తిరుచిరాపల్లి
కావేరినదీ తీరంలో ఉన్న తిరుచిరాపల్లి జిల్లా తమిళనాడు రాష్ట్ర 30 జిల్లాలలో ఒకటి. తిరుచిరాపల్లి నగరం (తిరుచ్చి) జిల్లాకేంద్రంగా ఉంది.
చరిత్ర[మార్చు]
బ్రిటిష్ రాజ్ కాలంలో తిరుచినాపల్లి జిల్లా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జిల్లా పేరు మార్చబడింది. 2011 గణాంకాల ఆధారంగా జిల్లా జనసంఖ్య 27,22,290.స్త్రీ:పురుషుల నిష్పత్తి 1013:1000.
భౌగోళికం[మార్చు]
తిరుచిరాపల్లి జిల్లా తమిళనాడు రాష్ట్ర జిల్లాలలో ఒకటి. వైశాల్యం 4,404చ.కి.మీ.జిల్లా ఉత్తర సరిహద్దులో సేలం జిల్లా, వాయవ్య సరిహద్దులో నామక్కల్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో పెరంబలూర్ జిల్లా, అరియాలూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో తంజావూరు జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో పుదుక్కొట్టై జిల్లా, దక్షిణ సరిహద్దులో మదురై జిల్లా, శివగంగై జిల్లా, నైరుతీ సరిహద్దులో దిండిగల్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో కరూర్ జిల్లా ఉన్నాయి.
వ్యవసాయం[మార్చు]
జిల్లాలో కోళ్ళపరిశ్రమ, పాలఉత్పత్తి అధికంగా ఉంది. చిన్న గ్రామాలలో వ్యవసాయం ప్రధానంగా ఉంది. ప్రధాన పంటలుగా వరి, చెరకు, అరటి, కొబ్బరి, పత్తి, పోక, మొక్కజొన్న, వేరుచనగ పండించబడుతున్నాయి.
నదులు[మార్చు]
జిల్లాలో కావేరి, కొల్లిడం నదులు ప్రవహిస్తున్నాయి.జిల్లా అంతటా ప్రవహిస్తున్న కావేరీ జలాలు ప్రధాన వ్యవసాయ ఆధారంగా ఉన్నాయి.
సహజ వనరులు, జలాశయాలు[మార్చు]
ప్రధాన నదులు కావేరి, కొల్లిడం. అలాగే కొరియార్, ఉయ్యకొండన్, కుడమూర్తి.
తాలూకాల[మార్చు]
తిరుచిరాపల్లి జిల్లాలో 11 తాలూకాల ఉన్నాయి:
- మనప్పారై తాలూకా
- మరుంగపురి తాలూకా
- శ్రీరంగం తాలూకా
- తిరుచిరాపల్లి వెస్ట్ తాలూకా
- తిరుచిరాపల్లి తూర్పు తాలూకా
- తిరువెరుంబూర్ తాలూకా
- మాల్గుడి తాలూకా
- మనచనల్లూర్ తాలూకా
- తురైయూర్ తాలూకా
- ముసిరి తాలూకా
- తొట్టియం తాలూకా
నగరకేంద్రాలు[మార్చు]
తిరుచిరాపల్లి జిల్లా క్రింది నగర కేంద్రాలలో కలిగి:
- తిరుచ్చి సిటీ
- శ్రీరంగం
- మనప్పారై పట్టణం
- తురైయూర్ పట్టణం
- తూవకూడి పట్టణం
- మాల్గుడి పట్టణం పంచాయతీ
- మణచనల్లూర్ పట్టణం పంచాయతీ
- ముసిరి పట్టణం పంచాయతీ
- తొట్టియం పట్టణం పంచాయతీ
- కొల్లి కొండలు (కొళ్ళిమలై) పర్యాటక పట్టణం
- ఉప్పిలియపురం శ్రీరాములు
- నావలూర్ కొట్టపట్టు పంచాయతీ
ప్రధాన పరిశ్రమలు[మార్చు]
- భరత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ " బీహెచ్ఈఎల్ ".
- బాయిలర్ ఉత్పత్తి పరిశ్రమలు
- సిమెంట్ ఫ్యాక్టరీ
- కాంతి, భారీ ఇంజనీరింగ్
- లెదర్ తోళ్ళ (ఇ.ఐ. లెదర్)
- ఆహార ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్
- షుగర్ మిల్స్
- (సాంప్రదాయ) సిగార్ మేకింగ్ (గ్రామం) ఇండస్ట్రీస్.
- అల్లిక పని, దుస్తులు (ఒక చిన్న వరకు)
- ఐటి / బిపివో
పర్యాటక ఆకర్షణలు[మార్చు]
తిరుచిరాపల్లి జిల్లాలో సందర్శించడానికి స్థలాలు:
- ముక్కొంబు
- శ్రీరంగం స్వామి దేవాలయం
- తిరువనై కోయిల్ శివాలయం
- వయలూర్ మురుగన్ దేవాలయం
- కులుమండి అమ్మవారి ఆలయం,
- పుతూర్-చోళింగనల్లూరు.
- సమయపురం మరియమ్మన్ దేవాలయం
- వెక్కాళియమ్మన్ ఆలయం, వొరియూర్
- రాతికోట, ఉచ్చిపిళ్ళైయార్ ఆలయం
- కళ్ళనై
- టోల్గేట్ ఉత్తమర్ కోయిల్ ఆలయం
- తిరుపత్తూర్ బ్రహ్మ ఆలయం
- పుళియన్ చోళై
- పాచై మాలై
- కొల్లి మాలై
- మాల్గుడి శివన్ దేవాలయం
ప్రధాన పంటలు[మార్చు]
జిల్లాలో కావేరి, కొళ్ళిడం ఆనకట్ట ఉన్నకారణంగా జిల్లాలోని విశాలమైన భూభాగాలలో వ్యవసాయం చేయబడుతుంది. కావేరీ డెల్టా ఏర్పాటు చేయటానికి శాఖలు ప్రారంభం చేసారు.
- వడ్లు (విశాలమైన భాగాల)
- చెరకు (విశాలమైన భాగాల)
- అరటి
- కొబ్బరి
- పత్తి (చిన్న భూభాగాలు)
- తమలపాకు
- మొక్కజొన్నలు
- వేరుశనగ
గణాంకాలు[మార్చు]
విషయం | వివరణ |
---|---|
2011 గణాంకాల ఆధారంగా జనసంఖ్య | 2,722,290 |
స్త్రీ: పురుషులు | 1013:1000 |
జాతీయ సరాసరి 929.[3] | అధికం |
6 సంవత్సరాలకు లోబడిన వారు | 272,456 |
బాలురు | 139,946 |
స్త్రీలు | 132,510 |
షెడ్యూల్డ్ జాతులు | 17.14% |
షెడ్యూల్డ్ తెగలు | 67% |
అక్షరాస్యత | 74.9% |
జాతీయ సరాసరి 72.99%.[3] | తక్కువ |
కుటుంబాలు | 698,404 |
శ్రామికులు | 1,213,979 |
వ్యవసాయదారులు | 161,657 |
వ్యవసాయ కూలీలు | 319,720 |
కుటీరపరిశ్రమల ద్వారా ఉపాధి పొదుతున్న ప్రజలు | 25,174 |
ఇతర శ్రామికులు | 575,778 |
మార్జినల్ శ్రామికులు | 131,650 |
మార్జినల్ వ్యవసాయదారులు | 9,012 |
మార్జినల్ వ్యవసాయకూలీలు | 59,062 |
కుటీరపరిశ్రమలలో మార్జినల్ శ్రామికులు | 5,212 |
ఇతర మార్జినల్ శ్రామికులు | 58,364[4] |
మూలాలు[మార్చు]
- ↑ www.tn.gov.in
- ↑ (Excel).
{{cite web}}
:|format=
requires|url=
(help); Missing or empty|title=
(help); Missing or empty|url=
(help) - ↑ 3.0 3.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
- ↑ "Census Info 2011 Final population totals - Tiruchirappalli district". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Tiruchirappalli district. |
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- CS1 errors: missing title
- CS1 errors: format without URL
- CS1 errors: requires URL
- Articles with short description
- Short description is different from Wikidata
- Pages using infobox settlement with unknown parameters
- Commons category link from Wikidata