Jump to content

జిమ్ లేకర్

వికీపీడియా నుండి
జిమ్ లేకర్
దస్త్రం:Laker at Old Trafford.jpg
1956లో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో మైదానం నుంచి నడచివెళ్తున్న జిమ్ లేకర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జేమ్స్ చార్లెస్ లేకర్
పుట్టిన తేదీ(1922-02-09)1922 ఫిబ్రవరి 9
షిప్‌లే, యార్క్‌షైర్
మరణించిన తేదీ1986 ఏప్రిల్ 23(1986-04-23) (వయసు 64)
వింబుల్డన్, లండన్
బ్యాటింగుకుడిచేతివాటం
బౌలింగుకుడిచేతివాటం ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 328)1948 జనవరి 21 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1959 ఫిబ్రవరి 18 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1946–1959సర్రీ
1951/52ఆక్లాండ్
1962–1964ఎస్సెక్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఫస్ట్ క్లాస్
మ్యాచ్‌లు 46 450
చేసిన పరుగులు 676 7,304
బ్యాటింగు సగటు 14.08 16.60
100లు/50లు 0/2 2/18
అత్యధిక స్కోరు 63 113
వేసిన బంతులు 12,027 101,370
వికెట్లు 193 1,944
బౌలింగు సగటు 21.24 18.41
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 9 127
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 3 32
అత్యుత్తమ బౌలింగు 10/53 10/53
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 270/–
మూలం: ESPNcricinfo, 2018 ఏప్రిల్ 28

జేమ్స్ చార్లెస్ లేకర్ (1922 ఫిబ్రవరి 9 - 1986 ఏప్రిల్ 23) ఇంగ్లీష్ ప్రొఫెషనల్ క్రికెటర్. అతను 1946 నుండి 1959 వరకు సర్రీ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. 46 టెస్ట్ మ్యాచ్‌లలో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[1] అతను యార్క్‌షైర్‌లోని వెస్ట్ రైడింగ్‌లోని షిప్లీలో జన్మించాడు.[2] లండన్‌లోని వింబుల్డన్‌లో మరణించాడు.[3]

కుడిచేతివాటం ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన లేకర్‌ను క్రికెట్ చరిత్రలోని గొప్ప స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు.[4] 1956లో అతను మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లో ఉన్న 20 వికెట్లలో పందొమ్మిది వికెట్లు తీసి ఇప్పటికీ చెక్కుచెదరని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. లేకర్ అద్భుతమైన ప్రదర్శన వల్ల ఈ మ్యాచ్‌కి ఏకంగా "లేకర్స్ మ్యాచ్" అని పేరొచ్చింది.[5][6] క్లబ్ స్థాయిలో ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్నర్ అయిన టోనీ లాక్‌తో లేకర్ బలమైన స్పిన్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాడు.[7] 1952 నుండి 1958 వరకు వరుసగా ఏడు కౌంటీ ఛాంపియన్‌షిప్ టైటిల్‌లతో సహా 1950ల్లో సర్రీ జట్టు విజయాల్లో వారు కీలక పాత్ర పోషించారు.[8] లేకర్ బ్యాటింగ్ విషయానికి వస్తే, కుడిచేతివాటం బ్యాటర్ అయిన అతను రెండు ఫస్ట్-క్లాస్ సెంచరీలు చేసి ఒక ఉపయోగకరమైన టెయిల్-ఎండర్‌గా ఉండేవాడు. గల్లీ పొజిషన్‌లో అతను మంచి ఫీల్డర్‌గా పరిగణించబడ్డాడు.[9]

1951లో అతని ప్రతిభావంతమైన ప్రదర్శన వల్ల విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ (విజ్డెన్) 1952 ఎడిషన్‌లో ఐదుగురు విస్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌లో ఒకడిగా లేకర్‌ను ఎంపిక చేసింది.[10] అతను 1951-52 సీజన్‌లో ఆక్లాండ్ తరపున ఆడిన తర్వాత 1952లో న్యూజిలాండ్ క్రికెట్ అల్మానాక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.[11] 1956లో అతనికి సర్రీ బెనిఫిట్ సీజన్‌లో £11,086 (2021 లెక్కల్లో £ 294,369 ) పొందాడు. ఆ సంవత్సరాంతంలో అతన్ని "బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ "గా బీబీసీ సంస్థ ఎంపికచేసింది. ఇతను ఈ అవార్డును గెలుచుకున్న మొదటి క్రికెటర్‌గా నిలిచాడు.[12] తరువాత కాలంలో అతను బీబీసీ స్పోర్ట్ అవుట్‌సైడ్ బ్రాడ్‌కాస్ట్ ట్రాన్స్‌మిషన్స్‌లో క్రికెట్ వ్యాఖ్యాతగా పనిచేశాడు.[13]

మూలాలు

[మార్చు]
  1. Hill 1998, pp. 228–229.
  2. Hill 1998, p. 1.
  3. Hill 1998, pp. 210–212.
  4. Swanton, Plumptre & Woodcock 1986, p. 200.
  5. "Fourth Test Match – England v Australia 1956". Wisden Cricketers' Almanack. London: John Wisden & Co. 1957. Retrieved 14 January 2021.
  6. Cardus, Neville (1957). "Laker's wonderful year". Wisden Cricketers' Almanack. London: John Wisden & Co. Retrieved 10 January 2021.
  7. Webber 1957, p. 103.
  8. Hill 1998, p. 219.
  9. Hill 1998, pp. 216–217.
  10. "1952". Cricinfo. 2006-01-25. Retrieved 2023-11-19.
  11. Hill 1998, p. 78.
  12. "Jim Laker". ESPNcricinfo. London: ESPN Sports Media Ltd. Retrieved 9 February 2021.
  13. Hill 1998, pp. 182, 210.

గ్రంథ పట్టిక

[మార్చు]

జీవిత చరిత్ర

[మార్చు]

వార్షిక సమీక్షలు

[మార్చు]
  • Playfair Cricket Annual. London: Playfair Books Ltd. 1948–1965.
  • Wisden Cricketers' Almanack. London: John Wisden & Co. Ltd. 1947–1965.

ఇతరాలు

[మార్చు]