (in ఇంగ్లీష్). 2023-12-11. Retrieved 2023-12-12.
 16. "What is the Jammu and Kashmir Reorganisation Bill, 2019?". Jagranjosh.com (in ఇంగ్లీష్). 2020-03-14. Retrieved 2023-12-12.
 17. "Parliament passes J-K reservation and reorganisation amendment bills: Know all about them". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 2023-12-11. Retrieved 2023-12-12.
 18. "Home | Jammu and Kashmir Legislative Assembly". jkla.neva.gov.in. Archived from the original on 2022-07-05. Retrieved 2022-07-13.

వెలుపలి లంకెలు

[మార్చు]