రాంటెక్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాంటెక్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°24′0″N 79°18′0″E మార్చు
పటం

రాంటెక్ లోక్‌సభ నియోజకవర్గం (Ramtek Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు ఈ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎన్నికయ్యాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముకుల్ వాస్నిక్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు[మార్చు]

  1. కటోల్
  2. సావనెర్
  3. హింగ్నా
  4. ఉమ్రెద్
  5. కాంథి
  6. రాంటెక్

విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

  • 1957: కృష్ణారావ్ గులాబ్‌రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1962:మాధవ్‌రావ్ భగవంత్‌రావ్ పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1967: ఏ.జి.సోనార్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1971: అమ్రిత్ గణ్‌పత్ సోనార్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1977: బార్వే జతిరాం చితారాం (కాంగ్రెస్ పార్టీ)
  • 1980: బార్వే జతిరాం చితారాం (కాంగ్రెస్ ఐ)
  • 1984: పి.వి.నరసింహారావు (కాంగ్రెస్ పార్టీ)
  • 1989: పి.వి.నరసింహారావు (కాంగ్రెస్ పార్టీ)
  • 1991: తేజ్‌సింగ్‌రావ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
  • 1996: దత్తాత్రేయ్ రఘోభాజీ మేఘా (కామ్గ్రెస్ పార్టీ)
  • 1998: రాణి చిత్రలేఖ భోసలే (కాంగ్రెస్ పార్టీ)
  • 1999: సుబోధ్ మోహితే (శివసేన)
  • 2004: సుబోధ్ బాబూరావ్ మోహితే (శివసేన పార్టీ)
  • 2007 (ఉప ఎన్నిక): ప్రకాష్ జాదవ్ (శివసేన పార్టీ)
  • 2009: ముకుల్ వాస్నిక్ (కాంగ్రెస్ పార్టీ)
  • 2014: కృపాల్ తుమనే, శివసేన
  • 2019: కృపాల్ తుమనే, శివసేన

2009 ఎన్నికలు[మార్చు]

2009 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముకుల్ వాస్నిక్ తన సమీప ప్రత్యర్థి శివసేన పార్టీకి చెందిన కృపాల్ తుమానేపై 16,701 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ముకుల్ వాస్నిక్‌కు 3,11,614 ఓట్లు రాగా, కృపాల్‌కు 2,94,913 ఓట్లు లభించాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రకాష్‌భావ్ తెంబూర్నేకు 62,238 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]