పరకాల కాళికాంబ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరకాల కాళికాంబ

శాసనసభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1981 - 1983
నియోజకవర్గం నర్సాపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1930
నర్సాపురం
మరణం 03 జనవరి 2024
మంచిరేవుల గ్రామం, గండిపేట్ మండలం, హైదరాబాద్
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
జీవిత భాగస్వామి పరకాల శేషావతారం
బంధువులు నిర్మలా సీతారామన్ (కోడలు)
సంతానం పరకాల ప్రభాకర్ (కుమారుడు) సహా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు

పరకాల కాళికాంబ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 1981 ఉప ఎన్నికల్లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

పరకాల కాళికాంబ నరసాపురం ఎమ్మెల్యే, 1981లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి హోదాలోనే మృతి చెందిన తన భర్త పరకాల శేషావతారం మరణాంతరం 1981లో నరసాపురం స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.

మరణం[మార్చు]

పరకాల కాళికాంబ 2024 జనవరి 03న హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించింది.[3][4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (30 March 2019). "నారీమణులు.. రాజకీయ దివ్వెలు". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  2. Andhrajyothy (23 September 2023). "చట్ట సభలలో సీట్ల కోసం". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  3. V6 Velugu (3 January 2024). "మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ(94) కన్నుమూత." Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (4 January 2024). "నరసాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ కన్నుమూత". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.