పంచకర్ల రమేష్ బాబు
పంచకర్ల రమేష్ బాబు | |||
శాసనసభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2019 | |||
ముందు | ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు | ||
---|---|---|---|
తరువాత | ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు | ||
నియోజకవర్గం | యలమంచిలి నియోజకవర్గం | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | తిప్పల గురుమూర్తి రెడ్డి | ||
తరువాత | బండారు సత్యనారాయణ మూర్తి | ||
నియోజకవర్గం | పెందుర్తి నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1963 మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ |
పంచకర్ల రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో పెందుర్తి నియోజకవర్గం నుండి, 2014లో యలమంచిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.అతను కాపు సామాజిక వర్గానికి చెందినవాడు
రాజకీయ జీవితం
[మార్చు]పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు.[1]
పంచకర్ల రమేష్ బాబు 2014లో జరిగిన ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓడిపోయాడు. రమేష్‌బాబు 2021 ఆగష్టు 28న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరాడు.[3][4]
పంచకర్ల రమేష్ బాబు ఆ తరువాత జిల్లా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడై, పార్టీలో జరుగుతున్న పరిణమాలకు మనస్తాపం చెంది 2023 జులై 13న విశాఖపట్నం జిల్లా అధ్యక్ష పదవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి[5], జులై 20న జనసేన పార్టీలో చేరాడు.[6] 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా (ఎన్‌డీఏ) ఏర్పడడంతో జనసేన పార్టీకి పెందుర్తి నియోజకవర్గం కేటాయించడంతో ఆయన ఇక్కడి నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (19 February 2014). "MP, minister and 5 MLAs set off exodus from Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Zee News Telugu (28 August 2020). "వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ The Times of India (28 August 2020). "Former TDP MLA Panchakarla Ramesh Babu to join YSRCP" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ The Hindu (13 July 2023). "Panchakarla Ramesh Babu quits YSRC, party Visakhapatnam district president post" (in Indian English). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
- ↑ NTV Telugu, ntv (20 July 2023). "జనసేనలో చేరిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్." Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
- ↑ Andhrajyothy (25 March 2024). "కూటమి ఎంపీ అభ్యర్థి ఖరారు". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
- ↑ Eenadu (5 June 2024). "చరిత్ర తిరగరాసిన పంచకర్ల". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.