Jump to content

కుతుబ్ షాహీ వంశం

వికీపీడియా నుండి
కుతుబ్ షాహీ

1518–1687
Location of కుతుబ్ షాహీ
రాజధానిహైదరాబాద్
సామాన్య భాషలుఫారసి , ఉర్దూ , దక్కని (ఉర్దూ +పార్శి భాషల కలయిక)
ప్రభుత్వంMonarchy
కుతుబ్ షాహీ 
• 1518-1748
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్
• 1672-1687
అబుల్ హసన్ కుతుబ్ షా
చరిత్ర 
• స్థాపన
1518 1518
• పతనం
1687
విస్తీర్ణం
500,000 కి.మీ2 (190,000 చ. మై.)
ద్రవ్యంనాణేలు - హోన్ను (బంగారు) , ఫణం(వెండి)
Preceded by
Succeeded by
బహుమనీ సామ్రాజ్యం
బ్రిటీష్ ఇండియా

కుతుబ్ షాహీ వంశం (ఈ వంశస్థులను కుతుబ్ షాహీలు అంటారు) దక్షిణ భారతదేశం లోని గోల్కొండ రాజ్యం పాలించిన పాలక వంశం. ఈ వంశస్థులు తుర్కమేనిస్తాన్-ఆర్మేనియా ప్రాంతంలోని తుర్కమేన్ తెగకు చెందిన షియా ముస్లింలు.

స్థాపన

[మార్చు]

కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్, 16వ శతాబ్దం ప్రారంభంలో కొందరు బంధువులు, స్నేహితులతో కలసి ఢిల్లీకి వలస వచ్చాడు. తరువాత దక్షిణాన దక్కన్ పీఠభూమికి వచ్చి బహుమనీ సుల్తాన్ మహమ్మద్ షా కొలువులో పనిచేసాడు. అతడు గోల్కొండను జయించి హైదరాబాద్ రాజ్యానికి అధిపతి అయ్యెను. 1518లో బహుమనీ సామ్రాజ్యం పతనమై ఐదు దక్కన్ సల్తనత్ ఆవిర్భవించుచున్న సమయములో బహుమనీ సుల్తానుల నుండి స్వతంత్రం ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టం స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశం స్థాపించాడు.

పరిపాలన

[మార్చు]

ఈ వంశము తెలుగు వారిని పరిపాలించిన తొలి ముస్లిం వంశం. ఈ వంశం 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలు దక్కన్ని జయించేవరకు, 175 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించింది. ఆ తరువాత 1948లో హైదరాబాదు రాజ్యం, న్యూఢిల్లీ సైనిక జోక్యం (పోలీసు చర్య) తో భారతదేశంలో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉంది.

కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా, శాస్త్ర పోషకులు. వీరు పర్షియన్ సంస్కృతిని పోషించడమే కాకుండా, ప్రాంతీయ దక్కన్ సంస్కృతికి చిహ్నమైన తెలుగు భాష, కొత్తగా అభివృద్ధి చెందిన ఉర్దూ (దక్కనీ) ను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యములో ఒక ప్రముఖ భాగమైనందున, వాళ్ల మాతృ భాష కాకపోయినా, గోల్కొండ పాలకులు తెలుగు భాష అభ్యసించారు. గోల్కొండ, ఆ తరువాత హైదరాబాదు రాజ్యానికి రాజధానులుగా ఉండేవి, ఉభయ నగరాలును కుతుబ్ షాహీ సుల్తానులే అభివృద్ధి చేశారు.

వంశ క్రమం

[మార్చు]

ఈ వంశానికి చెందిన ఎనిమిది రాజులు క్రమంగా:

  1. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ (1518 -1543)
  2. జంషీద్ కులీ కుతుబ్ షా (1543-1550)
  3. సుభాన్ కులీ కుతుబ్ షా (1550)
  4. ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1550-1580)
  5. మహమ్మద్ కులీ కుతుబ్ షా (1580-1612)
  6. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా (1612-1626)
  7. అబ్దుల్లా కుతుబ్ షా (1626-1672)
  8. అబుల్ హసన్ కుతుబ్ షా (1672-1687)

1.సుల్తాన్ కులీ కుతుబ్ షా: ఇతని కాలం లో ఇతనికి సమకాలికులు 1. శ్రీకృష్ణ దేవరాయలు 2. బాబర్, హుమాయూన్

ఇతని రాజ్య విస్తరణకు కారకులయిన సేనాధిపతులు 1. హైధర్ ఉల్ముల్క్ 2. మురారీరావ్. మురారి రావ్ అహోభిలమ్ దేవాలయం పై దండెత్తాడు

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]