అజిత్ పవార్
![]() | ఈ వ్యాసాన్ని తాజాకరించాలి.(ఫిబ్రవరి 2025) |
అజిత్ పవార్ | |||
![]() 2021లో అజిత్ పవార్ | |||
8వ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 డిసెంబరు 05 | |||
పదవీ కాలం 2019 డిసెంబరు 30 – 2022 జూన్ 29 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
పదవీ కాలం 2019 నవంబరు 23 – 2019 నవంబరు 26 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
పదవీ కాలం 2012 అక్టోబరు25 – 2014 సెప్టెంబరు 26 | |||
గవర్నరు | *కే . సంకరనారాయణన్ | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
పదవీ కాలం 2010 నవంబరు 10 – 2012 సెప్టెంబరు 25 | |||
గవర్నరు | *ఎస్. సి. జమీర్
| ||
ముందు | ఛగన్ భుజబల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | డియోలాలీ ప్రవరా, మహారాష్ట్ర | 22 జూలై 1959||
నివాసం | బారామతి, సహయోగ్ , మహారాష్ట్ర , భారతదేశం |
అజిత్ అనంతరావు పవార్[1](జననం: 1959 జూలై 22)[2] మహారాష్ట్రకు చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 2024 డిసెంబరు 5 నుండి ఏక్‌నాథ్ షిండేతో పాటు మహారాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతను గతంలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[3]
అతను 2022 నుండి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. 1991లో బారామతి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.[4][5] అతను పలుమార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[6]
రాజకీయ జీవితం
[మార్చు]అజిత్ పవార్ తన శరద్ పవార్ పెద్ద నాన్న అడుగుజాడల్లో 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేసి 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. అతను 1991లో బారామతి లోక్‌సభ స్థానం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. అజిత్ పవార్ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను ఆ స్థానం నుండి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించాడు.[7]
అజిత్ పవార్ అనంతరం సుధాకర్‌రావు నాయక్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా తొలిసారి భాద్యతలు చేపట్టి ఆ తరువాత శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు, 1999లో శరద్ పవార్ కాంగ్రెస్‌ను వీడి ఎన్‌సిపి స్థాపించినప్పుడు అతను వెంటే పార్టీలో చేరి అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్-ఎన్‌సిపి పొత్తు పెట్టుకోగా విలాస్‌రావు దేశ్‌ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. అతను ఆ తరువాత అశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో మంత్రిగా & ఉపముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.
ఇతర పార్టీలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Still Deputy CM, but Ajit Pawar outplayed sulking Shinde. This is how". India Today (in ఇంగ్లీష్). 2024-12-05. Retrieved 2024-12-05.
- ↑ https://www.business-standard.com/article/news-ani/ajit-dada-pawar-the-man-who-took-the-limelight-119112300465_1.html
- ↑ "In Ajit Pawar's Shock Switch, A Sharad Pawar Question Ahead of 2024". NDTV (in ఇంగ్లీష్).
- ↑ "Ajit Pawar new Opposition leader in Maharashtra assembly | India News - Times of India". The Times of India. 4 July 2022.
- ↑ "Deputy CM for fourth time: The return of Ajit Pawar". India Today (in ఇంగ్లీష్). December 30, 2019. Retrieved 2021-09-18.
- ↑ "अजित पवार पाचव्यांदा उपमुख्यमंत्री; राज्यात दोन उपमुख्यमंत्री कसे? जाणून घ्या उपमुख्यमंत्रीपदाचा इतिहास". 3 July 2023.
- ↑ Eenadu (3 July 2023). "బాబాయ్ బాటలో నడిచి.. రెండుసార్లు తిరుగుబాటు చేసి." Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.