Jump to content

ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటం
రకంజిల్లాలు
స్థానంఆంధ్రప్రదేశ్
సంఖ్య28 జిల్లాలు
జనాభా వ్యాప్తిపోలవరం – 3,49,953 (అత్యల్ప); తిరుపతి – 29,47,547 (అత్యధిక)
విస్తీర్ణాల వ్యాప్తివిశాఖపట్నం – 1,048 కిమీ2[convert: unknown unit] (చిన్నది);
ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఉప విభజనఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, మార్కాపురం జిల్లాలు ఉన్నాయి.

విశాఖపట్నం జిల్లా విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా కాగా, ప్రకాశం జిల్లా పెద్దది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అత్యధికజనాభా కలిగిన జిల్లా అయితే, పార్వతీపురం మన్యం జిల్లా అత్యల్పజనాభా కలిగిన జిల్లాగా గుర్తించబడ్డాయి. ప్రతి జిల్లాను రెండు లేదా అంతకంటే తక్కువ రెవెన్యూ డివిజన్‌లుగా విభజించబడ్డాయి. రెవెన్యూ డివిజన్లును పరిపాలనా ప్రయోజనాల కోసం మండలాలుగా ఉపవిభజన చేయబడ్డాయి.

చరిత్ర

[మార్చు]

స్వాతంత్ర్యం వచ్చేనాటికి నేటి ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో భాగంగాఉండేది. తెలుగు మాట్లాడే ఆధిపత్య ప్రాంతాలైన కోస్తాాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు 1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడింది.[1]

ఆంధ్రరాష్ట్రంలో అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి అనే 11 జిల్లాలు ఉండేవి.[2][3]

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ఫలితంగా రాష్ట్ర సరిహద్దులు భాషాపరమైన మార్గాలను అనుసరించి పునర్వ్యవస్థీకరించబడ్డాయి. 1956 నవంబరు 1న ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. దీనిని పునరాలోచనలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌గా సూచిస్తారు.

ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలతో కలిపి ఆంధ్రరాష్ట్రం లోని 11 జిల్లాల కలిపి మొత్తం 21 జిల్లాలతో ఏర్పడింది. 1959 సంవత్సరంలో, గోదావరి నదికి అవతలి వైపున ఉన్న తూర్పు గోదావరి జిల్లా లోని భద్రాచలం, నూగూరు వెంకటాపురం తాలూకాలు భౌగోళిక సామీప్యత, పరిపాలనా సాధ్యత దృష్ట్యా ఖమ్మం జిల్లాలో విలీనం చేయబడ్డాయి. అదే సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా లోని అశ్వారావుపేట కొంత భాగాన్ని ఖమ్మం జిల్లాకు, కృష్ణా జిల్లాకు చెందిన మునగాల తాలూకాను నల్గొండ జిల్లా లోకి చేర్చారు.[4] 1970లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా, 1979లో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విజయనగరం జిల్లా ఏర్పడడంతో జిల్లాల సంఖ్య 21 నుండి 23కు పెరిగింది.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా విభజించబడిన తర్వాత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌గా పిలవబడే ఆంధ్రప్రాంతం 13 జిల్లాలతో మిగిలిపోయింది. అయితే పోలవరం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుండి (ఒక్క భద్రాచలం పట్టణం తప్ప) 7 గిరిజన ప్రాబల్య మండలాలలోని ముంపు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమయ్యాయి. ఈ మండలాలు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో చేర్చబడ్డాయి.[5][6][7][8]

2022 జిల్లాల పునర్వ్యస్థీకరణ

[మార్చు]

2022 జనవరి 26న, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం, 1974, సెక్షన్ 3 (5) ప్రకారం ప్రాథమిక ప్రకటన జారీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఆధారంగా ప్రతిపాదించింది.[9][10] దీనికి మినహాయింపు విశాలంగా వున్న అరకు లోకసభ నియోజక వర్గాన్ని రెండు జిల్లాలుగా మార్చటం. ప్రజల అభ్యర్ధనల మేరకు, మిగతా చోట్ల 12 అసెంబ్లీ నియోజకవర్గాలను లోక్‌సభనియోజకవర్గం ప్రధానంగా గల జిల్లాలో కాక, ఇతర జిల్లాలలో వుంచారు.[11][12] ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, ప్రభుత్వం 2022 ఏప్రిల్ 3న 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌ను ప్రచురించింది. దాని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులోని షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలు 2022 ఏప్రిల్ 4 నుండి అమలులోకి వచ్చాయి.వాటితో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 26కు చేరుకుంది.[13][14][15]

2025 జిల్లాల పునర్వ్యస్థీకరణ

[మార్చు]

2025 జిల్లాల పునర్నినిర్మాణంలో భాగంగా కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలు 2025 డిసెంబరు 30న ఉనికిలోకి వచ్చాయి. వీటితో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 26 నుండి 28కి చేరుకుంది. ప్రాంతాల వారిగా ఉత్తర ఆంధ్రలో ఏడు జిల్లాలు, కోస్తా ఆంధ్రలో పది జిల్లాలు, దక్షిణాంధ్రలో మూడు జిల్లాలు, రాయలసీమలో ఎనిమిది జిల్లాలు ఉన్నాయి.[16] 2025 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 81 రెవెన్యూ డివిజన్‌లు, 688 మండలాలు, 13,324 గ్రామ పంచాయతీలతో పరిపాలనా సంస్థలో భాగంగా ఉన్నాయి.

ఉత్తరాంధ్ర (ఉత్తర కోస్తాఆంధ్ర): (7)

కోస్తా ఆంధ్ర (మధ్య కోస్తా ఆంధ్ర): (10)

దక్షిణాంధ్ర (దక్షిణ కోస్తాఆంధ్ర):


రాయలసీమ:

కాలక్రమ స్థితి పటాలు

[మార్చు]

జిల్లాల గణాంకాలు

[మార్చు]

గమనిక: జిల్లా వివరాలు. మండలాల సంఖ్య వరకు, జిల్లా పటం తాజాపరచబడింది.[16] రెవెన్యూ గ్రామాలు, జనాభా, విస్తీర్ణం, జనసాంద్రత వివరాలు [14] తాజాపరచవలసివున్నది

వ.సంఖ్య కోడ్[17] జిల్లా అధికారిక పేరు జిల్లా ప్రధానకేంద్రం జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు జిల్లాలోని మండలాలు *జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు జనాభా విస్తీర్ణం
(చ.కి.మీ)
జనసాంధ్రత
(చ.కి.మీ 1కి)
జిల్లా ఉనికిని తెలిపే పటం
1 SRI శ్రీకాకుళం శ్రీకాకుళం 3 30 1323 21,91,471 4,591 477.34
2 PAR పార్వతీపురం మన్యం పార్వతీపురం 2 15 9,25,340 3,659 252.89
3 VIZ విజయనగరం విజయనగరం 3 28 19,30,811 4,122 468.42
4 VIS విశాఖపట్నం విశాఖపట్నం 2 11 19,59,544 1,048 1869.79
5 ALL అల్లూరి సీతారామరాజు పాడేరు 1 11 6,04,031 12,251 77.87
6 ANA అనకాపల్లి అనకాపల్లి 3 24 17,26,998 4,292 402.38
7 POL పోలవరం రంపచోడవరం 2 12 3,49,929
8 KAK కాకినాడ కాకినాడ 2 21 20,92,374 3,019 693.07
9 EAS తూర్పు గోదావరి రాజమహేంద్రపురం 2 22 18,32,332 2,561 715.48
10 KON డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ అమలాపురం 3 19 17,19,093 2,083 825.30
11 ELU ఏలూరు ఏలూరు 3 28 20,06,737 6,579 305.02
12 WES పశ్చిమ గోదావరి భీమవరం 3 20 18,44,898 2,278 809.88
13 NTR ఎన్టీఆర్ విజయవాడ 3 20 22,18,591 3,316 669.06
14 KRI కృష్ణా మచిలీపట్నం 3 26 17,35,079 3,775 459.62
15 PAL పల్నాడు నరసరాపుపేట 3 28 20,41,723 7,298 279.76
16 GUN గుంటూరు గుంటూరు 2 18 20,91,075 2,443 855.95
17 BAP బాపట్ల బాపట్ల 3 20 15,86,918 3,829 414.45
18 PRA ప్రకాశం ఒంగోలు 3 28 17,67,633 14,322 159.76
19 MAR మార్కాపురం మార్కాపురం 2 21 11,42,313
20 NEL శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు 3 36 24,69,712 10,441 236.54
21 KUR కర్నూలు కర్నూలు 3 27 22,71,686 7,980 284.67
22 NAN నంద్యాల నంద్యాల 4 30 17,81,777 9,682 184.03
23 ANA అనంతపురం అనంతపురం 3 32 22,41,105 10,205 219.61
24 SSS శ్రీ సత్యసాయి పుట్టపర్తి 5 32 18,40,043 8,925 206.17
25 CUD వైఎస్ఆర్ కడప కడప 5 40 20,60,654 11,228 183.53
26 ANN అన్నమయ్య మదనపల్లె 3 25 16,97,308 7,954 213.39
27 TIR తిరుపతి తిరుపతి 4 36 21,96,984 8,231 266.92
28 CHI చిత్తూరు చిత్తూరు 3 28 18,72,951 6,855 273.22
మొత్తం 81 688

గమనిక *: నిర్జన గ్రామాలు మినహాయించి జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు చూపబడినవి

జిల్లాల విశేషాలు

[మార్చు]

వ్యక్తుల పేరుతో ఉన్న జిల్లాలు

[మార్చు]

రాష్ట్రంలో 2022 పునర్య్వస్థీకరణ తరువాత ఈ దిగువ వివరించిన 7 జిల్లాలు వ్యక్తుల పేరుతో ఉన్నాయి.[18]

ఆరు జోన్లు

[మార్చు]
  1. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి
  2. పాడేరు, రాజమండ్రి, కాకినాడ, కోనసీమ,
  3. ఏలూరు, విజయవాడ, బందరు
  1. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, మార్కాపురం, నెల్లూరు
  2. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, కడప
  3. నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి, కర్నూలు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "History of Andhra Pradesh". The Hans India (in ఇంగ్లీష్). 1 November 2020. Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
  2. "AP new districts: First formed under the empire, Andhra Pradesh's map shaped and reshaped over two centuries". The Times of India (in ఇంగ్లీష్). 30 March 2022. Retrieved 3 April 2022.
  3. "New districts in AP: Experts want the government to walk the talk". The Hindu (in ఇంగ్లీష్). 2 April 2022. Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
  4. ANI (2013-11-12). "GoM on Andhra bifurcation to elicit views of political parties". Business Standard India. Retrieved 2023-03-14.
  5. "Andhra Pradesh takes control of seven mandals in Khammam". Deccan Chronicle (in ఇంగ్లీష్). 3 September 2014. Retrieved 3 April 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "List of seven mandals to be included in AP". The Hans India (in ఇంగ్లీష్). 11 July 2014. Retrieved 3 April 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "TS gives up on 7 transferred mandals". The Hindu (in Indian English). 2014-08-19. ISSN 0971-751X. Retrieved 2023-03-14.
  8. "Parliament passes bill on Polavaram project". The Hindu (in Indian English). 2014-07-14. ISSN 0971-751X. Retrieved 2023-03-14.
  9. "Doubling the number of districts in Andhra Pradesh: The proposal and the criticism". The Indian Express (in ఇంగ్లీష్). 2022-01-31. Retrieved 2023-03-11.
  10. V., Raghavendra (4 April 2022). "Jagan launches 13 new districts of Andhra Pradesh". The Hindu. Retrieved 21 August 2024.
  11. "AP New Districts: కొత్త కళ.. గడప వద్దకే పాలన". 2022-04-05. Retrieved 2022-04-22.
  12. "Andhra news:అందుబాటులో జిల్లా కేంద్రం". ఈనాడు. 2022-04-04. Retrieved 2022-04-04.
  13. "New districts to come into force on April 4". The Hindu. 30 March 2022. Retrieved 3 April 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. 1 2 "Here's how new ap map looks after districts reorganisation". 2022-04-03. Retrieved 2023-04-17.
  15. "Andhra Pradesh to have 13 new districts from April 4". india.com (in ఇంగ్లీష్). 31 March 2022. Retrieved 3 April 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. 1 2 "Andhra News:కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం". Eenadu. 2025-12-30. Retrieved 2026-02-16.
  17. "NIC Policy on format of e-mail Address" (PDF). www.mail.nic.in. 2008-09-11. Archived from the original (PDF) on 11 September 2008. Retrieved 2021-02-15.
  18. "ఆంధ్ర‌ప్రదేశ్‌‌లో 26 జిల్లాలు... పునర్విభజనలో 5 ఆసక్తికర అంశాలు - BBC News తెలుగు". BBC News తెలుగు. Retrieved 2026-02-08.

వెలుపలి లంకెలు

[మార్చు]