పాండురంగపురం (విశాఖపట్నం)
పాండురంగాపురం
పాండురంగాపురం | |
|---|---|
సమీపప్రాంతం | |
పాండురంగాపురం బీచ్ రోడ్ | |
| Coordinates: 17°42′57″N 83°19′21″E / 17.715738°N 83.322434°E | |
| దేశం | |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | విశాఖపట్టణం |
| Government | |
| • Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
| భాషలు | |
| • అధికారిక | తెలుగు |
| Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
| పిన్ కోడ్ | 530003 |
| Vehicle registration | ఏపి-31 |
పాండురంగపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర తీరప్రాంతంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1][2] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం, నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి సుమారు 4 కి.మీ.ల దూరంలో ఉంది.[3]
భౌగోళికం
[మార్చు]ఇది 17°42′57″N 83°19′21″E / 17.715738°N 83.322434°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]బంగాళాఖాతంకు సమీపంలో ఉన్న పాండురంగాపురం చుట్టూ మహరాణిపేట, కిర్లంపూడి లేఅవుట్, దస్పల్లా హిల్స్ ఉన్నాయి.[4]
ఇతర వివరాలు
[మార్చు]నగరంలోని సంపన్నమైన నివాస ప్రాంతాలలో ఇదీ ఒకటి.[5]
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పాండురంగపురం మీదుగా రవీంద్ర నగర్, గాంటియాడ హెచ్‌బి కాలనీ, హనుమంతువాక, అప్పుగర్, ఎంవిపి కాలనీ, పెద వాల్తేరు, సిరిపురం, రామకృష్ణ బీచ్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్, కాన్వెంట్, సింధియా, మల్కాపురం, న్యూ గాజువాక, పెదగంట్యాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[6]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- ఉత్కల్ సంస్కృతకా సమాజ్
- సంపత్ వినాయగర్ దేవాలయం
- రూహని షిఫా ఖానా
- మసీదు - యాసిన్ మసీదు
- మహ్మదీయా మసీదు
మూలాలు
[మార్చు]- ↑ "Pandurangapuram, Paanduranga Puram Locality". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2021.
- ↑ "Pandurangapuram, Chinna Waltair, Paanduranga Puram Locality". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2021.
- ↑ "location". the hans india. 14 July 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2021.
- ↑ "about". the hindu. 29 August 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2021.
- ↑ "overview". deccan chronicle. 14 May 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2021.