1981
Jump to navigation
Jump to search
1981 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1978 1979 1980 - 1981 - 1982 1983 1984 |
దశాబ్దాలు: | 1960లు 1970లు - 1980లు - 1990లు - 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 1: గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.
- ఏప్రిల్ 14: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం.
- జూన్ 19: భారత పరిశోధనాత్మక కృత్రిమ ఉపగ్రహం ఆపిల్ విజయవంతంగా ప్రయోగించబడింది.
- జూలై 25: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడింది.
- ఆగస్టు-1 ప్రజాశక్తి తిరిగి దినపత్రికగా ప్రారంభం
- అక్టోబరు 22: పారిస్-లియాన్‌ల మధ్య టిజివి రైలు సర్వీసు ప్రారంభమైనది.
- నవంబర్ 20: భారత కృత్రిమ ఉపగ్రహం భాస్కర-2 ప్రయోగం విజయవంతం.
జననాలు
[మార్చు]- జనవరి 25: అలీసియా కీస్, న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు, నటీమణి.
- జనవరి 30: డిమిటార్ బెర్బటోవ్, బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు.
- ఫిబ్రవరి 24: నానీ, తెలుగు సినిమా నటుడు.
- మార్చి 12: సద్గురు బ్రహ్మేశానంద ఆచార్య స్వామి భారతీయ ఆధ్యాత్మిక గురువు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- మే 7 : అనికేత్ విశ్వాస్ రావు టెలివిజన్, సినిమా నటుడు
- జూలై 7: మహేంద్రసింగ్ ధోని, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- అక్టోబర్ 7: అభిజీత్ సావంత్, భారతీయ నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత.
- అక్టోబర్ 8: దాసరి మారుతి, తెలుగు సినీ దర్శకుడు.
- అక్టోబర్ 14: గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- నవంబర్ 7: అనుష్క శెట్టి, భారతీయ సినీ నటి.
- డిసెంబర్ 4: రేణూ దేశాయ్, తెలుగు నటి, రూపదర్శి, కాస్ట్యూం డిజైనర్.
- డిసెంబర్ 12: యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- డిసెంబర్ 13: ఏమీ లీ, అమెరికన్ గాయని-గేయ రచయిత్రి, పియానిస్ట్.
మరణాలు
[మార్చు]- జనవరి 24: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు. (జ.1906)
- జనవరి 24: కాంచనమాల, తొలితరం నటీమణులలో ఒకరు. (జ.1981)
- జనవరి 30: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (జ.1892)
- మే 9: దుర్గాబాయి దేశ్‌ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (జ.1909)
- జూన్ 12: పి.బి. గజేంద్రగడ్కర్, భారతదేశ సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1901)
- ఆగస్టు 6: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1916)
- సెప్టెంబర్ 8: మాస్టర్ వేణు, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1916)
- నవంబర్ 24: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (జ.1897)
- డిసెంబరు 26: సావిత్రి, తెలుగు సినీ ప్రపంచంలో మహానటి. (జ.1936)
పురస్కారాలు
[మార్చు]- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : నౌషద్ అలీ.
- జ్ఞానపీఠ పురస్కారం : అమృతా ప్రీతం
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఆల్వా మిర్థాల్, గున్నార్ మిర్థాల్.