యేసు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
యేసు పునరుత్దానము

భాగం వ్యాసముల క్రమం

Christian cross.svg

 
యేసు
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్
మూలాలు
చర్చి · కొత్త కాన్వెంట్
అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక
బైబిల్
పాత నిబంధన · కొత్త నిబంధన
గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా
క్రైస్తవ ధర్మం
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ)
చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్
చరిత్ర మరియు సాంప్రదాయాలు
ప్రథమ · సంఘాలు · వర్గలు · మిషనరీలు
తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు
తెగలు
క్రైస్తవ మత విషయాలు
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం
ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు
సంగీతం · లిటర్జీ · కేలండరు
చిహ్నాలు · కళలు · విమర్శ
P christianity.svg క్రైస్తవ పోర్టల్

యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి క్రీ.శ 26–36 వరకు) [1] నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట క్రైస్తవ మతము పౌలు గారిచే అంతియొకయలో ప్రారంబించబడింది. ఈయన యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది.ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానం.


యేసుక్రీస్తుపై విభిన్న క్రైస్తవ ధృక్కోణాలు పాతనిబంధన గ్రంథం లేదా యూదు తోరాహ్ లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే అని, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే భావనల పై కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక శాతం క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు మరియు దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా భావిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే క్రైస్తవులు యేసుని దైవ కుమారునిగా భావిస్తారు.యేసు దైవత్వము సంబంధంచిన గూఢార్థాల విద్యను క్రిస్టోలొజి అని పిలుస్తారు. చరిత్రకారులు మానవ చరిత్రను యేసు క్రీస్తు జీవించిన కాలాన్ని కొలమానంగా తీసుకుంటారు. క్రీస్తు జన్మించక ముందు కాలాన్ని (B.C - Before Christ) అని, క్రీస్తు శకం అనగా క్రీస్తు జన్మించిన తర్వాత కాలాన్ని (A.D - Anno Domini, In the year of our lord) అని అందురు.

యేసు జీవిత కాలం: యేసు జీవిత చరిత్ర నాలుగు సువార్తల్లో ఉందిగాని, యేసు క్రీస్తు పుట్టిన తేదీలేదు.పశ్చిమ దేశములలోని క్రైస్తవులు అంతా క్రీస్తు జన్మదిన పండుగగా క్రిస్టమస్ ను డిసెంబరు 25 వ తేదీన ఆనయాయతీగా జరుపుకొంటున్నారు.రోమా క్రైస్తవులు సుమారు క్రీ.శ.330 నుండి అలా జరుపుకొంటున్నారు.

యేసు జీవితం-భోదన[మార్చు]

మూస:యేసు సువార్త

frisky (చర్చ) 06:01, 5 ఫిబ్రవరి 2015 (UTC)kiran kumari

పుట్టుక, ప్రారంభ జీవితం[మార్చు]

జీసస్ మరియు మేరీ- జెస్టోచోవా కు చెందిన నల్ల మడొన్నా

మత్తయి మరియు మార్కు సువార్తలలో యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది. మత్తయి సువార్త యందు యేసు తండ్రియైన యోసేపు యొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలున్నాయి.యేసు యొక్క వంశ మూలపురుషులు రాజైన దావీదు మరియు అబ్రహాము.

Adoration of the Shepherds, Gerard van Honthorst , 17th c.

క్రీస్తు జన్మను గురించి బైబిల్ గ్రంధంలో ఆర్యుల వేద కాలం నాటి పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యముగా క్రీస్తు పూర్వం, అనగా 700 B.C లో ప్రవక్త యోషయా తన గ్రంధంలో యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రవచించడం గమనార్హం.

 • యోషయా 7:14 - "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మనుయేలు అని పిలుచును".

అలాగే యోషయా 53 వ అధ్యాయం కూడా యేసు ప్రభువు గురించి ప్రరోక్షంగా ప్రవచించడం విశేషం.

యోషయా మరణించిన 700 సంవత్సరాల తర్వాత ఏసు బెత్లహేము అను గ్రామంలో యోసేపు, మరియ దంపతులకు జన్మించడం జరిగింది. కన్యక యైన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మము గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగినది.

 • మత్తయి సువార్త 1:18 - 25 - యేసు క్రీస్తు జననమెట్లనగా ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.| ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.| అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది. పరిశుద్ధాత్మ వలన కలిగినది;| ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.| ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు (భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్ధము) అను పేరు పెట్టుదురు - అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను.

యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్నాపించిన ప్రకారము చేసి, బెత్లహేము అను గ్రామంలో తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకూ ఆమెను ఎరుగకుండా అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాడు. తూర్పుదేశపు జానులు హేరోదు అను రాజు వద్దకు వచ్చి "యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజించడానికి వచ్చాం" అని చెప్పారు. హేరోదు రాజు ప్రధాన యాజకులను, శాస్త్రులను సమకూర్చి - క్రీస్తు ఎక్కడ పుట్టునని అడుగగా వారు యూదాదేశపు బెత్లహేములోనే అని అన్నారు. అంతట హేరోదు రాజు తూర్పుదేశపు పండితులను బెత్లహేముకు పంపాడు. ఆ పండితులు ఆకాశంలో నక్షత్రాన్ని బట్టి యేసు పుట్టిన ఇంటి వచ్చారు. యేసు, ఆయన తల్లిదండ్రుల ఎదుట వారికి సాగిలపడి యేసును పూజించి ఆయనకు బంగారం, సాంబ్రాణి, బోళాన్ని బహూకరించారు. హేరుదు రాజు వద్దకు తిరిగి వెళ్ళొద్దని దూత చెప్పగా తూర్పుదేశపు జ్నానులు మరో మార్గంలో తమ దేశానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు దూత యోసేపునకు స్వప్నంలో ప్రత్యక్షమై హేరోదు రాజు శిశువు చంపదలచి వెదుకుచున్నాడు అని చెప్పగా యేసేపు తన కుమారుడైన యేసును, భార్య అయిన మరియను ఐగుప్తు (ఈజిప్టు) దేశమునకు పారిపోయాడు. హేరోదు బెత్లహేములో 2 సంవత్సరము మొదలుకొని అంతకంటే తక్కువ వయసున్న మగ పిల్లలను సంహరింపచేశాడు. హేరోదు రాజు మరణించిన పిమ్మట ప్రభువు దూత చెప్పగా యేసేపు తన కుటుంబాన్ని తీసుకొని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళాడు. మళ్ళీ స్వప్నమందు ప్రభువు దూతచే బోధింపబడి యేసేపు గలిలయ ప్రాంతాలలో నజరేతు అను గ్రామంలో స్థిరపడ్డాడు. ఆ కాలంలో యోహాను అను ప్రవక్త తన సువార్త (యోహాను సువార్త 3: 16 - 35)లో "దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియుందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అయనను అనుగ్రహించెను" అని వ్రాయడం జరిగినది.

 • లూకా సువార్త 1:26 - ఆరవ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో|దావీదు వంశస్తుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. | ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి - దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.| ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి - ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత - మరియా, భయపడకుము; దేవుని వలను నీవు కృపపొందితివి.| ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;| ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.| ఆయన యాకోబు వంశస్తులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.| అందుకు మరియ - నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా| దూత - పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.|

ఆ రోజుల్లో సర్వలోకానికి ప్రజాసంఖ్య (జనాభాలెక్క) వ్రాయాలని కైసరు ఔగస్తు అను రాజు నిర్ణయించాడు. ఆ ప్రకారం యేసేపు దావీదు గోత్రము (యూదా గోత్రము) లోను, వంశములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయ పట్టణంలోని బెత్లహేము అనబడిన ఊరికి వెళ్ళాడు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండి తన తొలిచూలు కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి, సత్రములో స్థలం లేనందున పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఈ సంగతి దేవదూతచే గొర్రెల కాపరుకు తెలియపరచబడింది.

యేసు వడ్రంగి (మార్కు|6:3), వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు.(మత్తయి|13:55).

'బాప్తీస్మము'

యేసు యోహాను ద్వారా బాప్తీస్మము పొందడం యేసు యొక్క పరిచర్య ప్రారంభం.యోర్దాను నదిలో ప్రజలకు బాప్తీస్మమిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యోహాను యొద్దకు యేసు బాప్తీస్మము పొందడానికి వచ్చాడు."తన యొద్దకు బాప్తీస్మము పొందడానికి వచ్చిన యేసును చూసిన యోహాను తనకు యేసునే బాప్తీస్మమిమ్మని అడిగితే , యేసు ఇప్పటికి నీతి నెరవేరునట్లుగా తనకు యోహానునే బాప్తీస్మమిమ్మని" అడిగాడు. యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశము తెరుచుకొని,దేవుని ఆత్మ పావురము వలే దిగివచ్చింది. "ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించు చున్నాను" అని పరలోకము నుండి ఒక స్వరము వినబడిందని మత్తయి సువార్త 3 లో కనిపిస్తుంది.

బోధనలు, సేవ[మార్చు]

Sermon on the Mount, Carl Heinrich Bloch, 19th c.

యేసు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని బైబిలు వాక్యాల్లో కనిపిస్తుంది.

మరణం[మార్చు]

యేసు క్రీస్తు శిలువయాగం గురించి బైబిలులో పలుచోట్ల ప్రవచించబడింది, ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 16: 21 - 28, మత్తయి 20: 17 - 19, లూకా సువార్త 9:22, మార్కు సువార్త 9:30 లో యేసు క్రీస్తు ప్రవచించడం కనిపిస్తుంది. యేసు క్రీస్తును ఇస్కరియేతు యూదా అను వ్యక్తి పిలాతు అను రాజుకు అప్పగించండం, యేసుక్రీస్తు శిలువయాగం ప్రస్తావన మత్తయి 26, 27, మార్కు 14, 15, యోహాను 18, 19 అధ్యాయాల్లో కనిపిస్తుంది.

పునరుత్థానము[మార్చు]

పునరుద్ధానం అనగా క్ర్రైస్తవ పరిభాషలో మరణించిన తర్వాత ఆత్మ రూపంలో తిరిగి లేవడం. పునరుత్థానాన్ని మరణంపై యేసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ జరుపుకుంటారు. కేధలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వారు జరుపుకునే శిలువధ్యానాలు (Lent Days) భస్మ బుధవారం (Ash wednesday) తో ఆరంభమై ఈస్టర్ రోజుతో ముగిస్తుంది. (ఇంకావుంది)

వివాహం[మార్చు]

యేసు ఆజన్మ బ్రహ్మచారి (అవివాహితుడు) అని క్రొత్త నిబంధనలోని ఆయన జీవిత చరిత్ర తెలుపుచున్నది. అయితే యేసు ఆయన శిష్యురాలైన మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నాడని క్ర్రైస్తవేతరులు ప్రచారం చేయడం జరుగుచున్నది.

ఈజిప్టు సమీపంలో ఉన్న నాగ హమ్మడి (Nag Hammadi) అనే పట్టణ పరిధిలో ఉన్న గుహల్లో కొన్ని ప్రతులు బయల్పడినాయి. వీటిని నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. ఇవి క్రీస్తు శరీరధారి కాదని, ఆత్మస్వరూపి గనుక శిలువ వేయబడలేదని చెబుతాయి. క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న వీటిని చర్చివారు నిషేధించారు. అందులో క్రీస్తు మరణించిన సుమారు 300 - 400 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి వ్రాసిన పత్రిక ఒకటి. ఈ పత్రికలో క్రీస్తు మగ్ధలేని మరియను ముద్దు పెట్టుకొన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కాల క్రమేణా ఈ విషయాన్ని క్రైస్తవేతరులు ప్రక్కత్రోవ పట్టించి క్రీస్తు వివాహం చేసుకున్నాడని అన్నారు. 'ముద్దు పెట్టుకున్నంత మాత్రమున క్రీస్తు మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నట్లు కాదని, ఒకవేళ వివాహం చేసుకొని ఉంటే 'వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది' (హెబ్రీయులు 13:4) అని చెప్పిన యేసుక్రీస్తు మగ్ధలేని మరియను భార్యగా ఒక్కసారైనా సమాజానికి పరిచయం చేసి ఉండేవాడని, మగ్ధలేని మరియ నిజంగా క్రీస్తు భార్య అయి ఉంటే ఫిలిప్పు వ్రాసిన పత్రికలో క్రీస్తును తన శిష్యులు "ఆమెను మాకంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా?" అని అడుగరని, యోకోబు రెండవ ప్రకటనలో ఏసుక్రీస్తు యోకోబును ముద్దు పెట్టుకొన్నట్లుగా ఉందని కనుక మగ్ధలేని మరియను ఏసుక్రీస్తు వివాహమాడినట్లు సాక్ష్యం లేదని గ్రంథ పండితుల వాదన.

పూర్తి వ్యాసం కొరకు ఫిలిప్పు వ్రాసిన పత్రిక చదవండి.

ఏసు బోధనలు[మార్చు]

భీమునిపట్నం వద్ద యేసు విగ్రహం (గొర్రెల కాపరిగా)
 • నీతికోసం హింసను అనుభవించినవారిదే దేవుని రాజ్యం. కనుక వారు ధన్యులు.
 • నరహత్య చేయరాదు. ఒకరిని మానసికంగా బాధపెట్టడంకూడా నరహత్యే.
 • పరుల సొమ్ము ఆశించరాదు.
 • వ్యభిచరింపరాదు. పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే
 • మిమ్మల్ని హింసించినవారి కోసం దేవుణ్ణి ప్రార్ధించండి.
 • మీరు దానం చేసినప్పుడు నలుగురికీ తెలిసేలా చేయకండి
 • మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి; అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.
 • ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే , తన కోరికలను కాదనుకొని శిలువనెత్తుకొని వెంబడించాలి.
 • మొదట నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేస్తే, నీ సోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయడం సులభం
 • వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది.
 • విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది. మార్కు 11: 23
 • ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటిని పొందియున్నామని నమ్మండి. అప్పుడు మీకు అని కలుగును. మార్కు 11: 24
 • నేను నీతిమంతులకోసం రాలేదు, పాపులను రక్షించడానికి వచ్చాను.
 • నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.
 • చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులు
 • దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్ధించండి.
 • నేనే మార్గమును, సత్యమును, జీవమును
 • మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. లూకా 16:15

యేసు ఉనికి[మార్చు]

ఇతర విషయలు[మార్చు]

ఏసుక్రీస్తు అనే పేరు హిందూమత పుస్తకాల్లో ఎక్కడా కనిపించదు. ఆయితే ఈ పుస్తకాల్లో ప్రజాపతి అనే దేవుడి పాత్ర మాత్రం ఏసుక్రీస్తుకు సాదృశ్యంగా కనిపిస్తుంది.

 • రుగ్వేదము 10:90:7 - బలియాగ సమయములో ప్రజాపతి బలిపీఠమునకు కట్టబడి, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడి, చంపబడి, మూడవ రోజున తిరిగి లేచును.
 • బృహత్ అరణ్యక ఉపనిషత్తు 3.9.28.2:
 • భవిష్య పురాణము, ప్రతిసర్గ పర్వం 19: 17 - 32
 • పురుషసూక్తము
 • శతపధ బ్రాహ్మణము
 • ఐతరేయ బ్రాహ్మణము 3.2.9:

అయితే ప్రజాపతి చేసిన పాపాలకు ముక్కలయ్యాడని, యేసుక్రీస్తు మాత్రం పాపరహితుడని, కనుక ప్రజాపతి ఏసుక్రీస్తుకు సాదృశ్యం కాదని పండితుల అభిప్రాయం.

(ఇంకావుంది)

మూలాలు[మార్చు]

 1. Some of the historians and Biblical scholars who place the birth and death of Jesus within this range include D. A. Carson, Douglas J. Moo and Leon Morris. An Introduction to the New Testament. Grand Rapids, MI: Zondervan Publishing House, 1992, 54, 56; Michael Grant, Jesus: An Historian's Review of the Gospels, Scribner's, 1977, p. 71; John P. Meier, A Marginal Jew, Doubleday, 1991-, vol. 1:214; E. P. Sanders, The Historical Figure of Jesus, Penguin Books, 1993, pp. 10-11, and Ben Witherington III, "Primary Sources," Christian History 17 (1998) No. 3:12-20.

బయట లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=యేసు&oldid=1539808" నుండి వెలికితీశారు