గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం
గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో వుంది. 1955లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బేస్తవారిపేటలో కొంత భాగంతో గిద్దలూరు నియోజకవర్గంగా ఏర్పడింది.[1] గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967 ఎన్నికల వరకు కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరు నియోజకవర్గం 1970లో ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత అందులో భాగమైంది. నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) లు కలిసి నాలుగుసార్లు గెలవగా, స్వతంత్ర అభ్యర్థులు మూడుసార్లు, తెలుగుదేశం నాలుగు సార్లు, జనతాపార్టీ, ప్రజారాజ్యం పార్టీలు చెరోసారి గెలుపొందాయి. ఈ నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా పిడతల కుటుంబీకులే మొదటి నుండి గెలుస్తూ ఉండటం విశేషం. ప్రకాశం జిల్లాలో కెళ్ళా అభివృద్ధిలో బాగా వెనుకబడిన ఈ నియోజకవర్గంలో రాయలసీమ ప్రభావం ఎక్కువ.[2]
2007 ఓటర్ల నమోదు ప్రకారం నియోజక వర్గంలో సుమారు లక్షా 90 వేల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో కాపులు 27 శాతం, రెడ్లు 21 శాతం, కమ్మ 4 శాతం, ఎస్సీలు 12 శాతం, ముస్లిం, మైనారిటీలు 15 శాతం, ఇతర బి.సి కులాలు 21 శాతం ఉన్నారు.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
2007 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంభం శాసనసభా నియోజకవర్గాన్ని రద్దు చేసి కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలను గిద్దలూరు నియోజకవర్గంలో కలిపారు.
ఈ నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసన సభ్యులు[మార్చు]
సంవత్సరం | మొత్తం ఓట్లు | పోలైన ఓట్లు | చెల్లిన ఓట్లు | ఎన్నికైన అభ్యర్థి | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1955 | 52,245 | 34,561 | పిడతల రంగారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 21,469 | తుపాకుల బసవయ్య | సి.పి.ఐ | 13,092 | |
1962 | 79,921 | 51,536 | 49,564 | ఈదుల బలరామిరెడ్డి | స్వతంత్ర అభ్యర్థి | 25,630 | పిడతల రంగారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 23,934 |
1967 | 71,510 | 50,957 | 49,144 | దప్పిలి పాండురంగారెడ్డి | స్వతంత్ర అభ్యర్థి | 29,970 | అడపాల రామస్వామి | స్వతంత్ర అభ్యర్థి | 13,832 |
1972 | 76,984 | 53,230 | 52,358 | పిడతల రంగారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 43,706 | జె.వి.నారాయణ | స్వతంత్ర పార్టీ | 6,168 |
1978 | 91,389 | 65,017 | 62,110 | పిడతల రంగారెడ్డి | జనతా పార్టీ | 30,705 | ముడియం పీరారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 20,533 |
1983 | 97,128 | 64,012 | 62,902 | ముడియం పీరారెడ్డి | తెలుగుదేశం పార్టీ | 32,853 | పిడతల రంగారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 30,049 |
1985 | 1,03,520 | 68,878 | 67,792 | పిడతల రంగారెడ్డి | స్వతంత్ర అభ్యర్థి | 40,579 | ముడియం పీరారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 24,315 |
1989 | 1,23,057 | 80,884 | 78,431 | యాళ్లూరి వెంకటరెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 45,694 | పిడతల విజయకుమార్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | 31,774 |
1994 | 1,03,820 | 73,819 | 72,238 | పిడతల రాంభూపాల్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | 29,496 | ముడియం పీరారెడ్డి | స్వతంత్ర అభ్యర్థి | 20,035 |
1999 | 1,24,207 | 80,523 | 78,213 | పిడతల విజయకుమార్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | 38,136 | పగడాల రామయ్య | కాంగ్రెస్ పార్టీ | 34,954 |
2001 (ఉ.ఎ) [3] | 84,503 | 84,503 | పిడతల సాయికల్పనారెడ్డి | తెలుగుదేశం పార్టీ | 53,919 | ముడియం పీరారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 28,814 | |
2004 | పగడాల రామయ్య | కాంగ్రెస్ పార్టీ | పిడతల సాయికల్పనారెడ్డి | తెలుగుదేశం పార్టీ | |||||
2009 | అన్నా వెంకట రాంబాబు | ప్రజారాజ్యం పార్టీ | 55282 | బి.చంద్రశేఖర్ | కాంగ్రెస్ పార్టీ | 47857 | |||
2014 | ముత్తుముల అశోక్ రెడ్డి | వైసీపీ | 94413 | అన్నా వెంకట రాంబాబు | తెలుగుదేశం పార్టీ | 81520 | |||
2019 | అన్నా వెంకట రాంబాబు | వైసీపీ | 133,111 | ముత్తుముల అశోక్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | 52,076 |
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://www.suryaa.com/showdistricts.asp?category=4&subCategory=17&ContentId=13982[permanent dead link]
- ↑ http://www.suryaa.com/showdistricts.asp?category=4&subCategory=17&ContentId=12417[permanent dead link]
- ↑ శాసనసభ్యుడు పిడతల విజయకుమార్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఉపఎన్నికలు జరిగాయి