Jump to content

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

వికీపీడియా నుండి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
లోక్‌సభ నాయకుడుSunil Tatkare
రాజ్యసభ నాయకుడుPraful Patel
స్థాపకులుSharad Pawar
P. A. Sangma
Tariq Anwar
స్థాపన తేదీ10 జూన్ 1999 (25 సంవత్సరాల క్రితం) (1999-06-10)
ప్రధాన కార్యాలయం10, Bishmabhar Marg, New Delhi, India-110001
రంగు(లు)  Pacific Blue
ECI StatusState Party[1]
కూటమి
లోక్‌సభ స్థానాలు
1 / 543
రాజ్యసభ స్థానాలు
1 / 245
శాసన సభలో స్థానాలు
Indian states
41 / 288
(Maharashtra)[2]
7 / 60
(Nagaland)
1 / 81
(Jharkhand)
Election symbol
Party flag
Website

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ దీనిని మే 25, 1999న ఏర్పాటు చేసారు, దీనిని శరత్ పవర్, అన్వర్, పి.ఎ.సంగ్మా దీనిని నిర్మాణం చేసారు, ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయ బడ్డారు. శరత్ పవర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్నాడు.[3]

చరిత్ర

[మార్చు]

భారతదేశంలో జన్మించిన వ్యక్తిని మాత్రమే దేశ అత్యున్నత పదవులు  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కావడానికి అనుమతించాలని డిమాండ్ చేసినందుకు  భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) బహిష్కరించబడిన తరువాత ముగ్గురు మాజీ సభ్యులు శరద్ పవార్, పూర్ణో సంగ్మా, తారిఖ్ అన్వర్ జూన్ 1999 లో న్యూఢిల్లీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ని లాంఛనంగా స్థాపించారు. ఇందుకు మూల కారణం మాజీ భారత  ప్రధాని రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా మారిన తరువాత ఈ సమస్య రావడం జరిగింది. శరద్ పవార్ అధ్యక్షుడిగా, సంగ్మా, అన్వర్ ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), భారతదేశంలోని జాతీయ రాజకీయ పార్టీ. "సంపూర్ణ ప్రజాస్వామ్యం", "గాంధేయ లౌకికవాదం", "ఫెడరలిజం ఆధారిత జాతీయ ఐక్యత" భావజాలం కలిగిన "ఆధునిక, ప్రగతిశీల దృక్పథం కలిగిన సహస్రాబ్ది పార్టీ"గా పార్టీ అభివర్ణించుకుంది. సమానత్వం, సామాజిక న్యాయంతో కూడిన ప్రజాస్వామిక లౌకిక సమాజానికి పిలుపునిచ్చింది.

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( ఎన్సీపీ ) ఘన విజయం సాధించింది. 1999లో రాష్ట్ర శాసనసభకు పోటీ చేసిన మొదటి ఎన్నికలలో 223 స్థానాలకు గాను 58 స్థానాలను గెలుచుకుని మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని 75 సీట్లు గెలిచి, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తరువాత రాష్ట్ర, జాతీయ ఎన్నికలలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగి, 2004 లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ)  మన్మోహన్ సింగ్  సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైంది. .

2004 అసెంబ్లీ ఎన్నికలలో మహారాష్ట్రలో ఎన్సిపి రాజకీయ ప్రభావం తో, ఆ రాష్ట్రం లో పోటీ చేసిన  124 సీట్లలో 71 గెలుచుకుంది.  2009 రాష్ట్ర ఎన్నికలలో, ఎన్సిపి మొత్తం 114 సీట్లలో పోటీ చేయగా, కాంగ్రెస్ తిరిగి పుంజుకుని 82 స్థానాలను గెలుచుకుంది. అయితే ఈ రెండు పార్టీలు తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి అవసరమైన స్థానాలను నిలుపుకున్నాయి.

మహారాష్ట్ర మినహా ఇతర రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రభావం తక్కువగా ఉంది. 2007లో గోవా రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్సీపీ మూడు స్థానాలలో గెలుపొందగా, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. జాతీయ స్థాయిలో, పార్టీ 1999 లో లోక్ సభలో (భారత పార్లమెంటు దిగువ సభ) ఎనిమిది స్థానాలను, 2004, 2009 ఎన్నికలలో తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. 2006 ఎన్నికలలో నాలుగు స్థానాల నుండి 2010, 2012 పోటీలలో ఏడుకు పార్టీ  రాజ్యసభ  సీట్ల సంఖ్య తో ఉన్నది. 2014 లోక్ సభ ఎన్నికలలో దాని ప్రాతినిధ్యం ఆరు స్థానాలకు తగ్గడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

జాతీయ స్థాయిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( ఎన్సీపీ )బలహీనతకు పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఫిరాయింపులే కారణం. 2002లో కేరళలో ఒక వర్గం ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంది. 2004లో చత్తీస్ గఢ్ లో మరో వర్గం ఆ పార్టీ నుంచి విడిపోయింది. 2004లో వ్యవస్థాపకుడు పూర్ణో సంగ్మా చర్యలు అత్యంత నష్టం కలిగించాయి. తిరిగి సంగ్మా పార్టీలో చేరినా,  2012 లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ కి శరద్ పవార్ ఎన్సిపి పార్టీ మద్దతు ఇవ్వడం, తరువాత భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి సంగ్మాఎన్సిపిని విడిచిపెట్టారు[4].

పార్టీ చిహ్నం

[మార్చు]
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జెండా

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క చిహ్నం గడియారం, పార్టీ జెండా కాషాయం తెలుపు, ఆకుపచ్చ, మధ్యలో గడియారం వుంటుంది.

అంతర్గత కలహాలు

[మార్చు]

ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెను విభేదాలకు దారితీశాయి. జూలై 2023 లో, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎన్నికైన శాసన సభ్యులు (ఎమ్మెల్యేలు) , శాసన మండలి (ఎం ఎల్ సి ) సభ్యులలో ఎక్కువ మంది నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవడం, జరిగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో జరిగిన చీలిక అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి, పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు శరద్ పవార్ మధ్య రాజకీయ విభేదాలకు కారణం అయింది. ఆ పార్టీ ఎంపీలలో ఎక్కువ మంది శరద్ పవార్ కు విధేయులుగా ప్రస్తుతానికి కనిపిస్తున్నప్పటికీ, పార్టీలో చీలిక దాని భవిష్యత్తు, కొనసాగుతున్న ఐక్యతపై సందేహం, ప్రస్తుతం ఎన్సీపీ అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ విభజన పార్టీ భవిష్యత్ గమనాన్ని, విస్తృత రాజకీయ పరిస్థితులపై, శరద్ పవార్ నాయకత్వంలో పార్టీ తన సమన్వయాన్ని కొనసాగించగలదా లేక అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుందా అనేది ఇంకా అస్పష్టంగా ఉంది.[5]

ఇతర వివరాలు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "NCP, TMC and CPI lose national party status, AAP earns coveted tag". India: India Today. 2013. Retrieved 10 April 2023.
  2. "Maharashtra Assembly Elections 2014: Maharashtra State Election Dates, Results, News, Governors and Cabinet Ministers 2014". dna.
  3. TestHostEntry (2019-09-16). "Congress-NCP announce seat sharing for Maharashtra polls". HW News English. Retrieved 2023-02-19.
  4. "Nationalist Congress Party (NCP) | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). 2023-11-19. Retrieved 2023-11-21.
  5. "Nationalist Congress Party: Latest News, Videos and Photos of Nationalist Congress Party | Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-11-21.