ప్రొటెస్టంటు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కేథలిక్ క్రైస్తవ మతములో చీలిక వల్ల ఏర్పడిన శాఖ ప్రొటెస్టంటు శాఖ.ఒకప్పుడు యూరోప్ లో కేథలిక్ చర్చిలలో బహిరంగ పాప ప్రక్షాలన ప్రార్థనలు చెయ్యించే వారు. చాలా మంది నీతిలేని వాళ్ళు కావాలని పాపాలు చేసి చర్చికి వచ్చి పాపాలు కడిగేసుకునే వాళ్ళు. పాప ప్రక్షాలన ప్రార్థనలను వ్యతిరేకించినందుకు మార్టిన్ లూథర్ అనే వ్యక్తిని వారి మతము నుంచి బహిష్కరించారు. పరిశుధ్ధ బైబిలు గ్రంథములో వ్రాయబడని విషయాలను కేథలిక్ క్రైస్తవ మతము వారు పాటించడాన్ని మార్టిన్ లూథర్ ప్రొటెస్ట్ (Protest) చేయడం వలన అతనికి ప్రొటెస్టంట్ అని, అతని అభిప్రాయాలను సమ్మతించిన వారిని ప్రొటెస్టంట్లు అని పిలవడం మొదలయింది. కేథలిక్ బైబిల్ లోని ఈ క్రింది గ్రంథాలను దైవ ప్రేరిత గ్రంథాలు కావని తొలిగించారు.

 1. తోబితు
 2. యూదితు
 3. మక్కబీయులు1
 4. మక్కబీయులు2
 5. సొలోమోను జ్ఞానగ్రంధము
 6. సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము
 7. బారూకు

ప్రొటెస్టంటు ఉద్యమానికి భయపడి కేథలిక్ చర్చిలలో పాప ప్రక్షాలన ప్రార్థనలని నిషేదించారు కానీ వాళ్ళు ఇళ్ళలో పాప ప్రక్షాలన ప్రార్థనలు చేసుకుంటారు.


ప్రాముఖ్యముగా ఏసుక్రీస్తు తల్లియైన మరియమ్మను పూజించడం, విగ్రహారాధన, అన్యజనుల ఆచారాలను అభ్యసించడం మొదలైనవాటి గురించి పరిశుధ్ధ బైబిలు గ్రంథములో వ్రాయకపోవటం వలన వాటిని ప్రొటెస్టంట్లువ్యతిరేకిస్తారు. దేవుడిచ్చిన పది ఆజ్ఞలలో "నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు" " పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్ళయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు." అనే ఆజ్ఞలు, "యేహోవా సెలవిచ్చుచున్నదేమనగా - అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి" (యిర్మియా 10: 2) అనే వాక్యము వీరికి ఆధారం.