ఆంధ్రప్రదేశ్ శాసనసభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
15 వ శాసనసభ (నవ్యాంధ్ర 2వ శాసనసభ)
రకం
రకం
నాయకత్వం
స్పీకర్
డిప్యూటీ స్పీకర్
నిర్మాణం
సీట్లు175
India Andhra Pradesh Assembly 2019.svg
శాసనసభ రాజకీయ వర్గాలు
  YSRC: 151 seats
  TDP: 23 seats
  JSP: 1 seat
ఎన్నికలు
శాసనసభ ఓటింగ్ విధానం
First past the post
శాసనసభ చివరి ఎన్నికలు
2019
సమావేశ స్థలం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, అమరావతి
వెబ్‌సైటు
http://www.aplegislature.org
అమరావతిలో శాసనసభ భవనం

తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను 2017 మార్చి 2న అమరావతిలో ప్రారంభించారు.[1] ఈ శాసనసభలో 175 మంది సభ్యులుంటారు.

చరిత్ర

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను, ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు. శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని కూడా అంటారు.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 295 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహాబుబ్ ఆలీ ఖాన్ 40 వ పుట్టిన రోజు గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ తెలుపు భవనం ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉంది.

హైదరాబాదులోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభా భవనం (-2014)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను 2017 మార్చి 2న అమరావతిలో ప్రారంభించారు [1]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు

సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం రాజకీయ పార్టీ
1 అయ్యదేవర కాళేశ్వరరావు 1956 1962 కాంగ్రెస్
2 బి. వి. సుబ్బారెడ్డి 1962 1970 కాంగ్రెస్
3 జి. నారాయణ రావు కాంగ్రెస్
4 దీవి కొండయ్య చౌదరి కాంగ్రెస్
5 కోన ప్రభాకరరావు 1980 1981 కాంగ్రెస్
6 తంగి సత్యనారాయణ 1983 1985 తె.దే.పా
7 డి. శ్రీపాదరావు 1991 1995 కాంగ్రెస్
8 యనమల రామకృష్ణుడు 1995 1999 తె.దే.పా
9 కె. ప్రతిభా భారతి 1999 2004 తె.దే.పా
10 కె. ఆర్. సురేష్ రెడ్డి 2004 2009 కాంగ్రెస్
11 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2009 2010 కాంగ్రెస్
12 నాదెండ్ల మనోహర్ 2011 2014 కాంగ్రెస్

నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు

సంఖ్య పేరు చిత్రం ఆరంభము అంతము రాజకీయ పార్టీ
1 కోడెల శివప్రసాద్ 2014 2019 తె.దే.పా
2 తమ్మినేని సీతారాం 2019 ప్రస్తుతం వై.ఎస్.ఆర్.సి.పి

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షా.. అనబోయేది రేపే". సమయం. 5 Mar 2017. Archived from the original on 30 June 2017. Retrieved 11 June 2019.

బయటి లింకులు