అనపర్తి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పు గోదావరిజిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో అనపర్తి శాసనసభ నియోజకవర్గం ఒకటి. జిల్లాలోనే రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్నది అనపర్తి నియోజకవర్గంలోనే

నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 40 అనపర్తి జనరల్ సత్తి సూర్యనారాయణరెడ్డి పు వై.కా.పా 111771 నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పు తె.దే.పా 56564
2014 159 అనపర్తి జనరల్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పు తె.దే.పా 83398 సత్తి సూర్యనారాయణరెడ్డి పు వై.కా.పా 82025
2009 159 అనపర్తి జనరల్ Nallamilli Seshareddy పు కాంగ్రేష్ 70623 Gollala Mamidada D.R.K.Reddy పు ప్రజారాజ్యం 34749
2004 50 అనపర్తి జనరల్ తేతల రామారెడ్డి పు కాంగ్రేష్ 61194 Moolareddy Nallamilli పు తె.దే.పా 32466
1999 50 అనపర్తి జనరల్ Moola Reddy Nallamilli పు తె.దే.పా 47786 తేతల రామారెడ్డి పు కాంగ్రేష్ 46800
1994 50 అనపర్తి జనరల్ Moolareddy Nallamilli పు తె.దే.పా 48281 తేతల రామారెడ్డి పు కాంగ్రేష్ 42281
1989 50 అనపర్తి జనరల్ తేతల రామారెడ్డి పు కాంగ్రేష్ 48711 Moola Reddy Nallanilli పు తె.దే.పా 41073
1985 50 అనపర్తి జనరల్ Nallamilli Moolareddy పు తె.దే.పా 43552 Ammireddy Tadala పు కాంగ్రేష్ 35831
1983 50 అనపర్తి జనరల్ Nallamilli Moola Reddy పు స్వతంత్ర్య 46855 Ammireddy Padala పు కాంగ్రేష్ 22951
1978 50 అనపర్తి జనరల్ Padala Ammi Reddy పు JNP 37261 Undavilli Satyanarayana Murty పు కాంగ్రేష్ 22982
1972 50 అనపర్తి జనరల్ Ramakrishana Chowdary V పు కాంగ్రేష్    Uncontested         
1967 50 అనపర్తి జనరల్ R. C. Valluri పు కాంగ్రేస్ 25822 V. Goluguri పు స్వతంత్ర్య 25419
1962 55 అనపర్తి జనరల్ Palacherla Panasaramanna పు సీపిఐ 18498 Tetala Lakshminarayana Reddy పు కాంగ్రేష్ 17912
1955 47 అనపర్తి జనరల్ Tetala Lakshminirayanareddi పు PP 24926 Kuvvuri Venkatareddi పు సీపిఐ 19458

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.రామరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి మూలరెడ్డిపై 28728 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రామరెడ్డి 61194 ఓట్లు సాధించగా, మూలరెడ్డి 32466 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున నల్లమిల్లి మూలారెడ్డి[2] కాంగ్రెస్ తరఫున ఎన్.శేషారెడ్డి (ఆదిత్య సంస్థల ఛైర్మెన్ ) ప్రజారాజ్యం పార్టీ తరఫున డి.ఆర్.కె.రెడ్డి భారతీయ జనతా పార్టీ తరుపున నల్లమిల్లి జ్యోతి రెడ్డి  పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఆదిత్య సంస్థల ఛైర్మెన్ శెషారెడ్డి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన డి.ఆర్.కె.రెడ్డిపై 35 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు.[3]

2014 ఎన్నికలు[మార్చు]

2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి తనయులు ) వైస్సార్సీపీ తరుపున డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి (డాక్టర్, గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత ) పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఎన్నికలలో నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి  తన సమీప ప్రత్యర్థి వైస్సార్సీపీ పార్టీ అభ్యర్థి అయినా డా. సత్తి సూర్యనారాయణరెడ్డి పై 1373 మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు

2019 ఎన్నికలు[మార్చు]

2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ తరుపున డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి (డాక్టర్, గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత) తెలుగుదేశం పార్టీ తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి తనయులు , మాజీ ఎమ్మెల్యే) పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఎన్నికలలో డా.సత్తి సూర్యనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై 55207మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/anaparthy.html
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009