అనకాపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనకాపల్లి
అనకాపల్లి సమీపంలో ప్రఖ్యాత అంశాలు పైన ఎడమనుండి సవ్యదిశలో: బొజ్జనకొండ, అనకపల్లి నగర దృశ్యం, రైల్వే స్టేషను, వీధులు, శారద నదిపై రైలువంతెన, సత్యనారాయణ కొండ
అనకాపల్లి సమీపంలో ప్రఖ్యాత అంశాలు
పైన ఎడమనుండి సవ్యదిశలో: బొజ్జనకొండ, అనకపల్లి నగర దృశ్యం, రైల్వే స్టేషను, వీధులు, శారద నదిపై రైలువంతెన, సత్యనారాయణ కొండ
అనకాపల్లి is located in Andhra Pradesh
అనకాపల్లి
అనకాపల్లి
Location in Andhra Pradesh
నిర్దేశాంకాలు: 17°41′29″N 83°00′14″E / 17.6913°N 83.0039°E / 17.6913; 83.0039Coordinates: 17°41′29″N 83°00′14″E / 17.6913°N 83.0039°E / 17.6913; 83.0039
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంమహానగరపాలక సంస్థ
 • నిర్వహణమహా విశాఖ నగరపాలక సంస్థ
 • శాసనసభ సభ్యుడు(రాలు)గుడివాడ అమరనాధ్
 • లోకసభ సభ్యుడు(రాలు)బీసెట్టి వెంకట సత్యవతి
విస్తీర్ణం
 • మొత్తం23.28 km2 (8.99 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు29 మీ (95 అ.)
జనాభా వివరాలు
(2011)[3]
 • మొత్తం86,519
 • సాంద్రత3,700/km2 (9,600/sq mi)
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
531001/02
ప్రాంతీయ ఫోన్ కోడ్08924
వాహనాల నమోదుAP31 (పాత)
AP39 (30 జనవరి 2019 నుండి)[4]
శాసనసభ నియోజకవర్గంఅనకాపల్లి
లోకసభ నియోజకవర్గంఅనకాపల్లి

అనకాపల్లి మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణప్రాంతం. 2013కు ముందు పురపాలక సంఘ నిర్వహణలో గల పట్టణంగా వుండేది.[5] ఇది అనకాపల్లి జిల్లాకు ముఖ్యపట్టణం. విశాఖపట్నం నగరానికి 30 కి.మీ. దూరంలోగల ఈ ప్రాంతం కొబ్బరి, బెల్లం వ్యాపారాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బొజ్జన్నకొండ ప్రముఖ బౌద్ధక్షేత్రం.

చరిత్ర[మార్చు]

ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత గజపతులు, కాకతీయులు, కుతుబ్ షాహి రాజులు పాలించారు. సుమారు 1450 ప్రాంతంలో ఆర్కాటు నవాబు అధీనంలో అప్పలరాజు, ఇతర క్షత్రియ వంశీయులు దీనికి స్థానిక పాలకులైనారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకులు అనకాపల్లిని దర్శించారు.

భౌగోళికం[మార్చు]

అనకాపల్లి పట్టణం 'శారదా నది' అనే నది తీరాన ఉంది. అక్షాంశ రేఖాంశాలు17°41′N 83°01′E / 17.68°N 83.02°E / 17.68; 83.02.[6] ఇది సముద్ర మట్టానికి 26 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం తూర్పు కనుమలు విస్తరించిన భాగంలో ఉంది.

వైద్య సదుపాయాలు[మార్చు]

  • ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు వారి 'ఏరియా హాస్పిటల్' వంద పడకలు కలిగిన పబ్లిక్ హాస్పిటల్.[7]

వ్యవసాయం[మార్చు]

ఈ ప్రాంతంలో వరి, చెరకు, కొబ్బరి ముఖ్యమైన పంటలు.

పరిశ్రమలు[మార్చు]

  • ఆనకాపల్లి బెల్లం పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో ఇది అతి పెద్ద బెల్లం ఉత్పత్తి, వ్యాపార కేంద్రం. మొత్తం దేశంలో రెండవ స్థానంలో ఉంది.[ఆధారం చూపాలి]
  • అనకా పల్లి సమీపంలో 'వెలగపూడి స్టీల్ మిల్స్' అనే ఉక్కు పరిశ్రమ ఉంది.[8]
  • అనకాపల్లి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మపాలలో 'అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారం' ఉంది.
  • చుట్టుప్రక్కల గ్రామాలకు అనకాపల్లి ప్రధాన వ్యాపార కేంద్రం.
  • విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ, సింహాద్రి పవర్ ప్లాంట్‌లు అనకాపల్లికి దగ్గరలోనే ఉన్నాయి. (సుమారు 15 కి.మీ.)

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

  • అప్పలరాజు కులదేవత కాకతాంబిక ఆలయం. తరువాతి కాలంలో ఈ దేవతను నూకాలమ్మ లేదా నూకాంబిక అన్నారు. ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది. ఉగాదికి ముందుగా వచ్ఛు దినమైన క్రొత్త అమావాస్య' నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.[9] నూకాంబిక అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది.[10]
  • 'గౌరమ్మ గుడి' మరొక ప్రసిధ్ద ఆలయం. జనవరి మాసాంతంలో ఇక్కడ 10 రోజుల సంబరం జరుగుతుంది.
  • అనకాపల్లి పట్టణానికి సమీపంలో బొజ్జన్నకొండలో బౌద్ధారామ అవశేషాలున్నాయి.[11]
  • అనకాపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో 'సత్యనారాయణపురము' వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది.
  • పట్టణానికి 12 కి.మీ. దూరంలోని దేవీపురంలో శ్రీచక్రాకృతిలో నిర్మించబడిన రాజరాజేశ్వరీదేవి ఆలయం ప్రసిద్ధి చెందింది.[12]
  • దగ్గరలో ఉన్న పుడిమడక, ముత్యాలమ్మపాలెం, తంతడి బీచ్ అందమైనవి.
  • ఏటికొప్పాక లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందింది.

ప్రముఖులు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

  1. "District Census Handbook – Visakhapatnam" (PDF). Census of India. pp. 26, 52. Retrieved 13 February 2016.
  2. "Maps, Weather, and Airports for Anakapalle, India". fallingrain.com.
  3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
  4. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
  5. "Two municipalities merged in GVMC | Deccan Chronicle". Deccan Chronicle. 2013-07-31. Archived from the original on 2015-02-18. Retrieved 2019-12-07.
  6. "Falling Rain Genomics.Anakapalle". Archived from the original on 2008-02-12. Retrieved 2008-03-18.
  7. "APVVP.Hospitals". Archived from the original on 2008-01-08. Retrieved 2008-03-18.
  8. "The Hindu Business Line : Re-rolling steel mill inaugurated". Archived from the original on 2007-09-29. Retrieved 2008-03-18.
  9. "The Hindu". Archived from the original on 2004-09-17. Retrieved 2008-03-18.
  10. "నూకాంబిక జాతర ఏర్పాట్లు పక్కాగా ఉండాలి". andhrajyothy. 2022-03-29. Archived from the original on 2022-03-28. Retrieved 2022-03-28.
  11. "The Hindu". Archived from the original on 2007-03-11. Retrieved 2008-03-18.
  12. Devipuram

వెలుపలి లంకెలు[మార్చు]