1955
స్వరూపం
1955 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1952 1953 1954 - 1955 - 1956 1957 1958 |
దశాబ్దాలు: | 1930లు 1940లు - 1950లు - 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 13; నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.
- మార్చి 28: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాడు.
- మే 14: కమ్యూనిష్ఠు దేశాల మాధ్య వార్సా ఒప్పందం కుదిరింది.
- జూలై 11: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
- అక్టోబర్ 3: చెన్నై వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది.
జననాలు
[మార్చు]- జనవరి 5: మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
- జనవరి 28: వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్
- మార్చి 3: జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)
- మే 4: అంజు చధా, భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త.
- మే 20: సిరివెన్నెల సీతారామశాస్త్రి, తెలుగు సినీగీత రచయిత
- మే 22: పి. చంద్రశేఖర అజాద్, కథా రచయిత, నవలారచయిత.
- జూన్ 18: శాండీ అల్లెన్ Archived 2011-08-10 at the Wayback Machine, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)
- జూలై 1: పాలగిరి రామక్రిష్ణా రెడ్డి, నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనె లను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.
- జూలై 19: రోజర్ బిన్నీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- జూలై 27: అలాన్ బోర్డర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్.
- ఆగష్టు 1: అరుణ్ లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- ఆగష్టు 22: చిరంజీవి, తెలుగు చలనచిత్ర నటుడు.
- సెప్టెంబర్ 5: ఎం.కోదండరాం, తెలంగాణ ఉద్యమ నాయకుడు.
- అక్టోబరు 12: హేమా చౌదరి, దక్షిణ భారత సినిమా నటి.
- అక్టోబరు 12: బియ్యాల జనార్ధన్‌రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (మ. 2002)
- అక్టోబరు 17: స్మితాపాటిల్, హిందీ సినీనటి.
- నవంబర్ 3: కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి.
- నవంబర్ 24: ఇయాన్ బోథం, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- : గూడ అంజయ్య, జానపదగేయాల రచయిత. (మ.2016)
మరణాలు
[మార్చు]- జనవరి 1: శాంతి స్వరూప్ భట్నాగర్, భారత అణు శాస్త్రవేత్త .
- మార్చి 11: అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1881)
- మార్చి 13: త్రిభువన్, నేపాల్ రాజు.
- ఏప్రిల్ 18: ఆల్బెర్ట్ ఐన్‌స్టీన్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూన్ 6: తోలేటి వెంకటరెడ్డి, సినిమా రచయిత.
- సెప్టెంబర్ 25: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (జ.1864)
- డిసెంబర్ 30: వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1895)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం : డా. భగవాన్ దాస్, డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జవహర్ లాల్ నెహ్రూ