జాతీయ మహిళ కమిషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ మహిళ కమిషన్
राष्ट्रीय महिला आयोग
కమిషన్ అవలోకనం
స్థాపనం 1992
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ
కమిషన్ కార్యనిర్వాహకుడు/ రేఖ శర్మ, చైర్ పర్సన్
వెబ్‌సైటు
http://www.ncw.nic.in

జాతీయ మహిళ కమిషన్ 1990 చట్టం ప్రకారం 1990, ఆగస్టు 30న ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొంది, 1992 జనవరి 31వ తేదీన ఏర్పడిన శాసనబద్ధమెన సంస్థ.

నిర్మాణం, నియామకం, పదవీ కాలం

[మార్చు]

జాతీయ మహిళ కమిషన్‌లో ఒక చైర్మన్, 5 మంది సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు, వారి పదవీ కాలం 3 సంవత్సరాలు. ఈ కమిషన్‌లో ఒకరు ఎస్సీ, ఎస్టీ తెగలకు చెందిన వారిని ఒక్కొక్కరిని నియమించాలి. వీరి నియామకం, తొలగింపు అధికారాలు రాష్రపతికే ఉంటాయి.

విధులు

[మార్చు]
  1. మహిళల రక్షణలను పరిరక్షించి, పర్యవేక్షించడం.
  2. కేంద్ర ప్రభుత్వానికి మహిళ సంక్షేమానికి సంబంధించి సూచనలు ఇవ్వడం.
  3. పరివారక్ మహిళ లోక్ అదాలత్ ద్వారా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయడం.
  4. వరకట్న నిషేధచట్టం 1961ని సమీక్షించి, ఆస్తి తగదాలను పరిష్కరించడం
  5. సెమినార్లు, వర్‌‌కషాపులు నిర్వహించి మహిళ సమస్యల పట్ల సమాజంలో అవగాహన కల్పించడం[1]

అధికారాలు

[మార్చు]
  1. మహిళా కమిషన్ ఛైర్మన్ భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాను కలిగి ఉంటారు.
  2. మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలను సమీక్షించి, అవసరమైతే వాటికి సవరణలను సూచించడం.
  3. రాజ్యాంగపరంగా, చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పర్యవేక్షించడం.
  4. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మహిళాభివృద్ధి, ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడం.
  5. మహిళా సమస్యలు, అత్యాచార ఘటనలపై అధ్యయనం చేసి, నేరస్థులకు తగిన శిక్ష పడేలా కృషి చేయడం.

చైర్‌పర్సన్లు

[మార్చు]


నెం పేరు ఫోటో పదవి చేపట్టిన తేదీ పదవి ముగిసిన తేదీ
1 జయంతి పట్నాయక్ 3 ఫిబ్రవరి 1992 30 జనవరి 1995
2 వి.మెహిని గిరి 21 జులై 1995 20 జులై 1998
3 విభా పార్థసారధి 18 జనవరి 1999 17 జనవరి 2002
4 పూర్ణిమా అద్వాని 25 జనవరి 2002 24 జనవరి 2005
5 గిరిజా వ్యాస్ 16 ఫిబ్రవరి 2005 15 ఫిబ్రవరి 2008
గిరిజా వ్యాస్ 9 ఏప్రిల్ 2008 8 ఏప్రిల్ 2011
6 మమత శర్మ [2] 2 ఆగష్టు 2011 1 ఆగష్టు 2014
7 లలిత కుమార మంగళం 29 సెప్టెంబర్ 2014 28 సెప్టెంబర్ 2017
8 రేఖ శర్మ 7 ఆగస్టు 2021[3] 7 ఆగస్టు 2024
9 విజయ కిషోర్ రహత్కర్ 20 అక్టోబర్ 2024

ఇవి కూడా చుడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2015). "జాతీయ కమిషన్లు-విధులు" (in ఇంగ్లీష్). Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
  2. "Mamta Sharma is NCW chief". The Hindu. New Delhi. 3 August 2011. ISSN 0971-751X. Retrieved 19 September 2014.
  3. "Rekha Sharma Is New National Commission for Women Chairperson". NDTV.com. Retrieved 11 March 2021.