వి. కె. కృష్ణ మేనన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి. కె. కృష్ణ మేనన్
వి. కె. కృష్ణ మేనన్


భారత రక్షణ మంత్రి
పదవీ కాలము
17 ఏప్రిల్ 1957 – 31 అక్టోబరు 1962
ముందు కైలాస్ నాథ్ కట్జు
తరువాత యశ్వంతరావు చవాన్

త్రివేండ్రం నుంచి లోక్ సభ సభ్యుడు
పదవీ కాలము
1971 – 1974

మిడ్నాపూర్ నుంచి లోక్ సభ సభ్యుడు
పదవీ కాలము
1969 – 1971

ఉత్తర ముంబై నుంచి లోక్ సభ సభ్యుడు
పదవీ కాలము
1957 – 1967

భారతదేశం తరపున యునైటెడ్ నేషన్స్ రాయబారి
పదవీ కాలము
1952 – 1962

కేరళ నుంచి రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలము
1956 – 1957

మద్రాసు రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలము
1953 – 1956

యు. కె లోని భారత హై కమీషనర్
పదవీ కాలము
1947 – 1952
ముందు Position established
తరువాత బి. జి. ఖేర్

వ్యక్తిగత వివరాలు

జననం (1896-05-03) 1896 మే 3
కాలికట్, మలబార్ జిల్లా,
మద్రాస్ ప్రెసిడెన్సీ,
బ్రిటిష్ ఇండియా
మరణం 1974 అక్టోబరు 6 (1974-10-06)(వయసు 78)
ఢిల్లీ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
పూర్వ విద్యార్థి ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై
మద్రాస్ లా కాలేజ్
యూనివర్శిటీ కాలేజ్ లండన్
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్
పురస్కారాలు పద్మ విభూషణ్ (1954)

వెంగలీల్ కృష్ణన్ కృష్ణ మేనన్ (మే 3, 1896 – అక్టోబరు 6, 1974) భారత జాతీయవాది, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు. మొట్టమొదటి ప్రధాని నెహ్రూకు అత్యంత ఆప్తుడుగా పేరు గాంచాడు. కొంతమంది ఒక దశలో ఈయనను, నెహ్రూ తర్వాత అంతటి శక్తివంతుడుగా అభివర్ణించారు. [1][2]

ఆయన మంచి వక్తగా, తెలివైన వాడుగా, కరుకైన వాడిగా పేరు గాంచాడు. భారతదేశములోనూ, పాశ్చాత్య దేశాల్లోనూ ఆయన పొగిడే వాళ్ళూ, విమర్శించే వాళ్ళు సమాన సంఖ్యలో ఉన్నారు. ఆయనను సమర్ధించే వారు పాశ్చాత్య దేశాల ఆధిపత్య ధోరణిని వ్యతిరేకించి వారి స్థాయిని వారికి తెలియపరిచిన వాడిగా భావిస్తే,[3] ఆయన్ను విమర్శించే పాశ్చాత్యులు మాత్రం ఆయన నెహ్రూను నడిపించే క్షుద్ర మేధావి గా అభివర్ణించారు.[4]

యుక్తవయస్సులో ఉండగా మేనన్ పెంగ్విన్ బుక్స్ సంస్థకు సంపాదకుడిగా పని చేశాడు. బయటి దేశాల్లో భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రాచుర్యం కల్పించాడు. లండన్ లో ఇండియా లీగ్ ను స్థాపించడం ద్వారా యూకేలో పలుచోట్ల పర్యటించి భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాల్సిన అవసరం గురించి జనం యొక్క మద్ధతు కూడగట్టడానికి ప్రయత్నించాడు. సోవియట్ యూనియన్ లాంటి శక్తివంతమైన దేశం నుంచి మద్ధతు రాబట్టగలిగాడు.

మూలాలు[మార్చు]