రుషికొండ
రుషికొండ | |
|---|---|
విశాఖ నరరం విలీనమైన ప్రాంతం | |
స్టార్టప్ విలేజ్ బిల్డింగ్. | |
![]() Interactive map of రుషికొండ | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | విశాఖపట్నం |
| భాష | |
| • అధికార | తెలుగు |
| Time zone | UTC+5:30 (IST) |
రుషికొండ,ఇది పూర్తిగా మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన పట్టణ ప్రాంతం. విశాఖపట్నం , భీమిలి రహదారిలో ఉన్న పరిసర ప్రాంతం. విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ ఈ ప్రాంత మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగ అభివృద్ది చేస్తుంది.[1][2] రుషికొండ, ద్వారకానగర్ పరిసర ప్రాంతాలలో తెలుగు సినిమా పరిశ్రమ నెలకొని ఉంది..[3] సమాచార సాంకేతికత రంగంలో చాలా ఉపయోగకరమైన ప్రదేశం.
ఫిన్‌టెక్ వ్యాలీ వైజాగ్
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపార మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడానికి, కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి, అలాగే పెట్టుబడిదారులను, బహుళజాతి సంస్థలను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్వేక చొరవతో, విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక, సాంకేతిక రాజధానిగా అభివృద్ధి చేసే లక్ష్యంతో, ఫిన్‌టెక్ వ్యాలీని 2016 డిసెంబరులో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రుషికొండలో ఫిన్‌టెక్ వ్యాలీ వైజాగ్ అనే సంస్థను ప్రారంభించాడు.[4] [5] [6]
లొకేషన్
[మార్చు]రుషికొండ.[7]
మిలీనియం ఐటి టవర్స్
[మార్చు]ఇది సమాచార సాంకేతికత మౌలిక సదుపాయాలు వృద్ధిలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా విశాఖపట్నం నగరాన్ని ఫైనాన్షియల్-టెక్ (ఫిన్‌టెక్) రాజధానిగా చేయడంలో భాగంగా రుషికొండలో ఏర్పాటు చేయబడింది. [8] [9] [10] మిలీనియం ఐటీ టవర్ 1ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించాడు [11]
రవాణా మార్గాలు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మార్గాలు
| మార్గం సంఖ్య | ప్రారంభం | గమ్యస్థానం | వయా |
|---|---|---|---|
| 900K | రైల్వేస్టేషన్ | భీమిలి | ఆర్.టి.సి కాంప్లెక్స్, సిరిపురం, పెదవాల్తేరు, అప్పుఘర్, సాగర్‌నగర్, రుషికొండ, తిమ్మాపురం, ఐ.ఎన్.ఎస్ కళింగ |
| 900T | రైల్వేస్టేషన్ | తగరపు వలస | ఆర్.టి.సి కాంప్లెక్స్, సిరిపురం, పెదవాల్తేరు, అప్పుఘర్, సాగర్‌నగర్, రుషికొండ, తిమ్మాపురం, ఐ.ఎన్.ఎస్ కళింగ |
| 999 | ఆర్.టి.సి కాంప్లెక్స్ | భీమిలి | మద్దిలపాలెం, హనుమంత్ వాక, యెండాడ, మధురవాడ, ఆనందపురం |
| 17K | ఓల్డ్ పోస్టు అఫీసు | భీమిలి | టౌన్ కొత్తరోడ్, జగదాంబ సెంటర్, ఆర్.టి.సి కాంప్లెక్స్, సిరిపురం, పెదవాల్తేరు, అప్పుఘర్, సాగర్‌నగర్, రుషికొండ, తిమ్మాపురం, ఐ.ఎన్.ఎస్ కళింగ |
| 52E | ఓల్డ్ పోస్టు అఫీసు | పెదరుషికొండ | టౌన్ కొత్తరోడ్, జగదాంబ సెంటర్, ఆర్.టి.సి కాంప్లెక్స్, మద్దిలపాలెం, హనుమంత్ వాక, యెండాడ, మధురవాడ, ఆనందపురం |
దృశ్యమాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Beach Park on Visakha-Bheemili Beach Road". Visakhapatnam Urban Development Authority. the original నుండి 17 జూలై 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 June 2014.
- ↑ "Rushikonda Beach needs a makeover". The Times of India.
- ↑ "Rushikonda Beach needs a makeover". The Times of India.
- ↑ "Vizag will be innovation, IT hub: Naidu". The Statesman. 2018-10-24. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-04-02.
- ↑ "New IT initiatives to put Vizag on technology map". theweek.in. the original నుండి 2018-02-22 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-04-02.
- ↑ AuthorIANS. "Vizag may soon emerge as hub of new age technologies". Telangana Today. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-04-02.
- ↑ "రుషికొండ · విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం". రుషికొండ · విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-06-30.
- ↑ Amarnath K. Menon Vizag (November 9, 2018). "Andhra Pradesh: The Making of a Tech Hub". India Today. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-01-15.
- ↑ Fintech Valley, Vizag (9 February 2017), Fintech Valley Vizag, India., ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 August 2020
- ↑ "Andhra Pradesh eyeing Rs 500 crore investment from Fintech in next 2 yrs". Moneycontrol. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-01-08.
- ↑ "Naidu inaugurates Millennium Tower I in Vizag". The Hindu. 15 February 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 April 2019.
