Jump to content

సన్ మైక్రో సిస్టమ్స్

వికీపీడియా నుండి
Sun Microsystems Campus
సన్ మైక్రోసిస్టమ్స్ క్యాంపస్
Sun Microsystems Logo
సన్ మైక్రో సిస్టమ్స్ - లోగో

సన్ మైక్రో సిస్టమ్స్ ఒక బహుళజాతి సాఫ్ట్ వేర్ సంస్థ. దీనిని 1982, అక్టోబరు 12 న వినోద్ ఖోస్లా, ఆండీ బెక్టోల్షీమ్, స్కాట్ మెక్ నీల్ అనే మిత్ర బృందం స్థాపించింది. వీరంతా స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు. ఈ సంస్థ కంప్యూటర్ భాష జావా ను కనుగొంది. అంతే కాక సొలారిస్ ఆపరేటింగ్ సిస్టం, ZFS, నెట్వర్క్ ఫైల్ సిస్టం (NFS), స్పార్క్ మైక్రో ప్రాసెసర్ (SPARC microprocessor) వీటిని కూడా ఉత్పత్తి చేసింది. కంప్యూటర్ చరిత్రలో యూనిక్స్, రిస్క్ ప్రాసెసర్లు, థిన్ క్లైంట్ కంప్యూటింగ్, వర్చువల్ కంప్యూటింగ్ లాంటి సాంకేతిక అభివృద్ధిలో ఈ సంస్థ సహాయ పడింది. సంస్థ అత్యున్నత స్థితిలో ఉండేనాటికి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియా రాష్ట్రంలో శాంటా క్లారా నగరంలో దీని ప్రధాన కార్యాలయం ఉంది.

2009 ఏప్రిల్ 20న ఒరాకిల్ సంస్థ సన్ మైక్రో సిస్టమ్స్ ను 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. 2010, జనవరి 27 నాటికి ఈ ప్రక్రియ పూర్తి అయింది.[1]

రిస్క్ ప్రాసెసర్ల మీద ఆధారపడ్డ సర్వర్లు, x86 ఆధారిత ఎ.ఎం.డి ఆప్టెరాన్ ప్రాసెసర్లు, ఇంటెల్ జియాన్ ప్రాసెసర్లు వాడిన సర్వర్లు ఈ సంస్థ ఉత్పత్తి చేసింది. తన స్వంతంగా ఒక స్టోరేజి సిస్టం, సొలారిస్ ఆపరేటింగ్ సిస్టం, డెవలపర్ టూల్స్, వెబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్, ఐడెంటిటీ మేనేజ్మెంట్ అనువర్తనాలు, జావా, నెట్వర్క్ ఫైల్ సిస్టం (NFS) లాంటి సాఫ్ట్ వేర్ ఉత్పత్తులు కూడా తయారు చేసింది. 2008 లో ఓపెన్ సోర్సు సాఫ్ట్ వేర్ అయిన MySQL ను 1 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Stephen Shankland (January 27, 2010). "Oracle buys Sun, becomes hardware company". CNET News. Archived from the original on 2010-08-21. Retrieved June 14, 2011.
  2. Lee, Matt (November 30, 2006). "Sun begins releasing Java under the GPL". Free Software Foundation. Retrieved June 14, 2011. FSF president and founder Richard Stallman said, "I think Sun has contributed more than any other company to the free software community in the form of software. It shows leadership. It's an example I hope others will follow."
  3. "Sun to Acquire MySQL". MySQL.com. 2008. Archived from the original on 2011-07-18. Retrieved 2018-03-10.