ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు)

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 నుండి ప్రస్తుతం
ముందు పంచకర్ల రమేష్ బాబు
తరువాత పంచకర్ల రమేష్ బాబు
నియోజకవర్గం ఎలమంచిలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1952
సీతమ్మధార, విశాఖపట్నం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రాజన్ రాజు
జీవిత భాగస్వామి రాధాదేవి
సంతానం సుకుమారవర్మ, రోజారాణి, రూపారాణి
నివాసం గాంధీ నగర్, ఎలమంచిలి
వృత్తి రాజకీయ నాయకుడు

ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎలమంచిలి నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు 1952లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, సీతమ్మధార లో జన్మించాడు. ఆయన బీకాం వరకు చదివాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు రాజకీయాల్లోకి రాకముందు కాంట్రాక్టర్‌ గా పని చేసేవాడు. ఆయన 1999లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో ఎలమంచిలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ తరుఫున పోటీ చేసి ఓడిపోయి, 2004,2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు. రమణమూర్తి రాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ లో చేరి ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేసి మే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  3. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.