ఆర్టికల్ 370

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాశ్మీర్ పటం

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూ- కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించింది. భారతదేశం-పాకిస్తాన్ 1947లో విభజన జరిగినప్పుడు అప్పటి జమ్ము- కశ్మీర్ రాజు హరి సింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ తరువాత భారత్‌లో విలీనం చేసేందుకు కాశ్మీర్ రాజు అంగీకరించారు. ఆర్టికల్ 370 అంశంపై అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఐదు నెలలు చర్చ జరిపిన అనంతరం రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 370 అంశాన్ని జోడించారు. ఈ ఆర్టికల్ వల్ల భారత రాజ్యాంగం జమ్మూ కశ్మీర్‌కు వర్తించదు.ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ, సమాచార మినహా వేరే ఏమైనా చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.[1][2][3][4]

ప్రత్యేక హక్కులు

[మార్చు]
  • సెక్షన్ 370 లోని నిబంధనల ప్రకారం, జమ్ము- కశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ అంశాల్లో విషయంలో పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది. కానీ రాష్ట్రం కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే డిమాండ్ తో 1951లో రాష్ట్రాన్ని, రాజ్యాంగ అసెంబ్లీ ఏర్పాటుకు అనుమతి లభించింది. 1956 నవంబరులో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తవడంతో 1957 జనవరి 26న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం వచ్చింది.
  • ఈ ప్రత్యేక రాజ్యాంగం కారణంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు. భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు ఉండదు.
  • 1976 నాటి పట్టణ భూ చట్టం జమ్మూ కాశ్మీర్‌కు వర్తించదు.భారతదేశంలో ఎక్కడైనా భూమిని కొనుగోలు చేసే హక్కు భారతీయ పౌరుడికి ఉంది. కానీ జమ్మూ కాశ్మీర్‌లో భూమి కొనుగోలు చేసే హక్కు లేదు.
  • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ద్వారా దేశంలో ఆర్థిక అత్యవసర స్థితిని అమలు చేసే నిబంధన ఉంది. కానీ అది జమ్ము-కశ్మీర్‌లో వర్తించదు కానీ ఇతర దేశాలతో యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో మాత్రమే ఈ రాష్ట్రంలో అత్యవసర స్థితిని అమలు చేయవచ్చు.

ఆర్టికల్ 370 రద్దు సుప్రీంకోర్ట్‌లో విచారణ

[మార్చు]

జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తి తొలగించాలని 2015 డిసెంబరులో సుప్రీంకోర్ట్‌లో ఒక పిటిషన్‌పై విచారణ చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ధర్మాసనం నేతృత్వంలో జరిగింది.ఈ ఆర్టికల్ 370 తొలగించే హక్కు పార్లమెంటుకు ఉంది అని కోర్టు స్పష్టం చేసింది.కానీ ఆర్టికల్ 370 ఒక శాశ్వత నిబంధన అని జమ్ము-కశ్మీర్ హైకోర్ట్ 2015లోనే వెల్లడించింది.

ఆర్టికల్ 370 రద్దు

[మార్చు]

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో ఆగస్టు 5న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. 370 బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో జమ్ముకశ్మీర్‌లో భారతరాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. కశ్మీర్‌పై కేంద్రానికి పూర్తి అధికారాలు లభించాయి.

జమ్మూ కాశ్మీర్ రెండుగా విభజన

[మార్చు]

ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టిన తరువాత ఆర్టికల్ 35ఏ రద్దు, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లులను కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్మూకశ్మీర్‌ను రెండు భాగాలు విభజన చేశారు జమ్ము- కశ్మీర్, లఢఖ్ ప్రాంతాలుగా విభజించారు. వీటిలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లఢక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు[5]

మూలాలు

[మార్చు]
  1. Yamunan, Sruthisagar. "J&K special status: How the Modi government used Article 370 to kill Article 370". Scroll.in. Retrieved 2019-12-01.
  2. Venkataramanan, K. (2019-08-05). "Explained | How the status of Jammu and Kashmir is being changed". The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-12-01.
  3. "Article 370: Rewriting both the history and geography of J&K - Times of India". The Times of India. Retrieved 2019-12-01.
  4. "Dilution of article 370: A sift through the C.O.272 & 273". itstheliar. 16 March 2020. Archived from the original on 14 April 2020. Retrieved 17 March 2020.
  5. "ఇక ఢిల్లీలా జమ్మూకశ్మీర్.. తేల్చి చెప్పిన అమిత్ షా". www.andhrajyothy.com. 2019-08-05. Retrieved 2019-12-01.[permanent dead link]