బారామతి లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
బారామతి లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 18°9′23″N 74°34′49″E |
బారామతి లోక్‌సభ నియోజకవర్గం (Baramati Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. కేంద్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఇక్కడి నుంచి 6 సార్లు విజయం సాధించాడు. తొలిసారి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తరఫున, 3 సార్లు కాంగ్రెస్ తరఫున, ఆ తర్వాత రెండు సార్లు నేషనలిస్ట్ పార్టీ తరఫున గెలుపొందినాడు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఈ నియోజకవర్గపు ప్రస్తుత లోక్‌సభ సభ్యురాలు.
నియోజకవర్గంలోని సెగ్మెంట్లు
[మార్చు]విజయం సాధించిన అభ్యర్థులు
[మార్చు]- 1977: సంభాజీరావు కకాడే (భారతీయ లోక్‌దళ్)
- 1980: శంకర్‌రావు పాటిల్ (కాంగ్రెస్ ఐ)
- 1984:శరద్ పవార్ (ఇండీయన్ కాంగ్రెస్ సోషలిస్ట్)
- 1985 (ఉప ఎన్నిక) : సంభాజీరావు కకాడే (జనతా పార్టీ)
- 1989: శంకర్‌రావు పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
- 1991: అజిత్ పవార్ (కాంగ్రెస్ పార్టీ)
- 1996: శరద్ పవార్ (కాంగ్రెస్ పార్టీ)
- 1998: శరద్ పవార్ (కాంగ్రెస్ పార్టీ)
- 1999: శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
- 2004: శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
- 2009: సుప్రియా సూలే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
- 2014: సుప్రియా సూలే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
- 2019: సుప్రియా సూలే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
2009 ఎన్నికలు
[మార్చు]2009 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుప్రియా సేలే తన సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాంతా నలవాడేపై 3,36,831 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. సుప్రియాకు 4,87,827 ఓట్లు రాగా, నలవాడేకు 1,50,996 ఓట్లు లభించాయి.