బిల్ జాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిల్ జాయ్
2003 లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సందర్భంగా జాయ్
జననంవిలియం నెల్సన్ జాయ్
(1954-11-08) 1954 నవంబరు 8 (వయసు 69)
ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగన్, అమెరికా
రంగములుకంప్యూటర్ సైన్స్
చదువుకున్న సంస్థలుమిషిగన్ విశ్వవిద్యాలయం (BS)
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ (MS)
విద్యా సలహాదారులుబాబ్ ఫేబ్రీ
ప్రసిద్ధిBSD •vi •csh •chroot •TCP/IP driver •co-founder of Sun Microsystems •Java •SPARC •Solaris •NFS •Why The Future Doesn't Need Us
ముఖ్యమైన పురస్కారాలు

విలియం నెల్సన్ జాయ్ (జ. 1954 నవంబరు 8) అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇంజనీరు, వెంచర్ క్యాపిటలిస్టు. ఈయన 1982 లో స్కాట్ మెక్‌నీలీ, వినోద్ ఖోస్లా, ఆండీ బెక్టోల్‌షీం తో కలిసి సన్ మైక్రో సిస్టమ్స్ అనే సంస్థను స్థాపించాడు. 2003 వరకు అదే సంస్థలో ప్రధాన సైంటిస్టుగా, ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసరుగా ఉన్నాడు.

ఇతను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో చదువుతున్నపుడే బిఎస్డి యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు.[1] యూనిక్స్ లో ప్రాచుర్యం పొందిన టెక్స్ట్ ఎడిటర్ విఐ (Vi) ని అభివృద్ధి చేసింది కూడా ఇతనే.

1999 లో ఈయన ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసినందుకు గాను నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్ కి ఎంపికయ్యాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "ACM author profile page: William Nelson Joy".
  2. "Bill Joy, Sun Microsystems Ceo, To Speak At Institute For Advanced Study - Press Release | Institute for Advanced Study". www.ias.edu (in ఇంగ్లీష్). 2009-06-10. Retrieved 2022-10-16.
"https://te.wikipedia.org/w/index.php?title=బిల్_జాయ్&oldid=4228717" నుండి వెలికితీశారు