ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు
దస్త్రం:England cricket team logo.svg | |||||||||||||
అసోసియేషన్ | ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||||||||||||
టెస్టు కెప్టెన్ | బెన్ స్టోక్స్ | ||||||||||||
ఒన్ డే కెప్టెన్ | జోస్ బట్లర్ | ||||||||||||
Tట్వంటీ I కెప్టెన్ | జోస్ బట్లర్ | ||||||||||||
కోచ్ | టెస్ట్ - బ్రెండన్ మెక్‌కలమ్ ODI - మాథ్యూ మోట్ T20I - మాథ్యూ మోట్ | ||||||||||||
చరిత్ర | |||||||||||||
టెస్టు హోదా పొందినది | 1877 | ||||||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | |||||||||||||
ICC హోదా | పూర్తి సభ్యత్వం (1909) | ||||||||||||
ICC ప్రాంతం | యూరోప్ | ||||||||||||
| |||||||||||||
టెస్టులు | |||||||||||||
మొదటి టెస్టు | v. ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ వద్ద ; 15–19 మార్చి 1877 | ||||||||||||
చివరి టెస్టు | v. ఆస్ట్రేలియా ది ఓవల్, లండన్ వద్ద; 27–31 జూలై 2023 | ||||||||||||
| |||||||||||||
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో పోటీ | 2 (first in 2019–2021) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | నాల్గవ స్థానం (2019–2021 & 2021-2023) | ||||||||||||
వన్‌డేలు | |||||||||||||
తొలి వన్‌డే | v. ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్వద్ద; 5 జనవరి 1971 | ||||||||||||
చివరి వన్‌డే | v. పాకిస్తాన్ ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా వద్ద; 11 నవంబర్ 2023 | ||||||||||||
| |||||||||||||
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 13 (first in 1975) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2019) | ||||||||||||
ట్వంటీ20లు | |||||||||||||
తొలి టి20ఐ | v. ఆస్ట్రేలియా ఏజియాస్ బౌల్, సౌతాంప్టన్ వద్ద; 13 జూన్ 2005 | ||||||||||||
చివరి టి20ఐ | v. న్యూజీలాండ్ ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ వద్ద; 5 సెప్టెంబర్ 2023 | ||||||||||||
| |||||||||||||
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 8 (first in 2007) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2010, 2022) | ||||||||||||
| |||||||||||||
As of 11 November 2023 |
ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్, వేల్స్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 1997 నుండి దీన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) పాలిస్తోంది. అంతకు మునుపు,1903 నుండి మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) పాలనలో ఉండేది. వ్యవస్థాపక దేశంగా ఇంగ్లాండుకు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో (ICC) టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్ (వన్‌డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టి20) హోదాలతో పూర్తి సభ్యత్వం ఉంది. 1990 ల వరకు, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాలు ICC లో సభ్యులు కానందున ఆ దేశాల ఆటగాళ్ళు కూడా ఇంగ్లండ్ తరపున ఆడేవారు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ప్రపంచపు మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన జట్లు (1877 మార్చి 15-19). దక్షిణాఫ్రికాతో కలిసి, ఈ రెండు దేశాలు 1909 జూన్ 15 న ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌ను (నేటి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు పూర్వజ సంస్థ) ఏర్పాటు చేశాయి. 1971 జనవరి 5 న మొదటి వన్‌డే ఆడింది కూడా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలే. ఇంగ్లాండ్ తన మొదటి టి2005 ని 20 జూన్ 13 న ఆస్ట్రేలియాతో ఆడింది.
టోర్నమెంట్ల చరిత్ర
[మార్చు]ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకుని ఓ జట్టు ఆడిన మొదటి ఆట 1739 జూలై 9 న జరిగింది. కెంట్ మినహాయించి ఇంగ్లండ్‌లోని మిగతా ప్రాంతానికి చెందిన 11 మంది పెద్దమనుషులతో కూడిన "ఆల్-ఇంగ్లండ్" జట్టు కెంట్‌లోని "ది అన్‌కాంకరబుల్ కౌంటీ"తో ఆడి, చాలా కొద్ది తేడాతో ఓడిపోయింది. [8] ఇటువంటి మ్యాచ్‌లు ఓ శతాబ్దం పైగానే అనేక సందర్భాల్లో జరిగాయి.
1846లో విలియం క్లార్క్ ఆల్-ఇంగ్లండ్ ఎలెవెన్‌ని స్థాపించాడు. ఈ జట్టు చివరికి 1847, 1856 మధ్య జరిగే వార్షిక మ్యాచ్‌లలో యునైటెడ్ ఆల్-ఇంగ్లాండ్ ఎలెవెన్‌తో పోటీ పడింది. ఆటగాళ్ల నాణ్యత ప్రకారం చూస్తే ఈ మ్యాచ్‌లు ఇంగ్లీష్ సీజన్‌లో అత్యంత ముఖ్యమైన పోటీలని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ప్రారంభ పర్యటనలు
[మార్చు]1859 సెప్టెంబరులో ఇంగ్లాండ్, ఉత్తర అమెరికాలో చేసిన పర్యటన మొట్టమొదటి విదేశీ పర్యటన. ఈ జట్టులో ఆల్-ఇంగ్లండ్ ఎలెవన్ నుండి ఆరుగురు ఆటగాళ్లు, యునైటెడ్ ఆల్-ఇంగ్లండ్ ఎలెవెన్ నుండి ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. జార్జ్ పార్ దానికి కెప్టెన్.
అమెరికాలో అంతర్యుద్ధం మొదలవడంతో, క్రికెట్ దృష్టి మరోవైపు మళ్లింది. మెల్‌బోర్న్ లోని రెస్టారెంట్లైన మెస్సర్స్ స్పియర్స్ అండ్ పాండ్, వాణిజ్యపరమైన కార్యక్రమంగా నిర్వహించిన సీరీస్‌లో ఇంగ్లాండు ఆటగాళ్ళు 1861-62లో ఆస్ట్రేలియాలో పర్యటించారు. 1877కి ముందు పర్యటనల సమయంలో ఆడిన చాలా మ్యాచ్‌లలో జట్లు "సమ ఉజ్జీలుగా" ఉండేవి కావు. ప్రత్యర్థి జట్టు 11 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను ఫీల్డింగ్ చేయించి పోటీని సమం చేసేవారు.[9] ఈ మొదటి ఆస్ట్రేలియా పర్యటనలో 11 మందికి గాను 18 మంది వరకు ఆడేవాళ్ళు.
ఆ పర్యటన ఎంతలా విజయవంతమైందంటే, మళ్ళీ 1863-64లో పార్ నాయకత్వంలో రెండవ పర్యటన జరిగింది. జేమ్స్ లిల్లీవైట్ నాయకత్వంలో తదుపరి ఇంగ్లాండ్ జట్టు 1876 సెప్టెంబరు 21 న P&O స్టీమ్‌షిప్ పూనాలో ఆస్ట్రేలియా వెళ్ళింది. వారు సంయుక్త ఆస్ట్రేలియా XIతో ఆడారు. ఈసారి ఇరుజట్లూ 11 మంది ఆటగాళ్ళతో ఆడాయి. 1877 మార్చి 15న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైన ఈ మ్యాచ్‌ను తొట్టతొలి టెస్ట్ మ్యాచ్‌గా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ బ్యానర్‌మాన్ చేసిన తొలి టెస్టు సెంచరీతో ఈ టెస్టు మ్యాచ్‌లో సంయుక్త ఆస్ట్రేలియా XI 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ సమయంలో, మ్యాచ్ జేమ్స్ లిల్లీవైట్స్ XI v కంబైన్డ్ విక్టోరియా అండ్ న్యూ సౌత్ వేల్స్‌గా ప్రచారం పొందింది. [9] ఆ జట్లే 1877 ఈస్టర్ లోని అదే మైదానంలో మళ్ళీ మ్యాచ్ ఆడాయి. ఈసారి లిల్లీవైట్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచి తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్ గడ్డపై 1880లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచింది; ఇంగ్లాండ్‌కు పూర్తిగా ప్రాతినిధ్యం వహించిన తొలి జట్టు ఇది. ఈ జట్టు లోనే WG గ్రేస్ తొలి ఆట ఆడాడు. [10]
1880లు
[మార్చు]1882లో ఇంగ్లండ్, తన మొదటి స్వదేశీ సిరీస్‌ను 1-0తో కోల్పోయింది. ది స్పోర్టింగ్ టైమ్స్ పత్రిక ఇంగ్లీష్ క్రికెట్ మరణించిందంటూ సంస్మరణను ముద్రించింది:
In Affectionate Remembrance
OF
N.B.—The body will be cremated and the
ENGLISH CRICKET,
WHICH DIED AT THE OVAL
ON
29th AUGUST, 1882,
Deeply lamented by a large circle of sorrowing
friends and acquaintances.
R. I. P.
ashes taken to Australia.[11]
ఈ ఓటమి ఫలితంగా, 1882-83 పర్యటనను ఇంగ్లండ్ కెప్టెన్ ఐవో బ్లైగ్ "చితా భస్మాన్ని (యాషెస్) తిరిగి పొందాలనే తృష్ణ"గా పేర్కొన్నాడు. ఔత్సాహికులు, నిపుణుల మిశ్రమంతో కూడిన ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది.[12] బ్లైగ్‌కు కొంత బూడిద ఉన్న ఒక పాత్రను అందించారు. ఆ బూడిద బెయిలుదని, బంతిదనీ, ఓ స్త్రీ ముసుగు దనీ చెప్పుకున్నారు. ఆ విధంగా యాషెస్ పుట్టింది. ఆ తర్వాత జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ను యాషెస్ సిరీస్‌లో భాగంగా పరిగణించలేదు.[13][14] 1884, 1898 మధ్య ఇంగ్లండ్ 10 సార్లు యాషెస్ సిరీస్‌ను గెలుచుకోవడంతో ఈ ప్రారంభ పోటీలలో చాలా వరకు ఇంగ్లాండే ఆధిపత్యం చెలాయించింది.[15] ఈ సమయంలో ఇంగ్లాండ్ 1889 లో పోర్ట్ ఎలిజబెత్‌లో దక్షిణాఫ్రికాతో కూడా తమ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది..[16]
1890లు
[మార్చు]1890 యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-0తో గెలుచుకుంది, సిరీస్‌లోని మూడవ మ్యాచ్ రద్దైంది. చరిత్రలో రద్దైన మొట్ట మొదటి టెస్ట్ మ్యాచ్ అది. 1891-92 సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఓడిపోయింది. అయితే ఆ తర్వాతి సంవత్సరం ఇంగ్లండ్ తిరిగి యాషెస్‌ను సాధించింది. ఇంగ్లండ్ మళ్లీ 1894-95 సిరీస్‌ను ఆండ్రూ స్టోడార్ట్ నాయకత్వంలో 3-2తో గెలిచింది. 1895-96లో, ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాతో ఆడి, సిరీస్‌లోని అన్ని టెస్టులను గెలుచుకుంది. 1899 యాషెస్ సిరీస్‌లో జట్టు సభ్యులను MCC, కౌంటీలు కలిసి ఒక ఎంపిక కమిటీని నియమించిన మొదటి పర్యటన. ముగ్గురు క్రియాశీల ఆటగాళ్ళు ఉన్నారు: గ్రేస్, లార్డ్ హాక్, వార్విక్‌షైర్ కెప్టెన్ హెర్బర్ట్ బైన్‌బ్రిడ్జ్. దీనికి ముందు, స్వదేశంలో జరిగే టెస్టుల కోసం ఇంగ్లండ్ జట్లను మ్యాచ్ ఎవరి మైదానంలో ఆడాలో క్లబ్ ఎంపిక చేసింది. ఇంగ్లండ్ 1899 యాషెస్ సిరీస్‌ను 1-0తో కోల్పోయింది, సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో గ్రేస్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌లో కనిపించాడు.
పాలక సంస్థ
[మార్చు]ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అనేది ఇంగ్లండులో క్రికెట్‌కు, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకూ పాలకమండలి. బోర్డు 1997 జనవరి 1 నుండి పనిచేస్తోంది. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రధానంగా ఇంగ్లండ్ జట్టుకు సంబంధించి టిక్కెట్ల విక్రయం, స్పాన్సర్‌షిప్, ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా ECB బాధ్యత వహిస్తుంది. 2006 క్యాలెండర్ సంవత్సరంలో ECB ఆదాయం £7.7 కోట్లు. [17]
1997కి ముందు, టెస్ట్ అండ్ కౌంటీ క్రికెట్ బోర్డు (TCCB) ఇంగ్లీష్ జట్టుకు పాలకమండలిగా ఉండేది. టెస్ట్ మ్యాచ్‌ల లోనే కాకుండా, 1976-77 ఆస్ట్రేలియా పర్యటన వరకు విదేశాల్లో పర్యటించినప్పుడు ఇంగ్లాండ్ జట్టు, అధికారికంగా MCC పేరుతో ఆడింది. ఇది పర్యటన జట్టును ఎంపిక చేయడంలో MCC బాధ్యత వహించిన కాలానికి ఇది అవశేషం. ఇంగ్లాండ్ పర్యటన బృందం MCC గుర్తులను చివరిసారిగా 1996-97 న్యూజిలాండ్ పర్యటనలో ధరించింది.
వేల్స్ స్థితి
[మార్చు]చారిత్రికంగా, ఇంగ్లండ్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో యావత్తు గ్రేట్ బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది, స్కాటిష్ లేదా వెల్ష్ జాతీయ జట్లు అప్పుడప్పుడు ఆడుతూండేవి. ఈ రెండు దేశాల ఆటగాళ్లు అప్పుడప్పుడు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించేవారు కూడా. 1994లో స్కాట్లాండ్ ICCలో స్వతంత్ర సభ్యునిగా చేరింది. అంతకు రెండేళ్ల ముందే దానికి TCCBతో సంబంధాలు తెగిపోయాయి. [18] [19] [20] [21]
సైమన్, గెరైంట్ జోన్స్ వంటి వెల్ష్ ఆటగాళ్లను ఓవైపున [21] [20] ఉపయోగించుకుంటూనే జట్టు పేరులో మాత్రం "ఇంగ్లాండ్" ఒక్కటే ఉంచడంపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుపై విమర్శలు వచ్చాయి. వెల్ష్ ఆటగాళ్ళు ఇంగ్లండ్ జట్టు తోనే అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్నందున వేల్స్, ICCలో స్వతంత్ర సభ్యురాలిగా మారాలని లేదా వెల్ష్ జాతీయ జట్టుకు మరిన్ని మ్యాచ్‌లను ఇవ్వాలనీ అనేక పిలుపులు వచ్చాయి. [22] అయితే, క్రికెట్ వేల్స్, గ్లామోర్గాన్ కౌంటీ క్రికెట్ క్లబ్ లు రెండూ ECBకి నిరంతరం మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఇంగ్లీష్ వ్యవస్థలో భాగంగా ఉంటే వెల్ష్ కౌంటీకి కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి గ్లామోర్గాన్ వాదించగా, "ECBలో ప్రధాన పాత్రను కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామని క్రికెట్ వేల్స్ చెప్పింది." [23] [24] [25]
వేల్స్‌కు స్వంత క్రికెట్ జట్టు లేకపోవడం పట్ల వెల్ష్ సెనెడ్‌లో కూడా అనేక చర్చలు జరిగాయి. 2013 లో జరిగిన ఒక చర్చలో కన్జర్వేటివ్, లేబర్ సభ్యులు ఇద్దరూ స్వతంత్ర వెల్ష్ జట్టు స్థాపనకు మద్దతు పలికారు.[26]
2015లో, వెల్ష్ నేషనల్ అసెంబ్లీ లోని పిటిషన్ల కమిటీ రూపొందించిన నివేదిక, ఈ సమస్యపై జరుగుతున్న ఉద్వేగభరితమైన చర్చను ప్రతిబింబిస్తుంది. హెరిటేజ్, కల్చర్, స్పోర్ట్, బ్రాడ్‌కాస్టింగ్‌పై ప్లాయిడ్ సైమ్రు ప్రతినిధి, పిటిషన్‌ల కమిటీ సభ్యుడూ అయిన బేతన్ జెంకిన్స్, వేల్స్‌కు స్వంతంగా అంతర్జాతీయ జట్టు ఉండాలని, ECB నుండి వైదొలగాలనీ వాదించాడు. 64 లక్షల జనాభా 6,000 మంది క్లబ్ ప్లేయర్‌లు ఉన్న ఉన్న ఐర్లాండుకు ICC సభ్యత్వం ఉండగా, 30 లక్షల జనాభా, 7,500 మంది ఆటగాళ్ళూ ఉన్న వేల్స్‌కు లేదని జెంకిన్స్ అన్నాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: "క్రికెట్ వేల్స్, గ్లామోర్గాన్ CCC లు వెల్ష్ జాతీయ క్రికెట్ జట్టు అనే ఆలోచన 'ఉద్వేగభరితమైన అంశం' అని చెపుతున్నాయి. ఔను మరి, జాతీయ జట్టును కలిగి ఉండటం భావావేశపూరితమైనదే, జాతీయ జట్టు ఆడే సమయంలో స్టాండ్‌లను చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. ఇది సహజం కాదన్నట్లుగా చేసే ఏ వాదనైనా తప్పుదారి పట్టించే వాదన అవుతుంది." [27] [28] [29] [30] [31] [32]
2017లో, వేల్స్ మొదటి మంత్రి కార్విన్ జోన్స్, వేల్స్ తన వన్డే జట్టును తిరిగి ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చాడు: "ఓ పక్కన ఐర్లాండ్, స్కాట్‌లాండ్ లు అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో ఆడుతోంటే వేల్స్ ఆడకపోవడం వింతగా ఉంది." అని అతను అన్నాడు. [33] [34]
క్రికెట్ మైదానాలు
[మార్చు]వేదిక | నగరం | కౌంటీ జట్టు | సామర్థ్యం | ఆడిన సంవత్సరాలు | టి20 | ||
---|---|---|---|---|---|---|---|
ప్రస్తుత వేదికలు | |||||||
ది ఓవల్ | లండన్ | సర్రే | 26,000 | 1880– | 102 | 74 | 16 |
ఓల్డ్ ట్రాఫోర్డు | మాంచెస్టర్ | లాంక్షైర్ | 26,000 | 1884– | 82 | 55 | 10 |
లార్డ్స్ | లండన్ | మిడిల్‌సెక్స్ | 28,000 | 1884– | 140 | 67 | 10 |
ట్రెంట్ బ్రిడ్జ్ | నాటింగ్‌హామ్ | నాటింగ్‌హామ్‌షైర్ | 17,500 | 1899– | 63 | 49 | 12 |
హెడ్డింగ్లీ | లీడ్స్ | యార్క్‌షైర్ | 17,500 | 1899– | 78 | 45 | 1 |
ఎడ్జ్‌బాస్టన్ | బర్మింగ్‌హామ్ | వార్విక్షైర్ | 25,000 | 1902– | 53 | 64 | 5 |
రివర్‌సైడ్ గ్రౌండ్ | చెస్టర్-లీ-స్ట్రీట్ | డర్హం | 19,000 | 1999– | 6 | 20 | 3 |
సోఫియా గార్డెన్స్ | కార్డిఫ్ | గ్లామోర్గాన్ | 15,500 | 1999– | 3 | 29 | 8 |
రోజ్ బౌల్ | సౌతాంప్టన్ | హాంప్‌షైర్ | 25,000 | 2003– | 7 | 31 | 9 |
కౌంటీ గ్రౌండ్ | టౌంటన్ | సోమర్సెట్ | 12,500 | 1983– | – | 6 | 1 |
కౌంటీ గ్రౌండ్ | బ్రిస్టల్ | గ్లౌసెస్టర్‌షైర్ | 17,500 | 1983– | – | 19 | 3 |
పూర్వ వేదికలు | |||||||
బ్రామల్ లేన్ | షెఫీల్డ్ | యార్క్‌షైర్ | 32,000 | 1902 | 1 | – | — |
సెయింట్ హెలెన్స్ | స్వాన్సీ | గ్లామోర్గాన్ | 4,500 | 1973–1983 | – | 2 | — |
నార్త్ మెరైన్ రోడ్ గ్రౌండ్ | స్కార్‌బరో | యార్క్‌షైర్ | 11,500 | 1976–1978 | – | 2 | — |
గ్రేస్ రోడ్ | లీసెస్టర్ | లీసెస్టర్‌షైర్ | 12,000 | 1983–1999 | – | 3 | — |
న్యూ రోడ్ | వోర్సెస్టర్ | వోర్సెస్టర్‌షైర్ | 5,500 | 1983–1999 | – | 3 | — |
కౌంటీ గ్రౌండ్ | సౌతాంప్టన్ | హాంప్‌షైర్ | 7,000 | 1983–1999 | – | 3 | — |
కౌంటీ గ్రౌండ్ | డెర్బీ | డెర్బీషైర్ | 9,500 | 1983–1999 | – | 2 | — |
నెవిల్ గ్రౌండ్ | టన్‌బ్రిడ్జ్ వెల్స్ | కెంట్ | 6,000 | 1983 | – | 1 | — |
కౌంటీ గ్రౌండ్ | చెమ్స్‌ఫోర్డ్ | ఎసెక్స్ | 6,500 | 1983–1999 | – | 3 | — |
సెయింట్ లారెన్స్ గ్రౌండ్ | కాంటర్బరీ | కెంట్ | 15,000 | 1999–2005 | – | 4 | — |
కౌంటీ గ్రౌండ్ | నార్తాంప్టన్ | నార్తాంప్టన్‌షైర్ | 6,500 | 1999 | – | 2 | — |
2021 జూలై 18 నాటికి[35] |
టోర్నమెంట్ చరిత్ర
[మార్చు]ఛాంపియన్స్ | |
రన్నర్స్-అప్ | |
మూడో స్థానం | |
నాల్గవ స్థానం |
ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్
[మార్చు]ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రికార్డు | ||||||||||||||||||
సంవత్సరం | లీగ్ వేదిక | ఫైనల్ హోస్ట్ | చివరి | తుది స్థానం | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pos | మ్యాచ్‌లు | Ded | PC | Pts | PCT | |||||||||||||
P | W | L | D | T | ||||||||||||||
2019–21 [36] | 4/9 | 21 | 11 | 7 | 3 | 0 | 0 | 720 | 442 | 61.4 | రోజ్ బౌల్, ఇంగ్లాండ్ | DNQ | 4వ | |||||
2021–23 [37] | 4/9 | 22 | 10 | 8 | 4 | 0 | 12 | 264 | 124 | 47 | ది ఓవల్, ఇంగ్లాండ్ | DNQ | 4వ |
క్రికెట్ ప్రపంచ కప్
[మార్చు]ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ రికార్డు | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
సంవత్సరం | రౌండు | స్థానం | గ్రూ | గె | ఓ | టై | ఫ.తే | Win % | |
1975 | సెమీ ఫైనల్ | 3/8 | 4 | 3 | 1 | 0 | 0 | 75.00 | |
1979 | రన్నర్స్-అప్ | 2/8 | 5 | 4 | 1 | 0 | 0 | 80.00 | |
1983 | సెమీ ఫైనల్ | 3/8 | 7 | 5 | 2 | 0 | 0 | 71.43 | |
1987 | రన్నర్స్-అప్ | 2/8 | 8 | 5 | 3 | 0 | 0 | 62.50 | |
1992 | 2/9 | 10 | 6 | 3 | 0 | 1 | 66.67 | ||
1996 | క్వార్టర్ ఫైనల్ | 8/12 | 6 | 2 | 4 | 0 | 0 | 33.33 | |
1999 | పూల్ దశ | 5 | 3 | 2 | 0 | 0 | 60.00 | ||
2003 | పూల్ దశ | 9/14 | 6 | 3 | 3 | 0 | 0 | 50.00 | |
2007 | సూపర్ 8 | 5/16 | 9 | 5 | 4 | 0 | 0 | 55.55 | |
2011 | క్వార్టర్ ఫైనల్ | 7/14 | 7 | 3 | 3 | 1 | 0 | 50.00 | |
2015 | పూల్ దశ | 10/14 | 6 | 2 | 4 | 0 | 0 | 33.33 | |
2019 | Champions | 1/10 | 11 | 8 | 3 | 0 | 0 | 68.18 | |
2023 | Qualified | ||||||||
Total | 1 title | 12/12 | 84 | 49 | 33 | 1 | 1 | 58.33 |
- *విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది.
టీ20 ప్రపంచకప్‌లో రికార్డు | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
సంవత్సరం | రౌండు | స్థానం | గ్రూ | గె | ఓ | టై | ఫ.తే | గెలుపు % | |
2007 | సూపర్ 8 | 7/12 | 5 | 1 | 4 | 0 | 0 | 20.00 | |
2009 | 6/12 | 5 | 2 | 3 | 0 | 0 | 40.00 | ||
2010 | ఛాంపియన్స్ | 1/12 | 7 | 5 | 1 | 0 | 1 | 83.33 | |
2012 | సూపర్ 8 | 6/12 | 5 | 2 | 3 | 0 | 0 | 40.00 | |
2014 | సూపర్ 10 | 7/16 | 4 | 1 | 3 | 0 | 0 | 25.00 | |
2016 | రన్నర్స్-అప్ | 2/16 | 6 | 4 | 2 | 0 | 0 | 66.67 | |
2021 | సెమీ ఫైనల్ | 4/16 | 6 | 4 | 2 | 0 | 0 | 66.67 | |
2022 | ఛాంపియన్స్ | 1/16 | 7 | 5 | 1 | 0 | 1 | 83.33 | |
2024 | అర్హత సాధించారు | ||||||||
మొత్తం | 2 శీర్షికలు | 8/8 | 45 | 25 | 19 | 0 | 2 | 55.55 |
- *విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది.
ICC ఛాంపియన్స్ ట్రోఫీ
[మార్చు]ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
సంవత్సరం | రౌండు | స్థానం | గ్రూ | గె | ఓ | టై | ఫ.తే | గెలుపు % |
1998 | క్వార్టర్-ఫైనల్ | 5/9 | 1 | 0 | 1 | 0 | 0 | 0.00 |
2000 | 7/11 | 1 | 0 | 1 | 0 | 0 | 0.00 | |
2002 | పూల్ దశ | 6/12 | 2 | 1 | 1 | 0 | 0 | 50.00 |
2004 | రన్నర్స్-అప్ | 2/12 | 4 | 3 | 1 | 0 | 0 | 75.00 |
2006 | పూల్ దశ | 7/10 | 3 | 1 | 2 | 0 | 0 | 33.33 |
2009 | సెమీ ఫైనల్ | 4/8 | 4 | 2 | 2 | 0 | 0 | 50.00 |
2013 | రన్నర్స్-అప్ | 2/8 | 5 | 3 | 2 | 0 | 0 | 60.00 |
2017 | సెమీ ఫైనల్ | 3/8 | 4 | 3 | 1 | 0 | 0 | 75.00 |
2025 | ||||||||
మొత్తం | 0 టైటిళ్ళు | 8/8 | 24 | 13 | 11 | 0 | 0 | 54.17 |
- *విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది.
గుర్తింపులు
[మార్చు]- ప్రపంచ కప్ :
- ఛాంపియన్స్ (1): 2019
- రన్నర్స్-అప్ (3): 1979, 1987, 1992
- టి20 ప్రపంచ కప్ :
- ఛాంపియన్స్ (2): 2010, 2022
- రన్నరప్ (1): 2016
- ఛాంపియన్స్ ట్రోఫీ :
- రన్నర్స్-అప్ (2): 2004, 2013
రికార్డులు
[మార్చు]టెస్ట్ మ్యాచ్‌లు
[మార్చు]టెస్టు జట్టు రికార్డులు
[మార్చు]- అత్యధిక జట్టు స్కోరు: 903–7 డిసెంబరు., 1938లో ఓవల్‌లో ఆస్ట్రేలియాతో
- అత్యల్ప జట్టు స్కోరు: 45, 1886/87లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో
- టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్ తేడాతో 100 విజయాలు సాధించిన ఏకైక జట్టు ఇంగ్లండ్.
టెస్టులలో వ్యక్తిగత రికార్డులు
[మార్చు]- అత్యధిక మ్యాచ్‌లు: 178 టెస్టులు – జేమ్స్ ఆండర్సన్ [38]
- సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన: 64 టెస్టులు - జో రూట్
టెస్టులలో బ్యాటింగ్ రికార్డులు
[మార్చు]- అత్యధిక పరుగులు: 12,472 – అలస్టర్ కుక్[39]
- అత్యుత్తమ సగటు: 60.73 – హెర్బర్ట్ సట్‌క్లిఫ్[40]
- అత్యధిక వ్యక్తిగత స్కోరు: 364 – లెన్ హట్టన్ 1938లో ది ఓవల్‌లో లెన్ హట్టన్, ఆస్ట్రేలియాతో
- రికార్డ్ భాగస్వామ్యం: 411 – 1957లో ఎడ్జ్‌బాస్టన్‌లో కోలిన్ కౌడ్రే, పీటర్ మే, వెస్టిండీస్‌తో
- అత్యధిక సెంచరీలు: 33 – అలస్టర్ కుక్
- అత్యధిక డబుల్ సెంచరీలు: 7 – వాలీ హమ్మండ్
- ఇంగ్లండ్ యొక్క అత్యంత ఫలవంతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం జాక్ హాబ్స్, హెర్బర్ట్ సట్‌క్లిఫ్. 38 ఇన్నింగ్స్‌లలో, వారు 15 సెంచరీ భాగస్వామ్యాలు, 50 లేదా అంతకంటే ఎక్కువ 10 మందితో మొదటి వికెట్‌కు 87.81 సగటును సాధించారు.
- అత్యధిక డకౌట్లు: 39 – స్టువర్ట్ బ్రాడ్[41]
టెస్ట్ బౌలింగ్ రికార్డులు
[మార్చు]- అత్యధిక వికెట్లు: 685 - జేమ్స్ ఆండర్సన్
- అత్యుత్తమ సగటు: 10.75 - జార్జ్ లోమాన్
- అత్యుత్తమ ఇన్నింగ్స్ బౌలింగ్: 10/53 - జిమ్ లేకర్, 1956లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద ఆస్ట్రేలియాతో
- బెస్ట్ మ్యాచ్ బౌలింగ్: 19/90 - జిమ్ లేకర్, 1956లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద ఆస్ట్రేలియాతో
- అత్యుత్తమ స్ట్రైక్ రేట్ : 34.1 - జార్జ్ లోమాన్
- అత్యుత్తమ ఎకానమీ రేటు: 1.31 - విలియం అట్టేవెల్
- ఐదుగురు ఇంగ్లండ్ బౌలర్లు ఒక ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టారు, వీటిలో మూడు హెడింగ్లీలో ఉన్నాయి. వారు
- మారిస్ అల్లోమ్, 1929-30లో క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో,
- కెన్నెత్ క్రాన్స్టన్, 1947లో దక్షిణాఫ్రికాతో హెడ్డింగ్లీలో,
- ఫ్రెడ్ టిట్మస్, 1965లో హెడ్డింగ్లీలో న్యూజిలాండ్‌తో,
- క్రిస్ ఓల్డ్, 1978లో ఎడ్జ్‌బాస్టన్‌లో పాకిస్థాన్‌తో,
- ఆండీ కాడిక్, 2000లో హెడ్డింగ్లీలో వెస్టిండీస్‌తో
టెస్ట్ ఫీల్డింగ్ రికార్డులు
[మార్చు]- ఔట్ ఫీల్డర్ ద్వారా అత్యధిక క్యాచ్‌లు: 175 - అలస్టర్ కుక్
- వికెట్ కీపర్‌గా అత్యధిక అవుట్‌లు: 269 - అలాన్ నాట్
- ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక అవుట్‌లు: 7 - బాబ్ టేలర్, 1979/80లో బొంబాయిలో భారతదేశంతో
- ఒక మ్యాచ్‌లో అత్యధిక అవుట్‌లు: 11 - జాక్ రస్సెల్, 1995/96లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో
వివిధ దేశాలతో ఆడిన టెస్టుల రికార్డు
[మార్చు]ప్రత్యర్థి | మ్యా | గె | ఓ | టై | డ్రా | గెలుపు % | తొలి గెలుపు |
---|---|---|---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 360 | 111 | 152 | 0 | 97 | 30.83 | 1877 ఏప్రిల్ 4 |
దక్షిణాఫ్రికా | 156 | 66 | 35 | 0 | 55 | 42.31 | 1889 మార్చి 13 |
వెస్ట్ ఇండీస్ | 163 | 51 | 59 | 0 | 53 | 31.29 | 1928 జూన్ 26 |
న్యూజీలాండ్ | 112 | 52 | 13 | 0 | 46 | 46.43 | 1930 జనవరి 13 |
భారతదేశం | 131 | 50 | 31 | 0 | 50 | 38.16 | 1932 జూన్ 28 |
పాకిస్తాన్ | 89 | 29 | 21 | 0 | 39 | 32.58 | 1954 జూలై 5 |
శ్రీలంక | 36 | 17 | 8 | 0 | 11 | 47.22 | 1982 ఫిబ్రవరి 21 |
జింబాబ్వే | 6 | 3 | 0 | 0 | 3 | 50.00 | 2000 మే 21 |
ఐర్లాండ్ | 2 | 2 | 0 | 0 | 0 | 100.00 | 2019 జూలై 26 |
బంగ్లాదేశ్ | 10 | 9 | 1 | 0 | 0 | 90.00 | 2003 అక్టోబరు 25 |
ఆఫ్ఘనిస్తాన్ | ఇంకా ఆడాలి | ||||||
రికార్డ్‌లు టెస్ట్ #2512 వరకు. చివరిగా నవీకరించబడింది: 2023 జూలై 23. [42] |
వన్ డే ఇంటర్నేషనల్స్
[మార్చు]వన్డే జట్టు రికార్డులు
[మార్చు]- అత్యధిక జట్టు స్కోరు: 498/4 (50 ఓవర్లు), 2022లో VRA క్రికెట్ గ్రౌండ్‌లో నెదర్లాండ్స్‌తో
- అత్యల్ప జట్టు స్కోరు: 86 (32.4 ఓవర్లు), 2001లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద ఆస్ట్రేలియాతో
వన్డే వ్యక్తిగత రికార్డులు
[మార్చు]- అత్యధిక మ్యాచ్‌లు: 225 - ఇయాన్ మోర్గాన్
- సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన: 126 మ్యాచ్‌లు – ఇయాన్ మోర్గాన్ [43]
వన్డే బ్యాటింగ్ రికార్డులు
[మార్చు]- అత్యధిక పరుగులు: 6,957 - ఇయాన్ మోర్గాన్
- అత్యుత్తమ సగటు: 51.25 - జోనాథన్ ట్రాట్
- అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 117.97 - జోస్ బట్లర్
- అత్యధిక వ్యక్తిగత స్కోరు: 180 - జాసన్ రాయ్, 2018లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో
- రికార్డ్ భాగస్వామ్యం: 256* - అలెక్స్ హేల్స్, జాసన్ రాయ్, 2016లో ఎడ్జ్‌బాస్టన్‌లో శ్రీలంకతో
- అత్యధిక శతాబ్దాలు: 16 - జో రూట్
- అత్యధిక డకౌట్లు: 15 - ఇయాన్ మోర్గాన్
వన్డే బౌలింగ్ రికార్డులు
[మార్చు]- అత్యధిక వికెట్లు: 269 - జేమ్స్ ఆండర్సన్
- అత్యుత్తమ సగటు: 19.45 - మైక్ హెండ్రిక్
- అత్యుత్తమ బౌలింగ్: 6/31 – పాల్ కాలింగ్‌వుడ్, 2005లో ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద బంగ్లాదేశ్‌తో
- అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 30.6 - లియామ్ ప్లంకెట్
- అత్యుత్తమ ఎకానమీ రేటు: 3.27 - మైక్ హెండ్రిక్
వన్డే ఫీల్డింగ్ రికార్డులు
[మార్చు]- ఔట్ ఫీల్డర్ ద్వారా అత్యధిక క్యాచ్‌లు: 108 - పాల్ కాలింగ్‌వుడ్
- వికెట్ కీపర్‌గా అత్యధిక అవుట్‌లు: 238 - జోస్ బట్లర్
- ఒక మ్యాచ్‌లో అత్యధిక అవుట్‌లు: 6 - అలెక్ స్టీవర్ట్, 2000లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద జింబాబ్వే ; మాట్ ప్రియర్, 2008లో ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద దక్షిణాఫ్రికా ; జోస్ బట్లర్, 2013లో ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో
వివిధ దేశాలతో ఆడిన వన్డేల రికార్డు
[మార్చు]ప్రత్యర్థి | మ్యా | గె | ఓ | టై | ఫ.తే | గెలుపు % | తొలి గెలుపు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
v. Test nations | |||||||||||||||
ఆఫ్ఘనిస్తాన్ | 2 | 2 | 0 | 0 | 0 | 100.00 | 2015 మార్చి 13 | ||||||||
ఆస్ట్రేలియా | 155 | 63 | 87 | 2 | 3 | 40.64 | 1972 ఆగస్టు 24 | ||||||||
బంగ్లాదేశ్ | 24 | 19 | 5 | 0 | 0 | 79.17 | 2000 అక్టోబరు 5 | ||||||||
భారతదేశం | 106 | 44 | 57 | 2 | 3 | 43.68 | 1974 జూలై 13 | ||||||||
ఐర్లాండ్ | 13 | 10 | 2 | 0 | 1 | 83.33 | 2006 జూన్ 13 | ||||||||
న్యూజీలాండ్ | 91 | 41 | 43 | 3 | 4 | 48.83 | 1973 జూలై 18 | ||||||||
పాకిస్తాన్ | 91 | 56 | 32 | 0 | 3 | 63.63 | 1977 డిసెంబరు 23 | ||||||||
దక్షిణాఫ్రికా | 69 | 30 | 33 | 1 | 5 | 47.65 | 1992 మార్చి 12 | ||||||||
శ్రీలంక | 78 | 38 | 36 | 1 | 3 | 50.67 | 1982 ఫిబ్రవరి 13 | ||||||||
వెస్ట్ ఇండీస్ | 102 | 52 | 44 | 0 | 6 | 54.16 | 1973 సెప్టెంబరు 5 | ||||||||
జింబాబ్వే | 30 | 21 | 8 | 0 | 1 | 72.41 | 1995 జనవరి 7 | ||||||||
v. అసోసియేట్ సభ్యులు | |||||||||||||||
కెనడా | 2 | 2 | 0 | 0 | 0 | 100.00 | 1979 జూన్ 13 | ||||||||
East Africa | 1 | 1 | 0 | 0 | 0 | 100.00 | 1975 జూన్ 14 | ||||||||
కెన్యా | 2 | 2 | 0 | 0 | 0 | 100.00 | 1999 మే 18 | ||||||||
నమీబియా | 1 | 1 | 0 | 0 | 0 | 100.00 | 2003 ఫిబ్రవరి 19 | ||||||||
నెదర్లాండ్స్ | 6 | 6 | 0 | 0 | 0 | 100.00 | 1996 ఫిబ్రవరి 22 | ||||||||
స్కాట్‌లాండ్ | 5 | 3 | 1 | 0 | 1 | 75.00 | 2010 జూన్ 19 | ||||||||
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 1 | 1 | 0 | 0 | 0 | 100.00 | 1996 ఫిబ్రవరి 18 | ||||||||
చివరిగా తాజాకరించినది 2023 మార్చి 6. విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది..[44] |
టి20 ఇంటర్నేషనల్ పోటీలు
[మార్చు]గణాంకాలలో 2022 నవంబరు 13 వరకు గేమ్‌లు ఉన్నాయి.
టి20 జట్టు రికార్డులు
[మార్చు]- అత్యధిక జట్టు స్కోరు: 241/3, 2019లో మెక్లీన్ పార్క్ వద్ద న్యూజిలాండ్‌తో
- అత్యల్ప జట్టు స్కోరు: 80, 2012లో కొలంబో (RPS) వద్ద భారతదేశంతో
టి20 వ్యక్తిగత రికార్డులు
[మార్చు]- అత్యధిక మ్యాచ్‌లు: 115 - ఇయాన్ మోర్గాన్
- ఎక్కువ కాలం కెప్టెన్‌గా పనిచేసిన: 72 మ్యాచ్‌లు - ఇయాన్ మోర్గాన్
టి20 బ్యాటింగ్ రికార్డులు
[మార్చు]- అత్యధిక పరుగులు: 2,713 - జోస్ బట్లర్
- అత్యుత్తమ సగటు: 37.93 - కెవిన్ పీటర్సన్
- అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 147.90 - లియామ్ లివింగ్‌స్టోన్
- అత్యధిక వ్యక్తిగత స్కోరు: 116* - అలెక్స్ హేల్స్, 2014లో చిట్టగాంగ్‌లో శ్రీలంకతో
- రికార్డ్ భాగస్వామ్యం: 182 – డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్, 2019లో మెక్లీన్ పార్క్ వద్ద న్యూజిలాండ్‌తో
- అత్యధిక శతాబ్దాలు: 1 - అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, జోస్ బట్లర్
- అత్యధిక డకౌట్లు: 9 - ల్యూక్ రైట్, మోయిన్ అలీ
టి20 బౌలింగ్ రికార్డులు
[మార్చు]- అత్యధిక వికెట్లు: 96 – క్రిస్ జోర్డాన్
- అత్యుత్తమ సగటు: 16.84 – గ్రేమ్ స్వాన్
- అత్యుత్తమ బౌలింగ్: 5/10 – 2022లో పెర్త్‌లో సామ్ కర్రాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో
- అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 13.2 – మార్క్ వుడ్
- అత్యుత్తమ ఎకానమీ రేటు: 6.36 – గ్రేమ్ స్వాన్
టి20 ఫీల్డింగ్ రికార్డులు
[మార్చు]- అవుట్ ఫీల్డర్ ద్వారా అత్యధిక క్యాచ్‌లు: 46 - ఇయాన్ మోర్గాన్
- వికెట్ కీపర్‌గా అత్యధిక అవుట్‌లు: 64 – జోస్ బట్లర్ [a]
- ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక అవుట్‌లు: 4 – మాట్ ప్రియర్, 2007లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో
వివిధ దేశాలతో ఆడిన టి20 ల రికార్డు
[మార్చు]ప్రత్యర్థి | మ్యా | గె | ఓ | టై+గె | టై+ఓ | ఫ.తే | గెలుపు % | తొలి గెలుపు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
v. టెస్టు దేశాలు | |||||||||||||||
ఆఫ్ఘనిస్తాన్ | 3 | 3 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2012 సెప్టెంబరు 21 | |||||||
ఆస్ట్రేలియా | 23 | 11 | 10 | 0 | 0 | 2 | 47.82 | 2005 జూన్ 13 | |||||||
బంగ్లాదేశ్ | 4 | 1 | 3 | 0 | 0 | 0 | 25.00 | 2021 అక్టోబరు 27 | |||||||
భారతదేశం | 23 | 11 | 12 | 0 | 0 | 0 | 47.82 | 2009 జూన్ 14 | |||||||
ఐర్లాండ్ | 2 | 0 | 1 | 0 | 0 | 1 | 0.00 | – | |||||||
న్యూజీలాండ్ | 23 | 13 | 8 | 1 | 0 | 1 | 56.52 | 2008 ఫిబ్రవరి 5 | |||||||
పాకిస్తాన్ | 29 | 18 | 9 | 1 | 0 | 1 | 66.07 | 2009 జూన్ 7 | |||||||
దక్షిణాఫ్రికా | 25 | 12 | 12 | 0 | 0 | 1 | 50.00 | 2009 నవంబరు 13 | |||||||
శ్రీలంక | 14 | 10 | 4 | 0 | 0 | 0 | 71.43 | 2010 మే 13 | |||||||
వెస్ట్ ఇండీస్ | 24 | 10 | 14 | 0 | 0 | 0 | 41.67 | 2007 జూన్ 29 | |||||||
జింబాబ్వే | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2007 సెప్టెంబరు 13 | |||||||
v. అసోసియేట్ సభ్యులు | |||||||||||||||
నెదర్లాండ్స్ | 2 | 0 | 2 | 0 | 0 | 0 | 0.00 | – | |||||||
రికార్డ్‌లు టి20 #2026, 2023 మార్చి 14 వరకు. T+W ,T+L టైబ్రేకర్‌లో (సూపర్ ఓవర్ వంటివి) టై అయిన మ్యాచ్‌లు, వాటిలో గెలిచినవి ఓడిపోయినవీ సూచిస్తాయి. విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది.[45] |
ఇంగ్లాండ్ జట్టులో ఎక్కువసార్లు ఆడిన ఆటగాళ్ళు
[మార్చు]ఈ జాబితాల్లో ఆట ప్రతి రూపంలోనూ ఇంగ్లండ్ తరపున అత్యధికంగా ఆడిన ఐదుగురు ఆటగాళ్లను చూడవచ్చు. ఇవి 2023 మార్చి 14 వరకు సరైనవి.
- † = ఎంపిక కోసం అందుబాటులో ఉన్న ఆటగాళ్లు, గత 12 నెలల్లో ఇంగ్లండ్‌కు ఫార్మాట్‌లో ప్రాతినిధ్యం వహించినవాళ్ళు.
|
|
|
ప్రస్తుత జట్టు
[మార్చు]ఇది గత సంవత్సరం (2022 జూలై 11 నుండి) ఇంగ్లండ్ తరపున ఆడిన యాక్టివ్ ప్లేయర్‌లందరి జాబితా ఇది.
ECB ప్రతి సంవత్సరం సెప్టెంబరులో, ఇంగ్లండ్ ఆటగాళ్లలో జట్టులో ప్రధానంగా ఉండాలని సెలెక్టర్లు భావించేవారికి సెంట్రల్ కాంట్రాక్టులను అందజేస్తుంది.[49] సంవత్సరంలో తగినన్ని ఆటలు ఆడే ఇతర ఆటగాళ్ళకు ఇంక్రిమెంటల్ కాంట్రాక్టులు ఇస్తారు. ప్రతిభ ఉన్న యువ ఫాస్ట్ బౌలర్ల కోసం పేస్ బౌలింగ్ అభివృద్ధి ఒప్పందాలు కూడా ఉన్నాయి. [50]
పేరు | వయసు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు | C/T | రకాలు | S/N | కెప్టెన్సీ | చివరి టెస్టు | చివరి వన్‌డే | చివరి టి20 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాట్స్‌మన్లు | |||||||||||
హ్యారీ బ్రూక్ | 25 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ మీడియం పేస్ | యార్క్‌షైర్ | I | టెస్టులు, వన్‌డే, టి20 | 88 | 2023 | 2023 | 2022 | |
జాక్ క్రాలే | 26 | కుడిచేతి వాటం | — | కెంట్ | C | టెస్టులు | 6 | 2023 | 2021 | — | |
బెన్ డకెట్ | 30 | ఎడమచేతి వాటం | — | నాటింగ్‌హ్యామ్‌షైర్ | — | టెస్టులు, వన్‌డే, టి20 | 17 | 2023 | 2023 | 2023 | |
అలెక్స్ హేల్స్ | 36 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ మీడియం పేస్ | నాటింగ్‌హ్యామ్‌షైర్ | — | టి20 | 10 | 2016 | 2019 | 2022 | |
విల్ జాక్స్ | 26 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | సర్రీ | — | టెస్టులు, వన్‌డే, టి20 | 85 | 2022 | 2023 | 2022 | |
డాన్ లారెన్స్ | 27 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఎసెక్స్ | — | టెస్టులు | 68 | 2022 | — | — | |
డేవిడ్ మలన్ | 37 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్ | యార్క్‌షైర్ | I | వన్‌డే, టి20 | 29 | 2022 | 2023 | 2023 | |
ఒల్లీ పోప్ | 27 | కుడిచేతి వాటం | — | సర్రీ | C | టెస్టులు | 80 | టెస్టులు (VC) | 2023 | — | — |
జో రూట్ | 34 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్/leg spin | యార్క్‌షైర్ | C | టెస్టులు | 66 | 2023 | 2022 | 2019 | |
జాసన్ రాయ్ | 34 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ మీడియం పేస్ | సర్రీ | I | వన్డే | 20 | 2019 | 2023 | 2022 | |
జేమ్స్ విన్స్ | 33 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ మీడియం పేస్ | హ్యాంప్‌షైర్ | — | వన్డే | 14 | 2018 | 2023 | 2022 | |
ఆల్ రౌండర్లు | |||||||||||
రెహాన్ అహ్మద్ | 20 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్ | లీస్టషైర్ | — | టెస్టులు, వన్‌డే, టి20 | 53 | 2022 | 2023 | 2023 | |
మొయిన్ అలీ | 37 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | వార్విక్‌షైర్ | C | టెస్టులు, వన్‌డే, టి20 | 18 | వన్‌డే, టి20 (VC) | 2023 | 2023 | 2023 |
సామ్ కర్రాన్ | 26 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | సర్రీ | C | వన్‌డే, టి20 | 58 | 2021 | 2023 | 2023 | |
లియామ్ డాసన్ | 34 | కుడిచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థడాక్స్ | హ్యాంప్‌షైర్ | — | వన్‌డే, టి20 | 83 | 2017 | 2022 | 2022 | |
లియామ్ లివింగ్‌స్టోన్ | 31 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్/ఆఫ్ బ్రేక్ | లాంకషైర్ | C | టెస్టులు, టి20 | 23 | 2022 | 2022 | 2022 | |
క్రెయిగ్ ఓవర్టన్ | 30 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ మీడియం పేస్-ఫాస్ట్ | సోమర్సెట్ | P | — | 32 | 2022 | 2022 | — | |
జామీ ఓవర్టన్ | 30 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | సర్రీ | P | — | 75 | 2022 | — | — | |
బెన్ స్టోక్స్ | 33 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియమ్ | డర్‌హ్యామ్ | C | టెస్టులు, టి20 | 55 | టెస్టులు (C) | 2023 | 2022 | 2022 |
డేవిడ్ విల్లీ | 34 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియమ్ | నార్తాంప్టన్‌షైర్ | I | వన్‌డే, టి20 | 15 | — | 2023 | 2022 | |
క్రిస్ వోక్స్ | 35 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియమ్ | వార్విక్‌షైర్ | C | టెస్టులు, వన్‌డే, టి20 | 19 | 2023 | 2023 | 2023 | |
ల్యూక్ వుడ్ | 29 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియమ్ | లాంకషైర్ | — | వన్‌డే, టి20 | 77 | — | 2022 | 2022 | |
వికెట్ కీపర్లు | |||||||||||
జానీ బెయిర్‌స్టో | 35 | కుడిచేతి వాటం | — | యార్క్‌షైర్ | C | టెస్టులు | 51 | 2023 | 2022 | 2022 | |
సామ్ బిల్లింగ్స్ | 33 | కుడిచేతి వాటం | — | కెంట్ | — | వన్డే | 7 | 2022 | 2022 | 2022 | |
జోస్ బట్లర్ | 34 | కుడిచేతి వాటం | — | లాంకషైర్ | C | వన్‌డే, టి20 | 63 | వన్‌డే, టి20I (కె) | 2022 | 2023 | 2023 |
బెన్ ఫోక్స్ | 31 | కుడిచేతి వాటం | — | సర్రీ | C | టెస్టులు | 50 | 2023 | 2019 | 2019 | |
ఫిల్ సాల్ట్ | 28 | కుడిచేతి వాటం | — | లాంకషైర్ | — | వన్‌డే, టి20 | 61 | — | 2023 | 2023 | |
పేస్ బౌలర్లు | |||||||||||
జేమ్స్ ఆండర్సన్ | 42 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియమ్ | లాంకషైర్ | C | టెస్టులు | 9 | 2023 | 2015 | 2009 | |
జోఫ్రా ఆర్చర్ | 29 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | ససెక్స్ | C | వన్‌డే, టి20 | 22 | 2021 | 2023 | 2023 | |
స్టువర్ట్ బ్రాడ్ | 38 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియమ్ | నాటింగ్‌హ్యామ్‌షైర్ | C | టెస్టులు | 8 | 2023 | 2016 | 2014 | |
బ్రైడన్ కార్సే | 29 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | డర్‌హ్యామ్ | P | — | 92 | — | 2022 | — | |
మాథ్యూ ఫిషర్ | 27 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియమ్ | యార్క్‌ష్క్వైర్ | D | — | 40 | 2022 | — | — | |
రిచర్డ్ గ్లీసన్ | 37 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియమ్ | లాంకషైర్ | — | టి20 | 71 | — | — | 2022 | |
క్రిస్ జోర్డాన్ | 36 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియమ్ | సర్రీ | — | వన్‌డే, టి20 | 34 | 2015 | 2022 | 2023 | |
సాకిబ్ మహమూద్ | 27 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియమ్ | లాంకషైర్ | P | వన్డే | 25 | 2022 | 2023 | 2022 | |
మాథ్యూ పాట్స్ | 26 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియమ్ | డర్‌హ్యామ్ | I | టెస్టులు | 35 | 2023 | 2022 | — | |
ఆలీ రాబిన్సన్ | 31 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ మీడియం పేస్-ఫాస్ట్ | ససెక్స్ | C | టెస్టులు | 57 | 2023 | — | — | |
ఆలీ స్టోన్ | 31 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | నాటింగ్‌హ్యామ్‌షైర్ | P | వన్‌డే, టి20 | 26 | 2021 | 2023 | 2022 | |
జోష్ టంగ్ | 27 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియమ్ | వోర్సెస్టర్‌షైర్ | — | టెస్టులు | 56 | 2023 | — | — | |
రీస్ టోప్లీ | 30 | కుడిచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియమ్ | సర్రీ | I | వన్‌డే, టి20 | 38 | — | 2023 | 2022 | |
మార్క్ వుడ్ | 34 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | డర్‌హ్యామ్ | C | టెస్టులు, వన్‌డే, టి20 | 33 | 2023 | 2023 | 2023 | |
స్పిన్ బౌలర్లు | |||||||||||
జాక్ లీచ్ | 33 | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థడాక్స్ | సోమర్‌సెట్ | C | టెస్టులు | 77 | 2023 | — | — | |
ఆదిల్ రషీద్ | 36 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్ | యార్క్‌షైర్ | C | వన్‌డే, టి20 | 95 | 2019 | 2023 | 2023 |
కోచింగ్ సిబ్బంది
[మార్చు]స్థానం | పేరు |
---|---|
మేనేజింగ్ డైరెక్టర్ | రాబర్ట్ కీ |
ప్రదర్శన దర్శకుడు | మో బోబాట్ |
సెలెక్టర్ | ల్యూక్ రైట్ |
టెస్టులు
[మార్చు]స్థానం | పేరు |
---|---|
ప్రధాన కోచ్ | బ్రెండన్ మెకల్లమ్ |
అసిస్టెంట్ కోచ్ | పాల్ కాలింగ్‌వుడ్ |
అసిస్టెంట్ కోచ్ | మార్కస్ ట్రెస్కోథిక్ |
స్పిన్ బౌలింగ్ కోచ్ | జీతన్ పటేల్ |
పేస్ బౌలింగ్ కోచ్ | నీల్ కిలీన్ |
పరిమిత ఓవర్లు
[మార్చు]స్థానం | పేరు |
---|---|
ప్రధాన కోచ్ | మాథ్యూ మోట్ |
అసిస్టెంట్ కోచ్ | రిచర్డ్ డాసన్ |
అసిస్టెంట్ కోచ్ | డేవిడ్ సాకర్ |
అసిస్టెంట్ కోచ్ | కార్ల్ హాప్కిన్సన్ |
ఇంగ్లండ్ పురుష క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
[మార్చు]ప్రతి సీజన్ ప్రారంభంలో ECB ఇంగ్లండ్ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందజేస్తుంది, "గత సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో అత్యుత్తమ ప్రదర్శనలను గుర్తించి", [51] క్రికెట్ మీడియా సభ్యులు ఓటు వేశారు. [52]
ఈ అవార్డును గతంలో గెలుచుకున్న వారు:
- 2006/07: ఆండ్రూ ఫ్లింటాఫ్ [53]
- 2007/08: ఇయాన్ బెల్
- 2008/09: కెవిన్ పీటర్సన్
- 2009/10: గ్రేమ్ స్వాన్ [54]
- 2010/11: జోనాథన్ ట్రాట్ [55]
- 2011/12: జేమ్స్ ఆండర్సన్ [56]
- 2012/13: మాట్ ప్రయర్ [57]
- 2013/14: ఇయాన్ బెల్ [51]
- 2014/15: జో రూట్ [58]
- 2015/16: జో రూట్ [59]
ఇవి కూడా చూడండి
[మార్చు]నోట్స్
[మార్చు]- ↑ Some sources list Butler with 65 dismissals as keeper
మూలాలు
[మార్చు]- ↑ "ICC Rankings". International Cricket Council.
- ↑ "Test matches - Team records". ESPNcricinfo.
- ↑ "Test matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ "ODI matches - Team records". ESPNcricinfo.
- ↑ "ODI matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ "T20I matches - Team records". ESPNcricinfo.
- ↑ "T20I matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ Waghorn, pp.22–23.
- ↑ 9.0 9.1 "England v Australia 1864 – 1888". ESPNcricinfo. 19 September 2006. Archived from the original on 6 January 2009. Retrieved 5 February 2008.
- ↑ "Australia in England 1880". Wisden. Archived from the original on 8 July 2012. Retrieved 5 February 2008.
- ↑ Williams, Marcus (6 November 2002). "The Ashes in The Times". The Times. London. Archived from the original on 10 February 2008. Retrieved 5 February 2008.
- ↑ "England in Australia, 1882–83". Wisden. Archived from the original on 19 January 2013. Retrieved 5 February 2008.
- ↑ "England in Australia, 1882–83". Wisden. Archived from the original on 19 January 2013. Retrieved 5 February 2008.
- ↑ "Australia v England". Wisden. Archived from the original on 7 January 2009. Retrieved 5 February 2008.
- ↑ "Test matches". ESPNcricinfo. Retrieved 5 February 2008.
- ↑ "South Africa v England". Wisden. Archived from the original on 10 July 2012. Retrieved 5 February 2008.
- ↑ "ECB Annual Report and Accounts 2006" (PDF). England and Wales Cricket Board. Archived from the original (PDF) on 27 September 2007. Retrieved 7 October 2007.
- ↑ "ICC Cricket World Cup countdown - Scotland". ESPNcricinfo (in ఇంగ్లీష్). 15 September 2005. Retrieved 2023-04-14.
- ↑ "Cricket Scotland". www.icc-cricket.com. Archived from the original on 2023-11-04. Retrieved 2023-04-14.
- ↑ 20.0 20.1 Lewis, Thomas (2022-01-18). "Some fans think Wales should declare independence from England - at cricket". North Wales Live (in ఇంగ్లీష్). Retrieved 2023-04-14.
- ↑ 21.0 21.1 Ruscoe, Sybil (13 September 2004). "England's Welshmen call for name change". Daily Telegraph. Archived from the original on 10 January 2022.
- ↑ "Should Wales have its own international cricket team, ask Assembly Members". Wales Online. 23 October 2013. Archived from the original on 4 March 2016. Retrieved 13 January 2014.
- ↑ "Clearing the Boundaries" (PDF). Cricket Wales. Archived (PDF) from the original on 3 January 2017. Retrieved 30 May 2017.
- ↑ "Glamorgan chief executive says Wales cricket team makes 'no sense'". BBC. 14 June 2018. Archived from the original on 31 January 2019. Retrieved 6 November 2018.
- ↑ "Glamorgan oppose petition to form a Wales cricket team". BBC. 12 December 2011. Archived from the original on 14 November 2018. Retrieved 6 November 2018.
- ↑ "Establishment of a Welsh Cricket Team". BBC Democracy Live. 23 October 2013. Archived from the original on 14 November 2018. Retrieved 6 November 2018.
- ↑ Shipton, Martin (12 August 2013). "A Welsh national cricket team? AMs will have their say on the possibility this autumn". walesonline. Archived from the original on 8 December 2015. Retrieved 21 March 2016.
- ↑ Wyn-Williams, Gareth (14 March 2015). "Welsh national cricket team should be set up says Rhun ap Iorwerth". northwales. Archived from the original on 8 December 2015. Retrieved 21 March 2016.
- ↑ "Jonathan EdwardsTowards a National Future for Welsh Cricket". Archived from the original on 4 March 2016. Retrieved 21 March 2016.
- ↑ Shipton, Martin (23 October 2013). "Should Wales have its own international cricket team, ask Assembly Members". Wales Online. Archived from the original on 4 March 2016. Retrieved 21 March 2016.
- ↑ "The bat and the daffodil". The Economist. ISSN 0013-0613. Retrieved 21 March 2016.
- ↑ Williamson, David (7 September 2008). "Call for Wales to have its own cricket team". Wales Online. Archived from the original on 4 March 2016. Retrieved 21 March 2016.
- ↑ "Wales cricket team should play one-day games, Carwyn Jones says". BBC. BBC News. 4 July 2017. Archived from the original on 29 January 2019. Retrieved 6 November 2018.
- ↑ Williamson, David (5 July 2017). "Carwyn Jones says Wales should have a one-day international Welsh cricket team". Wales Online. Archived from the original on 6 November 2018. Retrieved 6 November 2018.
- ↑ "List of cricket grounds in England and Wales". Archived from the original on 24 June 2018. Retrieved 19 July 2021.
- ↑ "ICC World Test Championship 2021–2023 Table". ESPNcricinfo. Retrieved 11 June 2023.
- ↑ "ICC World Test Championship 2019–2021 Table". ESPNcricinfo. Retrieved 29 August 2021.
- ↑ "Most Test matches playing for England", ESPNcricinfo, archived from the original on 22 December 2011, retrieved 14 June 2021
- ↑ "Most Runs for England", ESPNcricinfo, archived from the original on 22 December 2011, retrieved 14 June 2021 Retrieved on 26 January 2016.
- ↑ "Highest Batting Averages", ESPNcricinfo, archived from the original on 16 November 2017, retrieved 13 February 2019 Retrieved on 13 February 2019.
- ↑ "Most ducks for England". ESPNcricinfo. Retrieved 14 June 2021.
- ↑ "Records / England / Test matches / Result summary". ESPNcricinfo. Retrieved 11 December 2021.
- ↑ "Records / England / One-Day Internationals / Most matches as captain". ESPNcricinfo. Retrieved 14 September 2020.
- ↑ "Records / England / ODI matches / Result summary". ESPNcricinfo. Archived from the original on 2018-08-27. Retrieved 18 July 2022.
- ↑ "England Cricket Team Records & Stats | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 10 November 2022.
- ↑ "England Cricket Team Records & Stats | Most Test matches". Cricinfo. Retrieved 2022-07-01.
- ↑ "England Cricket Team Records & Stats | Most One-Day International matches". Cricinfo. Retrieved 2022-07-18.
- ↑ "England Cricket Team Records & Stats | Most Twenty20 International matches". Cricinfo. Retrieved 2022-09-26.
- ↑ "Liam Livingstone, Ben Foakes earn ECB full contracts but Alex Lees, Jason Roy miss out". ESPNcricinfo. Retrieved 11 October 2022.
- ↑ "ECB announces contracts overhaul as 20 players get new deals". ESPNcricinfo. Retrieved 8 October 2021.
- ↑ 51.0 51.1 "England Cricketer of Year Awards 2013–2014". Archived from the original on 8 March 2016.
- ↑ "Joe Root and Charlotte Edwards named England cricketers of the year". The Guardian. Archived from the original on 6 October 2016. Retrieved 14 December 2016.
- ↑ "Flintoff & Brunt win annual award". 8 May 2006. Archived from the original on 8 September 2018. Retrieved 8 September 2018 – via news.bbc.co.uk.
- ↑ "Swann named cricketer of the year". 24 May 2010. Archived from the original on 8 September 2018. Retrieved 8 September 2018 – via news.bbc.co.uk.
- ↑ "ECB award for Trott". Archived from the original on 8 September 2018. Retrieved 8 September 2018.
- ↑ "ECB announces winners of England Cricketer of Year Awards for 2011–12". Archived from the original on 9 October 2017. Retrieved 8 September 2018.
- ↑ ECB announces Cricketers of the Year Archived 8 జనవరి 2016 at the Wayback Machine
- ↑ Root and Edwards scoop England awards Archived 28 జనవరి 2016 at the Wayback Machine
- ↑ Root, Shrubsole, Flynn and Lawrence honoured in Leeds Archived 17 మే 2016 at the Wayback Machine