Jump to content

ప్రజా రాజ్యం పార్టీ

వికీపీడియా నుండి
ప్రజా రాజ్యం పార్టీ
వ్యవస్థాపనచిరంజీవి
స్థాపన2008
రద్దు2011
విలీనంభారత జాతీయ కాంగ్రెస్
ప్రధాన కార్యాలయంజూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ,
సిద్ధాంతంసామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన
వెబ్ సిటు
http://www.prajarajyam.org
ప్రజారాజ్యం పార్టీ‎ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి
ప్రజారాజ్యం పార్టీ‎ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి

తెలుగు సినిమా నటుడు చిరంజీవి 26 ఆగష్టు, 2008 ప్రజా రాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించాడు.[1]. ప్రజా రాజ్యం లో ప్రజలే పాలకులు నేను వారధిని అనేది చిరంజీవి భావన. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 18% ఓట్లు ఈ పార్టీ దక్కించుకుంది. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి మాత్రమే గెలుపొందాడు. ఆగష్టు 2011 లో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో విలీనమయ్యింది[2]

స్థాపన

[మార్చు]

2008 ఆగస్టు 26 తేదిన తిరుపతిలో జరిగిన మొట్టమొదటి బహిరంగ సభలో చిరంజీవి పార్టీని అధికారికంగా ప్రారంభించాడు. సుమారు పది లక్షల మంది హాజరైన ఈ సభలో చిరంజీవి పార్టీ పేరును, అజెండాను ప్రకటించాడు. పార్టీ పతాకంలో సుమారు మూడు వంతులు తెల్లని భాగం, దాని కింద ఒక భాగం పచ్చరంగు, మధ్యలో ఎర్రటి రంగులో సూర్యుడు, గుండ్రని భాగం చుట్టూ పసుపు బోర్డరు ఉన్నాయి.

విలీనం

[మార్చు]

2011 ఫిబ్రవరి 6 వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటి రక్షణ శాఖా మంత్రి ఎ. కె. ఆంటోనీ ఈ విలీన ప్రతిపాదన తెచ్చాడు.[3]

ప్రజారాజ్యంలో పని చేసిన నాయకులూ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Chiranjeevi launches 'Praja Rajyam'". Press Trust of India. Chennai, India: The Hindu. 2008-08-26. Archived from the original on 2011-06-29. Retrieved 2008-08-26.
  2. "Praja Rajyam Party merges with Congress". Chennai, India: The Hindu. 2011-02-06. Retrieved 2011-02-26.
  3. "Praja Rajyam merges with Congress". The Hindu. Chennai, India. 2011-02-07. Archived from the original on 2013-01-25. Retrieved 2020-12-28.

బయటి లింకులు

[మార్చు]