పి.జి.వి.ఆర్. నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గణబాబు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2014 - ప్రస్తుతం
నియోజకవర్గం పశ్చిమ విశాఖపట్నం నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 09 మే 1969
గోపాలపట్నం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు పెతకంశెట్టి అప్పలనరసింహం
జీవిత భాగస్వామి మాధవి లతా
సంతానం మౌర్య సింహ, శ్రీజ సింహ

పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు (గణబాబు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గణబాబు 09 మే 1969లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, గోపాలపట్నంలో జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి బి.కామ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

గణబాబు తన తండ్రి పెతకంశెట్టి అప్పలనరసింహం మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తండ్రి 1984 లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచాడు. గణబాబు 1994లో టీడీపీ తరపున పెందుర్తి జెడ్పిటిసి సభ్యుడిగా పోటీ చేసి గెలిచి, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి పెందుర్తి నియోజకవర్గం పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

గణబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పశ్చిమ విశాఖపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం, రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో పశ్చిమ విశాఖపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మళ్ల విజయ ప్రసాద్‌పై 18981 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్‌గా సెప్టెంబర్ 2020లో నియమితుడయ్యాడు.[3]

సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ
1999 పెందుర్తి పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు తెలుగుదేశం పార్టీ 117411 ద్రోణంరాజు శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ 45018 23589
2009 వైజాగ్ వెస్ట్ మళ్ల విజయ్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ 45018 పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు ప్రజారాజ్యం పార్టీ 40874 4144
గుడివాడ నాగమణి తెలుగుదేశం పార్టీ 17775
2014 వైజాగ్ వెస్ట్ పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు తెలుగుదేశం పార్టీ 76791 దాడి రత్నాకర్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 45934 30857
2019 వైజాగ్ వెస్ట్ పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు తెలుగుదేశం పార్టీ 68699 మళ్ల విజయ్ ప్రసాద్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 49718 18981

ఇతర పదవులు

[మార్చు]

గణబాబు 2000 నుండి 2003 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ (శాప్‌) డైరక్టర్‌గా, 2000 నుండి 2005వరకు ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన నవంబర్ 2020లో భారత వాలీబాల్ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Andhrajyothy (28 September 2021). "విధేయతకు పట్టం". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  4. Eenadu (13 November 2021). "భారత వాలీబాల్‌ సమాఖ్య ఉపాధ్యక్షునిగా ఎమ్మెల్యే గణబాబు". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  5. HMTV (13 November 2020). "భారత వాలీబాల్‌ సమాఖ్య ఉపాధ్యక్షునిగా ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్‌.నాయుడు నియమితులయ్యారు." Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.