తిప్పల గురుమూర్తి రెడ్డి
తిప్పల గురుమూర్తి రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004 - 2009 | |||
ముందు | పి.జి.వి.ఆర్. నాయుడు \ గణబాబు | ||
---|---|---|---|
తరువాత | పంచకర్ల రమేష్ బాబు | ||
నియోజకవర్గం | పెందుర్తి నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1966 పెందుర్తి , విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ |
తిప్పల గురుమూర్తి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2004లో పెందుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]తిప్పల గురుమూర్తి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో తొలిసారి గాజువాక మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పని చేసి 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.అతను 2009 ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
తిప్పల గురుమూర్తి రెడ్డి వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అతను 2014లో వైసీపీ నుండి గాజువాక ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు, అతను 2019లో ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు. గురుమూర్తి ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (15 March 2020). "Gurumurthy quits TDP, joins YSRC" (in ఇంగ్లీష్). Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
- ↑ HMTV (14 March 2020). "విశాఖ జిల్లాలో టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.