శరద్ పవార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శరద్ గోవిందరావు పవార్
శరద్ పవార్


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
ఏప్రిల్ 3, 2014[1]
నియోజకవర్గం మహారాష్ట్ర

మహారాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలం
జులై 18, 1978 – ఫిబ్రవరి 17, 1980
ముందు వసంతదా పాటిల్
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
జూన్ 26 1988 – జూన్ 25, 1991
ముందు శంకర్రావ్ చవాన్
తరువాత సుధాకర్రావు నాయక్
పదవీ కాలం
మార్చి 6, 1993 – మార్చి 14, 1995
ముందు సుధాకర్రావు నాయక్
తరువాత మనోహర్ జోషి

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
మే 23 2004 – మే 26 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు రాజ్ నాథ్ సింగ్
తరువాత రాధా మోహన్ సింగ్

వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి
పదవీ కాలం
మే 23 2004 – మే 26 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు శరద్ యాదవ్
తరువాత రామ్ విలాస్ పాశ్వాన్

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడు
పదవీ కాలం
2001 – 2004
ముందు రామేశ్వర్ ఠాకూర్
తరువాత రామేశ్వర్ ఠాకూర్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు
పదవీ కాలం
2010 – 2012
ముందు డేవిడ్ మోర్గాన్
తరువాత అలాన్ ఐజాక్

కేంద్ర రక్షణ మంత్రి
పదవీ కాలం
జూన్ 26 1991 – మార్చి 6 1993
ప్రధాన మంత్రి పివి నరసింహారావు
ముందు చంద్ర శేఖర్
తరువాత పివి నరసింహారావు

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
జూన్ 20 1991 – మే 16 2009
ముందు అజిత్ పవార్
తరువాత సుప్రియ సులే
Constituency బారామతి

వ్యక్తిగత వివరాలు

జననం (1940-12-12) 1940 డిసెంబరు 12 (వయసు 83)[2]
బారామతి, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా [2]
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (1999–present)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ (Before 1999)
జీవిత భాగస్వామి ప్రతిభా పవార్
సంతానం 1 కూతురు – సుప్రియా సూలే
నివాసం బారామతి, పూణే
పూర్వ విద్యార్థి బృహన్ మహారాష్ట్ర కళాశాల[2]
వృత్తి రాజకీయ నాయకుడు
అక్టోబరు 29, 2010నాటికి

శరద్ పవార్ (జననం: డిసెంబర్ 12, 1940) ఈయన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు. ఈయన పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.[3]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈయన 1940, డిసెంబర్ 12న శారదాబాయి, గోవింద్ రావు పవర్ దంపతులకు పదకొండు మంది సంతానంలో ఒక్కరు. ఈయన తండ్రి గోవింద్రరావు బారామతి రైతు సహకార (సహకారి ఖరేది విక్రీ సంఘ్) లో ఉన్నారు.[4] ఈయన 1950వ దశకంలో బారామతి ప్రాంతంలో సహకార చక్కెర మిల్లులను ఏర్పాటు చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈయన తల్లి శారదా భాయి 1937, 1952 మధ్య మూడుసార్లు జిల్లా స్థానిక బోర్డుకి ఎన్నికైంది.[5]

రాజకీయ జీవితం[మార్చు]

ఈయన 1956లో ప్రవారణగర్లో గోవా స్వాతంత్ర్యం కోసం నిరసన ప్రదర్శనను నిర్వహించాడు. కళాశాలలో అతను విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు. ఈయన 1958లో కాంగ్రెస్ పార్టీ కి ప్రాధాన్యత ఇచ్చి యూత్ కాంగ్రెస్‌లో చేరాడు. ఈయన 1962లో పూనా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. 1967లో 27 సంవత్సరాల వయసులో మహారాష్ట్ర శాసనసభ యొక్క బారామతి నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు. 1969లో ప్రధాని ఇందిరా గాంధీతో పాటు తన గురువు యశ్వంతరావు చవాన్‌తో కలిసి కాంగ్రెస్ (ఆర్) వర్గంలో చేరాడు. 1970ల ప్రారంభంలో బారామతి ఎమ్మెల్యేగా, మహారాష్ట్రలో తీవ్రమైన కరువు ఉన్న సమయంలో పెర్కోలేషన్ ట్యాంకులను నిర్మించడంల ముఖ్యపాత్ర పోషించాడు. 1970ల ప్రారంభంలో ఆనాటి ముఖ్యమంత్రి వసంతరావు నాయక్ మంత్రివర్గంలో ఈయన రాష్ట్ర హోం వ్యవహారాల మంత్రిగా పనిచేసాడు. 1975-77 శంకరరావు చవాన్ ప్రభుత్వంలో హోం వ్యవహారాల మంత్రిగా కొనసాగాడు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జనతా కూటమికి అధికారాన్ని కోల్పోయింది. దీనికి నైతిక బాధ్యత వహించిన ఆనాటి ముఖ్యమంత్రి శంకరరావు చవాన్ రాజీనామా చేశాడు. ఈయన తన 38 సంవత్సరాల వయస్సులో మహారాష్ట్ర రాష్ట్రానికి అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు.ఈయన 1987లో కొన్ని రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ (ఐ) లో చేరాడు. 1988లో ఆనాటి భారత ప్రధాన మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శంకరరావు చవాన్‌కు తన కేంద్ర మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా స్థానం కల్పించి, చవాన్ స్థానంలో ముఖ్యమంత్రిగా శరద్ పవార్‌ను ఎంపిక చేశారు. 1990 మార్చి 4న ఈయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపన[మార్చు]

1999 లో 12వ లోక్ సభ రద్దు చేయబడి, 13వ లోక్ సభ ఎన్నికలు వచ్చిన తరువాత కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈయన, సంగ్మా కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. శివసేన-బిజెపి కలయిక తిరిగి అధికారంలోకి రాకుండా ఉండటానికి 1999 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరువాత మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ కొత్త పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన విలాస్రావ్ దేశ్‌ముఖ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్‌సిపి తరపున చాగన్ భుజ్‌బాల్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు.[6]

మూలాలు[మార్చు]

  1. Sakshi (1 February 2014). "37 మంది ఏకగ్రీవం.. రాజ్యసభకు పవార్, దిగ్విజయ్, వోరా". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  2. 2.0 2.1 2.2 "Detailed Profile: Shri Sharad Chandra Govindrao Pawar". India.gov.in. Retrieved 17 December 2016.
  3. Sunita Aron (1 April 2016). "The pawar power play". The Dynasty: Born to Rule. Hay House, Inc. ISBN 978-93-85827-10-5.
  4. Pawar, Rohit (15 May 2019). "Rohit Pawar". Theprint.in.
  5. Shiri Ram Bakshi; Sita Ram Sharma; S. Gajrani (1998). Contemporary Political Leadership in India:Sharad Pawar :The Maratha legacy. APH Publishing. pp. 123–130. ISBN 978-81-7648-007-9.
  6. Sanghvi, Vijay (2006). The Congress, Indira to Sonia Gandhi. Gyan Publishing House. p. 210. ISBN 978-81-7835-340-1.

వెలుపలి లంకెలు[మార్చు]