భీమునిపట్నం
భీమునిపట్నం | |
భీమునిపట్నం గంటస్తంభం | |
ముద్దు పేరు: భీమిలి | |
భీమునిపట్నం మండలం | |
విశాఖపట్నం లో భీమునిపట్నం | |
భీమునిపట్నం మండలం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°53′11″N 83°26′50″E / 17.886385°N 83.447109°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
ప్రభుత్వం | |
- Type | పురపాలక సంఘం భీమునిపట్నం |
- పురపాలక సంఘం అధ్యక్షుడు | |
పిన్ కోడ్ | 531163 |
ఎస్.టి.డి కోడ్ | |
వెబ్‌సైటు: భీమునిపట్నం పురపాలక సంఘం |
భీమునిపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ చెందిన పట్టణప్రాంతం.[1] విశాఖపట్నం నగరపాలక సంఘంలో విలీనం కాక ముందు భారతదేశంలో ఇది రెండవ పురపాలక సంఘం (మునిసిపాలిటీ) ఆంధ్రప్రదేశ్‌లోని మొట్టమొదటి పురపాలక సంఘం. (భారత దేశంలో మొట్టమొదటి మునిసిపాలిటీ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం) [2]. ఇప్పటికి కుడా పూర్వపు మునిసిపాలిటీ కార్యాలయం పెంకులతో నిర్మించబడి ఉంది. ప్రాంతీయులు ఈ గ్రామాన్ని భీమిలి అని పిలుస్తారు. భీమిలి విశాఖపట్టణానికి 24 కి.మీ. దూరంలో విశాఖ - భీమిలి బీచ్ రోడ్డుపై చివరన ఉంది.భీముని పట్టణం పశ్చిమం వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్రతీరానికి వచ్చేటప్పటికి పల్లం కావడం వల్ల పశ్చిమం నుండి తూర్పుకు సముద్రతీరం వైపు చూస్తే కనిపించే పకృతి దృశ్యం అత్యంత రమణీయంగా ఉంటుంది. ఈ పట్టణంలోని లాటిరైటు శిలలపై ప్రాచీనమైన బౌద్ధకేత్రం పావురాళ్ళకొండ ఉంది. ఈ కొండ దిగువన తూర్పునకు నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఇంకో విశేషం ఇక్కడ ఇప్పటికీ డచ్ వారి వలస స్థావర అవశేషాలు ఉన్నాయి. భీమిలీ బీచ్ లోతు ఉండదు కాబట్టి ఈత కొట్టడం క్షేమదాయకం.
చరిత్ర[మార్చు]
బుద్ధుని అవశేషాలలోని ఎనిమిదవ భాగం భీమిలి సమీపంలోని తిమ్మాపురం బావికొండ బౌద్ధకేత్రంలో లభ్యమైందట.1641వ సంవత్సరంలో హైదరాబాదు నవాబు మహమ్మద్ కులీకుతుబ్ షా నుండి అనుమతి పొందారు డచ్ దేశస్థులు.1754లో జరిగిన మరాఠీ దాడుల్లోనూ, 1781 లో ఫ్రాన్స్, బ్రిటన్‌ల మధ్య జరిగిన యుద్ధంలోనూ డచ్‌కోట పాక్షికంగా ధ్వంసమైంది. 1825 లో భీమిలి రేవు పట్టణం బ్రిటిష్‌వారి వశమైంది. 1854లో రిప్పన్ కంపెనీని ప్రారంభించారు.[3] యాత్రా చరిత్ర, రచయిత మండపాక పార్వతీశ్వర శాస్త్రి తన గ్రంథంలో.... పుట 6 లో భీముని పట్నం గురించి ఇలా వ్రాసి యున్నారు.
సముద్రతీరమందు భీముని పట్టణమున్నది. ఇందులో మునసబు వగైరాల ఖచేరీలున్నవి. దొరలు సైతమున్నారు. రేవుస్థలమైనందున ధనిక వర్తక భూయిష్టమైయున్నది. ఇది కొండదిగువనున్నందున నిమ్నోన్నతముగా నున్నది.
భీమిలి ఆకర్షణలు[మార్చు]
పావురాళ్ళకొండ లేదా పావురాళ్ళబోడు భీమునిపట్నం వద్ద నరసింహస్వామి కొండగా ప్రసిద్ధమైన కొండ యొక్క స్థానికనామం. ఈ కొండ సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉంది. పావురాళ్ళకొండ, ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల దొరికిన ముఖ్య క్షేత్రం, ఇక్కడ బౌద్ధ విహారం యొక్క శిథిలాలు ఉన్నాయి. ఇక్కడ క్రీ.పూ మూడవ శతాబ్దం నుండి సా.శ. రెండవ శతాబ్దం వరకు జనవాసాలు ఉండి ఉండవచ్చని అంచనా. ఉత్తర తీరాంధ్రలోని అతిపెద్ద బౌద్ధ విహార క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ కొండపై నున్న క్షేత్రంలో హీనయాన బౌద్ధం ప్రభవించి ఉండవచ్చు.
1226 శాలివాహన శకంలో ఈ దేవస్థాన పునరుద్ధరణ మింది రామ రమజోగి చేత జరిగింది. ఆ తరువాత ముగుగప్ప శెట్టి, అలగప్ప శెట్టి స్వామి వారికి కాంస్య కవచాన్ని బహుకరించారు.
- నారాయణుని దశావతారాలలో నర, మృగ మిశ్రమ రూప అవతారం ఇదొక్కటే. మన రాష్ట్రంలో నారసింహ మూలక్షేత్రాలు, 32 క్షేత్రాల పరంపరలో, చివరిదిగా విరాజిల్లుతున్న క్షేత్రం, భీమునిపట్నంలోని ప్రహ్లాద వరద శ్రీకాంత నృసింహస్వామి దివ్యసన్నిధి. లక్ష్మీనారాయణ స్వరూపంగా నృసింహుడు అలరారే ఈ దేవస్థానంతోపాటు, భీమసేన ప్రతిష్ఠిత భీమేశ్వరాలయం గూడా ఇక్కడే ఉంది.
16-18 శతాబ్ధాల మధ్య ఐరోపా ఖండం వారు భారతదేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చిన భాగంగా భీమిలిలో డచ్ వారు దిగారు. 1624 డచ్ వారు ఇక్కడ మొదట వలస వచ్చినప్పుడు ప్రాంతీయులకు డచ్ వారికి మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలలో 101 మంది డచ్ సైనికులు 200 మంది ప్రాంతీయులు మరణించారు (విశాఖ శాసనాల వల్ల తెలుస్తోంది). ఆ తరువాత ప్రాంతీయులకు డచ్ వారికి సంధి కుదిరి వర్తకం చేసుకోవడానికి 1661లో 4 కొమంలతో ఒక కోట 234*400 వైశాల్యంతో నిర్మించుకొన్నారు. ఈ కోట ఇప్పుడు శిథిలమై పోయి అవశేషాలు మిగిలాయి. ఈ కోటలో గడియార స్తంభం, టంకశాల ఉన్నాయి.
పట్టణ మధ్యలో ఉన్న ఈ గడియార స్థంబాన్ని ప్రతి పర్యాటకుడు దర్శించి తీరాలి.
1855-1864 సంవత్సరాల మధ్య ఈ చర్చి నిర్మాణం రాయి రెవరెండు జాన్ గ్రిఫిన్స్ ద్వారా అప్పటి జిల్లా కలక్టరు, జిల్లా మెజిస్ట్రేటు రాబర్ట్ రీడ్ ఆధ్వర్యంలో జరిగింది. తరువాత 17-3-1864 న భిషప్ గెల్ చేత ఈ చర్చి తెరువబడింది. ఈ చర్చి నిర్మాణ శైలి, లోపలి వస్తువులు, తూర్పు కిటికి మీద ఏసుక్రీస్తుని శిలువ వేస్తున్న సంఘటను చిత్రించిన విధానం చాల విశేషంగా ఉంటుంది. ఈ చర్చిలో ఎంతో కాలం ముందు నిర్మించిన పాలరాతి శిల్పాలు నేత్రానందాన్ని అందిస్తాయి.పట్టణానికి పశ్చిమంగా నిర్మించబడిన ఈ శ్మశానవాటిక డచ్ వారి ఈ పట్టణంలో నివసించారని చెప్పడానికి, వారి జీవితం ఇక్కడే పూర్తి చేసారని చెప్పడానికి ఋజువు. ఈ శ్మశానంలో వారిని ఖననం చేసిన ప్రదేశంలో వారి మరణానికి కారణాలను తెలుపుతూ రాతి ఫలకాలు ఉన్నాయి. ఈ అతిథి గృహం చిట్టివలస జూట్ కర్మాగారం ఆధీనంలో ఉంది. పూర్వం ఈ అతిథి గృహంలో ఇంపీరియల్ బ్యాంకు ఉండేది. ఆ తరువాత ఈ గృహాన్ని చిట్టివలస ఝూట్ మిల్లు వారు దత్తత తీసుకొని ఈ గృహం చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. ఈ పట్టణ వైభవాన్ని చెప్పడానికి ఈ అతిథి గృహం ఒక తార్కాణం. భీమిలి దర్శించడానికి వచ్చిన ప్రతి సందర్శకుడు ఈ అతిథి గృహాని చూసి తీరవలసిందే.
మునిసిపాలిటీ సత్రం రెండు రాళ్లపై మద్రాసు పెంకులతో కట్టబడింది.
పురపాలక సంఘ కార్యాలయము, నౌకాశ్రయ రవాణా కార్యాలయం ఒకే సముదాయములో ఉన్న ఈ రెండు భవనాలు ఇక్కడి నౌకాశ్రయము యొక్క ఎగుమతులు, దిగుమతుల పూర్వవైభవాన్ని గుర్తు చేస్తాయి. ఈ విశాల భవనాలలో ఎత్తైన పైకప్పుతో ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
కాకినాడకు శ్రీకాకుళానికి మధ్య నిర్మించబడిన ఎనిమిది దీప స్తంభాలలో (లైటు హౌసు) ఇది ఒకటి. ఈ దీప స్తంభం 18 వ శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్ని తెలుపుతుంది.
పట్టణ ముఖ్య రహదారిపై ఉన్న దేవాలయ సముదాయంలో ఉన్న ప్రాచీన దేవాలయం 1170 శాలివాహన శకంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దీనికి అనుబంధంగా చోళేశ్వరాలయం చోళులచే నిర్మించబడింది.
చేరుకొను విధానం[మార్చు]
భీమిలీ నుండి విశాఖకు తరచూ, ఆర్.టి.సి. సిటి బస్సులు 999, 900 టి, 900 కే నడుస్తుంటాయి. 24 కి.మీ.ల పొడవున్న ఈ బీచ్ రోడ్డు భారతదేశంలోని పెద్ద బీచ్ రోడ్డులలో ఒకటిగా చెబుతారు. ద్విచక్రవాహనాల పైన కూడా విశాఖ నుండి భీమిలికి చేరు కొవచ్చు. విశాఖ నుండి తరచు అద్దె కారులు అందుబాటులోవుంటాయి.
ప్రముఖులు[మార్చు]
చిత్ర మాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Two municipalities merged in GVMC | Deccan Chronicle". web.archive.org. 2015-02-18. Retrieved 2019-12-07.
- ↑ "హిందు దిన పత్రీకలో భీమిలి ఆంధ్ర ప్రదేశ్ మొదటి మునిసిపాలిటీ అని రాసిన అంశం". Archived from the original on 2006-09-09. Retrieved 2007-06-29.
- ↑ మండపాక, పార్వతీశ్వర శాస్త్రి (సంవత్సరం 1915). యాత్రా చరిత్ర (PDF) (శ్రీ రంగరాయ విలాస ముద్రాక్షరశాల ed.). బొబ్బిలి: ప్రచురణకర్త శ్రీ రంగరాయ విలాస ముద్రాక్షరశాల. p. 6. Retrieved 16 June 2016.
{{cite book}}
: Check date values in:|date=
(help); horizontal tab character in|date=
at position 10 (help); horizontal tab character in|publisher=
at position 16 (help)[permanent dead link]
వెలుపలి లంకెలు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Bheemunipatnam. |