ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ.[1][2] ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది.[3][4] వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. మొత్తం 175 స్థానాలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు, జనసేనపార్ఠీ ఒక స్థానం గెలుచుకున్నాయి.
చరిత్ర
[మార్చు]అవిభక్త ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 294 నియోజకవర్గాలున్నాయి. శాసనసభలో మొత్తం 295 మంది శాసనసభ్యులు (ఎమ్.ఎల్.ఎ. లు) ఉండేవారు. అందులో ఒక సీటుకు ఒక ఆంగ్లో-ఇండీయన్ ని నామినేట్ చేస్తారు. ప్రతి నియోజక వర్గంనుండి ఓ ప్రతినిధి వుంటాడు. ఈ ప్రతినిధి నియోజక వర్గంలో గల ఓటర్లచే ఎన్నుకోబడుతాడు. 2014 లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు, శాసనసభ నియోజకవర్గాలు 175. 2022 ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ జిల్లాలను 26 గా పునర్విభజించారు. చాలావరకు లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా జిల్లా చేసినా, ప్రజల సౌకర్యంకొరకు కొన్ని మండలాలను దగ్గరిలోని జిల్లాలో కలిపినందున, కొన్ని శాసనసభ నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలోకి వచ్చాయి.[5]
జిల్లా ప్రధానమైన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వున్ననూ, పూర్తిగా జిల్లా పరిధి దాటిన శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]జిల్లా కేంద్రం ప్రజలకు దగ్గరగా ఉండటంకోసం, కొన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలోగల మండలాలను పూర్తిగా సరిహద్దు జిల్లాలో కలపడం జరిగింది.[6][7]
శాసనసభ నియోజకవర్గం | లోక్‌సభ నియోజకవర్గం | జిల్లా |
---|---|---|
ఎచ్చెర్ల | విజయనగరం | శ్రీకాకుళం |
చంద్రగిరి | చిత్తూరు | తిరుపతి |
పుంగనూరు | రాజంపేట | చిత్తూరు |
శృంగవరపు కోట | విశాఖపట్నం | విజయనగరం |
సర్వేపల్లి | తిరుపతి | నెల్లూరు |
సంతనూతలపాడు | బాపట్ల | ప్రకాశం |
జిల్లా ప్రధానమైన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వున్ననూ, పాక్షికంగా జిల్లా పరిధిదాటిన శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]జిల్లా కేంద్రం ప్రజలకు దగ్గరగా వుండటంకోసం, కొన్ని శాసనసభ పరిధిలో గల మండలాలను పాక్షికంగా సరిహద్దు జిల్లాలో కలపడం జరిగింది.[6][7]
శాసనసభ నియోజకవర్గం | లోక్‌సభ నియోజకవర్గం | జిల్లా (లు) |
---|---|---|
అనపర్తి | రాజమండ్రి | తూర్పు గోదావరి, |
గోపాలపురం | రాజమండ్రి | తూర్పు గోదావరి, |
జగ్గంపేట | కాకినాడ | కాకినాడ, |
నగరి | చిత్తూరు | చిత్తూరు, |
పాణ్యం | నంద్యాల | నంద్యాల, |
పెందుర్తి | అనకాపల్లి | అనకాపల్లి, |
ముమ్మిడివరం | అమలాపురం | కోనసీమ, |
రాజంపేట | రాజంపేట | అన్నమయ్య, |
రాప్తాడు | హిందూపురం | శ్రీ సత్యసాయి, |
రామచంద్రపురం | అమలాపురం | కోనసీమ, |
వెంకటగిరి | తిరుపతి | తిరుపతి, |
సాలూరు | అరకు | పార్వతీపురం మన్యం, |
జిల్లాల వారీగా నియోజకవర్గాల సంఖ్య
[మార్చు]ఎస్. నో | జిల్లా | నియోజకవర్గాలు |
---|---|---|
1 | శ్రీకాకుళం | 8 |
2 | విజయనగరం | 7 |
3 | పార్వతీపురం మన్యం | 4 |
4 | విశాఖపట్నం | 6 + పెందుర్తి (పాక్షికంగా) |
5 | అనకాపల్లి | 7 + పెందుర్తి (పాక్షికంగా) |
6 | అల్లూరి సీతారామ రాజు | 3 |
7 | కాకినాడ | 7 |
8 | తూర్పు గోదావరి | 7 |
9 | కొనసీమ | 7 |
10 | పశ్చిమ గోదావరి | 7 |
11 | ఏలూరు | 7 |
12 | ఎన్టీఆర్ | 7 |
13 | కృష్ణా | 7 |
14 | గుంటూరు | 7 |
15 | పల్నాడు | 7 |
16 | బాపట్ల | 6 |
17 | ప్రకాశం | 8 |
18 | నెల్లూరు | 8 + వెంకటగిరి (పాక్షికంగా) |
19 | తిరుపతి | 6 + వెంకటగిరి (పాక్షికంగా) |
20 | చిత్తూరు | 7 |
21 | అన్నమయ్య | 6 |
22 | కడప | 7 |
23 | నంద్యాల | 6 + పాణ్యం (పాక్షికంగా) |
24 | కర్నూలు | 7 + పాణ్యం (పాక్షికంగా) |
25 | అనంతపురం | 8 |
26 | శ్రీ సత్య సాయి | 6 |
ప్రస్తుత నియోజకవర్గాల జాబితా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ నియోజకవర్గాల ఉన్నాయి.[8]
మాజీ నియోజకవర్గాల జాబితా
[మార్చు]2008లో రద్దు చేసిన నియోజకవర్గాలు
[మార్చు]ఇటీవలి డీలిమిటేషన్ కమిషన్ 2002 జూలై 12న ఏర్పాటైంది. కమిషన్ సిఫార్సులు, 2008 ఫిబ్రవరి 19న ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ద్వారా ఆమోదించబడ్డాయి.[9][10] దాని ఫలితంగా రద్దు చేయబడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు క్రింది విధంగా ఉన్నాయి:
అనంతపురం జిల్లా
[మార్చు]చిత్తూరు జిల్లా
[మార్చు]తూర్పు గోదావరి జిల్లా
[మార్చు]- ఎల్లవరం శాసనసభ నియోజకవర్గం (ఎస్.టి)
- బూరుగుపూడి శాసనసభ నియోజకవర్గం
- కడియం శాసనసభ నియోజకవర్గం
- సంపారా శాసనసభ నియోజకవర్గం
- తాళ్లరేవు శాసనసభ నియోజకవర్గం
- ఆలమూరు శాసనసభ నియోజకవర్గం
- అల్లవరం శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
- గన్నవరపు శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి)
గుంటూరు జిల్లా
[మార్చు]కృష్ణా జిల్లా
[మార్చు]- కంకిపాడు శాసనసభ నియోజకవర్గం
- ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం
- ముదినేపల్లి శాసనసభ నియోజకవర్గం
- మల్లేశ్వరం శాసనసభ నియోజకవర్గం
- నిడుమోలు నియోజకవర్గం నియోజకవర్గం (ఎస్.సి)
కర్నూలు జిల్లా
[మార్చు]ప్రకాశం జిల్లా
[మార్చు]శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
[మార్చు]శ్రీకాకుళం జిల్లా
[మార్చు]- సోంపేట శాసనసభ నియోజకవర్గం
- హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం
- కొత్తూరు శాసనసభ నియోజకవర్గం (ఎస్.టి)
- ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం
విశాఖపట్నం జిల్లా
[మార్చు]విజయనగరం జిల్లా
[మార్చు]- నాగూరు శాసనసభ నియోజకవర్గం (ఎస్.టి)
- తెర్లాం శాసనసభ నియోజకవర్గం
- సతివాడ శాసనసభ నియోజకవర్గం
- భోగాపురం శాసనసభ నియోజకవర్గం
- ఉత్తారపల్లి శాసనసభ నియోజకవర్గం
పశ్చిమ గోదావరి జిల్లా
[మార్చు]వైఎస్ఆర్ జిల్లా
[మార్చు]ఇవి కూడ చూడు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Overview". Andhra Pradesh Legislative Assembly. Archived from the original on 13 అక్టోబరు 2018. Retrieved 9 February 2015.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. 17 December 2018. pp. 16–28. Archived from the original (PDF) on 3 October 2018. Retrieved 24 May 2019.
- ↑ "List of constituencies (District Wise) : Andhra Pradesh 2019 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
- ↑ "ఏపీలో కొత్త జిల్లాలు.. ఏ నియోజకవర్గం ఎక్కడ..? పూర్తి వివరాలు ఇవిగో." Samayam Telugu. Retrieved 2024-01-12.
- ↑ "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-08.
- ↑ 6.0 6.1 "AP New Districts: కొత్త కళ.. గడప వద్దకే పాలన". 2022-04-05. Retrieved 2022-04-22.
- ↑ 7.0 7.1 "Andhra news:అందుబాటులో జిల్లా కేంద్రం". ఈనాడు. 2022-04-04. Retrieved 2022-04-04.
- ↑ "The Andhra Pradesh Gazette" (PDF). Official website of the Chief Electoral Officer, Telangana. Delimitation Commission of India. pp. 7–15. Retrieved 7 May 2019.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. February 20, 2008. Archived from the original on February 28, 2008.
- ↑ "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election Commission of India, NIRVACHAN SADAN, ASHOKA ROAD, NEW DELHI-110001.