నిర్మలా సీతారామన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్


భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1959-08-18) 1959 ఆగస్టు 18 (వయస్సు 62)
తిరుచిరాపల్లి, తమిళనాడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి పరకాల ప్రభాకర్ (ఆంధ్రప్రదేశ్)
సంతానం ఒక కుమార్తె
నివాసం కొత్త ఢిల్లీ, భారత్
పూర్వ విద్యార్థి జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
మతం హిందూ

నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది .సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్‌, అందునా.. పూర్తిస్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వశాఖను చేపట్టిన తొలి మహిళ సీతారామన్ కావడం విశేషం.నిర్మలా సీతారామన్‌ 2019లో ఆర్థిక మంత్రిగా భాద్యతలు నిర్వహించింది.[1][2]

నేపథ్యం[మార్చు]

నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించింది .

విద్యాభాస్యం[మార్చు]

1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది . న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందింది.

రాజకీయ జీవితం[మార్చు]

తొలినాళ్లలో ‘ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేసింది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేసింది. 2003-05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేసింది. అత్తమామలు కాంగ్రెస్‌కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఇది దోహదపడింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా, 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించింది .2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈమె వివాహం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ, టీవీ వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్ తో జరిగింది. వీరికి ఒక కుమార్తె. ప్రభాకర్ కూడా జేఎన్‌యూలోనే చదివాడు .

మూలాలు[మార్చు]

  1. నిర్మలా సీతారామన్‌, నిర్మలా సీతారామన్‌. "ప్రపంచంలో ఇప్పటి వరకు రక్షణ మంత్రులుగా పనిచేసిన మహిళలు వీరే..!". http://www.andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 4 September 2017. {{cite web}}: External link in |website= (help)
  2. Sakshi (1 June 2019). "తొలి మహిళా ఆర్థిక మంత్రి". Sakshi. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)

బయటి లింకులు[మార్చు]