వినోద్ ఖోస్లా
జననం: | పుణె | 1955 జనవరి 28
---|---|
వృత్తి: | వెంచర్ క్యాపిటలిస్ట్ |
Net worth: | $1.5 billion [1] |
భర్త/భార్య: | నీరు ఖోస్లా |
సంతానం: | నీనా, అను, వాని, నీల్ |
వినోద్ ఖోస్లా (జననం జనవరి 28, 1955 మహారాష్ట్ర లోని పుణెలో జన్మించిన ఒక ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్.[2]) సిలికాన్ వ్యాలీని ప్రభావితం చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో ఒకరు. సన్ మైక్రో సిస్టమ్స్ సహవ్యవస్థాపకుల్లో ఒకరు. 1986 లో ప్రారంభించబడిన క్లీనర్, పెర్కిన్స్, కౌఫీల్డ్, బయ్యర్స్ సంస్థలో ప్రధాన వాటాదారు. ఫోర్బ్స్ - 2013 లో అమెరికాలో అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాలో వినోద్ ఖోస్లా 352 స్థానంలో నిలిచారు. ఆయన సంపద 1.5 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ లెక్కగట్టింది.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఖోస్లా 14 ఏళ్ళ వయసులో ఉండగా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టైమ్స్ అనే పత్రికలో ఇంటెల్ కంపెనీ స్థాపించడాన్ని గురించి చదివి దానివల్ల ఉత్తేజితుడై సాంకేతికరంగంలో ప్రవేశించాలని కలలు కన్నాడు. ఐఐటి ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ పట్టా, కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయం నుంచి బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్యనూ పూర్తి చేశాడు. తరువాత స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీయే పూర్తి చేశాడు.
కెరీర్
[మార్చు]సన్ మైక్రోసిస్టమ్స్
[మార్చు]1980లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాక, సహోధ్యాయులైన స్కాట్ మెకన్లీ, యాండీ బెక్టోల్షీమ్, చాలిఫోర్నియా, బర్కిలీ విశ్వవిద్యాలయానికి చెందిన బిల్ జాయ్ మొదలైనవారితో కలిసి సన్ మైక్రోసిస్టమ్స్ ను స్థాపించాడు. 1985లో ఖోస్లా సన్ ను వదిలి వేసి క్లీనర్ పెర్కిన్స్ కాఫీల్డ్ అండ్ బయ్యర్స్ అనే వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలో భాగస్వామిగా చేరాడు.
వ్యక్తిగత సమాచారం
[మార్చు]ప్రస్తుతం ఖోస్లా వుడ్‌సైడ్ కాలిఫోర్నియాలో తన భార్య నీరూ ఖోస్లా, పిల్లలు నీనా, వాణి, అను, నీల్ లతో కలిసి నివాసముంటునన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Forbes 400 #317 Vinod Khosla
- ↑ "IIT Delhi: Distinguished Alumni Awards". Archived from the original on 2008-04-07. Retrieved 2009-02-19.
బయటి లింకులు
[మార్చు]- Fear, Greed and Sky Diving Archived 2008-08-13 at the Wayback Machine, Vinod speaks at Stanford
- Vinod speaks to Google employees about ethanol on March 29, 2006
- Making cement while sequestering carbon, Issue 127, July 2008; Retrieved 2008-07-20.
- Vinod's presentations, papers
- Vinod's ethanol views debated
- Press
- Vinod's Blog
- Computer History Museum, 11-Jan-2006: Sun Founders Panel
- Sun Feature Story: The Fab Four Reunites Archived 2008-12-04 at the Wayback Machine (webcast of the event)
- Biofuel-ethanol Archived 2011-05-20 at the Wayback Machine talk by Khosla. Google TechTalks March 29, 2006
- Khosla Ventures:
- Vinod Khosla Charlie Rose, 22 Sept. 2006
- From geeks to greens
- Press release about significant gift to Wikimedia Foundation (which runs Wikipedia)