గౌతమ్ గంభీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌతమ్ గంభీర్
Gautam Gambhir.jpg
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి ఎడమచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ లెగ్ బ్రేక్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 27 94
పరుగులు 2553 3107
బ్యాటింగ్ సగటు 56.73 37.89
100లు/50లు 8/10 7/19
అత్యుత్తమ స్కోరు 206 150*
ఓవర్లు - 1
వికెట్లు - 0
బౌలింగ్ సగటు - -
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు - -
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగ్ - -
క్యాచ్ లు/స్టంపింగులు 24/- 30/-

As of జనవరి 8, 2010
Source: [1]

1981 అక్టోబర్ 14ఢిల్లీ లోజన్మించిన గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ ఆటగాడు. 2003 నుంచి వన్డేలలో, 2004 నుంచి టెస్టులలో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలను సాధించి టెస్ట్ జట్టులో సెలెక్ట్ అయ్యాడు. స్వదేశంలో జరిగిన టూర్ గేమ్ లో డబుల్ సెంచరీ సాధించిన 4 వ భారతీయుడితను. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్ టెండుల్కర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.

2000లో గంభీర్ బెంగుళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి సెలెక్ట్ అయ్యాడు.[1] .2003లో బంగ్లాదేశ్తో జరిగిన టి.వి.ఎస్. కప్ లో మొదటి సారిగా వన్డే పోటీలను ఆడినాడు. అతని మూడవ మ్యాచ్ లోనే 71 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు. 2005లో శ్రీలంక పై 97 బంతుల్లో 103 పరుగులు చేసి తన తొలి సెంచరీని నమోదుచేశాడు. 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో గంభీర్ తన టెస్ట్ జీవితం ఆరంభించాడు. కాని ఆ టెస్టులో అతను ఏ మాత్రం ప్రతిభ కనబర్చలేకపోయాడు. 3, 1 పరుగు స్కోర్లకే ఔటైనాడు. అయిననూ అతని రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పై 96 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో అతని తొలి శతకం 2004 డిసెంబర్లో బంగ్లాదేశ్ పై సాధించాడు. ఆ తర్వాత పాకిస్తాన్తో సిరీస్ లో మంచి శుభారంభం ఇచ్చిననూ 6 ఇన్నింగ్సులలోనూ కల్పి ఒకే అర్థ శతకం సాధించాడు. ఆ తర్వాత అదే సం.లో జింబాబ్వే పై 97 పరుగులు సాధించాడు. కాని శ్రీలంకతో జరిగిన సీరీస్ లో 30 పరుగుల స్కోరిను దాటలేకపోయాడు. తత్ఫలితంగా జట్టులో స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో వసీం జాఫర్ జట్టులో స్థానం పొందాడు. 20, 30 పరుగులను పెద్ద స్కోర్లుగా మల్చే శక్తి లేదని విమర్శలు పొమ్దినాడు.

టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత 2005, 2007 మధ్యలో వన్డే క్రికెట్ జట్టులో కూడా ఆడుతూ స్థానం కోల్పోతూ వచ్చాడు. 2007 ప్రపంచ కప్ క్రికెట్లో కూడా అతనికి స్థానం లభించలేదు. టాప్ ఆర్డర్ లో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీలు ఉండటంతో ఇతనికి అవకాశం ఇవ్వలేదు. కాని 2007 ప్రపంచ కప్ లో భారత జట్టు పేవలమైన ప్రదర్శనతో తొలి రౌండులోనే నిష్క్రమించడంతో ఆ తర్వాత జరిగిన బంగ్లాదేశ్ పర్యటించే వన్డే జట్టులో మళ్ళీ స్థానం సంపాదించాడు. ఆ సీరీస్ లో గంభీర్ తన రెండో శతకాన్ని నమోదుచేసి తదనంతరం ఐర్లాండ్ టూర్ కు ఎంపికైనాడు. తొలి మ్యాచ్ లోనే 80 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందినాడు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Ramchand, Partab (2000-04-15). "First list of NCA trainees". Cricinfo. {{cite news}}: Check date values in: |date= (help)[permanent dead link]