దొండపర్తి
స్వరూపం
దొండపర్తి | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°43′42″N 83°18′06″E / 17.728272°N 83.301650°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530016 |
Vehicle registration | ఏపి-31, 32, 33 |
దొండపర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఒక నివాస, వాణిజ్య ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిధిలో, ద్వారకా నగర్ ప్రాంతానికి సమీపంలో ఉంది.[2]
భౌగోళికం
[మార్చు]ఇది 17°43′42″N 83°18′06″E / 17.728272°N 83.301650°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది. దొండపర్తి విశాఖపట్నం నగర కేంద్రానికి దక్షిణాన, సిటీ సెంటర్ నుండి 1.8 కి.మీ.ల దూరంలో ఉంది. దోండపార్తి చుట్టూ రైల్వే న్యూ కాలనీ రోడ్, తాటిచెట్లపాలెం రోడ్, అక్కయ్యపాలెం రోడ్, రైల్వే స్టేషన్ రోడ్ ఉన్నాయి.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దొండపర్తి మీదుగా గాజువాక, గోపాలపట్నం, ఎన్ఎడి ఎక్స్ రోడ్, అరిలోవ, మద్దిలపాలెం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- కనకదుర్గ దేవాలయం
- గణపతి దేవాలయం
- వేణుగోపాలస్వామి దేవాలయం
- నిషాని ఇ హజ్రత్ ఖ్వాజా గారిబ్ నవాజ్
- మసీదు-ఇ-నూర్ అక్కయ్యపాలెం
- మసీదు-ఇ-అక్సా
మూలాలు
[మార్చు]- ↑ "Dondaparthy, Railway New Colony Locality". www.onefivenine.com. Retrieved 17 May 2021.
- ↑ "about". the hindu. 14 April 2019. Retrieved 17 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 17 May 2021.