క్రికెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంతర్జాతీయ క్రీడ ఐన క్రికెట్ లో వాడేది కూకాబురా అనే చెక్క తో తయారు చేసిన బ్యాటు, బంతి తో అడతారు.ఈ ఆట రెండు జట్ల మధ్య లేదా రెండూ దేశాల మధ్య జరుగుతుంది . ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు. ఈ ఆట మొదటి సారిగా 14వ శతాబ్దంలో అవిర్భవించింది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు.మైదానం మధ్యలో 20 మీటర్లు పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్కతో తయారు చేయబదిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు. ఆట లోని ప్రతి దశను ఒక ఇన్నింగ్స్ అంటారు. ఒక్కో దశలో ఒక జట్టు బ్యాటింగ్ చేస్తూ వీలైనన్ని పరుగులు సాధిస్తారు, మరో జట్టు బౌలింగ్ చేస్తూ తక్కువ పరుగులు సమర్పించడానికి ప్రయత్నిస్తుంది. ఒక ఇన్నింగ్స్ తరువాత మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే విజేత అవుతుంది, లేని పక్షంలో మరో జట్టు విజేత అవుతుంది.

ఒక జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఒక ఆటగాడి ప్రాథమిక నైపుణ్యాన్ని బట్టి ఆటగాణ్ణి బ్యాట్స్ మన్ లేదా బౌలర్ గా వర్గీకరిస్తారు. సాధారణంగా ఒక సమతూకమైన జట్టు 5 లేదా 6 మంది బ్యాట్స్ మన్లు, 4 లేదా 5 మంది బౌలర్లు ఉంటారు. ప్రతి జట్టులో ఇంచుమించు తప్పనిసరిగా ప్రత్యేక వికెట్ కీపర్ ఉంటాడు. ప్రతి జట్టు ఒక సారథి ( కెప్టెన్ ) చేత నడిపించబడుతుంది. జట్టు తీసుకొనవలసిన తార్కిక నిర్ణయాలకు, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులకు, ఫీల్డింగ్ అమరికకు, బౌలింగ్ మార్పులకు సారథియే బాధ్యుడు. జట్టులో మొత్తం 11 మంది ఆడుతారు అయితే బ్యాట్టింగ్ మాత్రమే ఆడేవారు కొందరుంటారు, అలాగే బౌలింగ్ మాత్రమే చేసే వారు కొందరుంటారు, అలాగే రెండూ చేయగలిగేవారు కొందరుంటారు. జట్టు బ్యాట్టింగ్ చేసేటప్పుడు ముందుగా జట్టు వివరాలను నాయకుడు (కెప్టెన్) ప్రకటిస్తాడు ఆ ప్రకటించిన వివరాలలో ముందుగా బ్యాట్టింగ్ మాత్రమే ఆడే వారిని ప్రకటిస్తాడు వారినే టాప్ ఆర్డర్ బ్యాట్సమ్యాన్ అంటారు తరువాత వచ్చేవారిని మిడిలార్డర్ అని తరువాతి వారిని టెయిలెండర్లు (బౌలర్లు మాత్రమే ) అని అంటారు.

బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని ఆల్-రౌండర్ గా వ్యవహరిస్తారు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని వికెట్ కీపర్/బ్యాట్స్ మన్ గా వ్యవహరిస్తారు. కానీ నిజమైన ఆల్-రౌండర్లు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది ఆల్-రౌండర్లు బ్యాటింగ్ లేదా బౌలింగ్ పైన దృష్టి కేంద్రీకరిస్తారు.

అంపైర్లు[మార్చు]

మైదానంలో ఆట ఇద్దరు అంపైర్ల చేత నియంత్రించబడుతుంది. ఒకరు బౌలరు వైపు వికెట్ల వెనుక నిలుచొని ఉంటాడు. మరొక అంపైర్ స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్ మన్ ప్రక్కగా 15 నుండి 20 మీటర్ల దూరంలో ఉంటాడు.వీరితో పాటు, మైదానం వెలుపల మూడవ అంపైర్ దూర దర్శిని, వీడియోల సహాయంతో విధులు నిర్వర్తిస్తాడు.

స్కోరర్లు[మార్చు]

మైదానం వెలుపల, పరుగులు లెక్క పెట్టడానికి ఇద్దరు స్కోరర్లు ఉంటారు (ఒక్కో [1] జట్టు తరఫునంచి ఒకరు) . వీరు మైదానం లోని అంపైర్ల చేతి సంజ్ఞల ఆధారంగా పరుగులు లెక్క పెడతారు. ఉదాహరణకి, అంపైరు రెండు చేతులు ఆకాశంవైపు చూపితే ఆరు పరుగులు అని అర్థం.

రికార్డులు[మార్చు]

అంతర్జాతీయ వన్డే రికార్డులు[మార్చు]

టెస్ట్ రికార్డులు[మార్చు]

ట్వంటీ-20 రికార్డులు[మార్చు]

  • ట్వంటీ 20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టు--ఆస్ట్రేలియా (264-3 sri lanka పై)
  • ట్వంటీ 20 క్రికెట్ లో అతి తక్కువ పరుగులు చేసిన జట్టు--నెదర్లాండ్స్ (sri lanka py 40 all out)
  • ట్వంటీ 20 క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్—క్రిస్ గేల్ (117 పరుగులు)
  • ట్వంటీ 20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్—గ్రేమ్ స్మిత్ (364 పరుగులు)
  • ట్వంటీ 20 క్రికెట్ లో అతి వేగంగా 50 పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ -- యువరాజ్ సింగ్ (12 బంతులు)
  • ట్వంటీ 20 క్రికెట్ లో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ -- యువరాజ్ సింగ్ (36 పరుగులు)
  • ట్వంటీ 20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్—R.P.సింగ్ (13 వికెట్లు)

ఇతరాలు[మార్చు]

ఆడే విధానం[మార్చు]

పరుగులు చేయుట[మార్చు]

బ్యాట్స్ మెన్ (స్ట్రైకర్) బంతిని కొట్టిన తర్వాత నాన్-స్ట్రైకర్ ఉండే క్రీస్ వైపు పరుగు పెట్టాలి. అదే సమయంలో నాన్-స్ట్రైకర్, స్ట్రైకర్ ఉండే క్రీస్ వైపు పరుగు పెట్టాలి. ఇరువురు క్రీస్ లోకి చేరుకుంటే ఒక పరుగు లభిస్తుంది. ఒకవేళ వీరు క్రీస్ లోకి చేరేలోపు అవతలి జట్టు సభ్యులు బంతితో వికెట్లు పడగొడితే, ఆ బ్యాట్స్ మెన్ ఆట అంతటితో ముగుస్తుంది. ఈ రకంగా బ్యాట్స్ మెన్ తమ శక్తి సామర్థ్యాలను బట్టి ఒకటి నుండి మూడు పరుగుల చేయవచ్చు. బంతి నేలని ముద్దాడకుండా బౌండరీ దాటితే ఆరు పరుగులు వస్తాయి. బంతి నేలకి తగిలి బౌండరీ దాటితే నాలుగు పరుగులు వస్తాయి.

అవుట్ రకాలు[మార్చు]

క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ఔట్ అవడానికి 10 మార్గాలున్నాయి. అయితే ఇందులో కేవలం ఏడు మార్గాల ద్వారానే బ్యాట్స్ మెన్ ఎక్కువగా ఔట్ అవుతుంటారు.

అంపైర్ ఒక బ్యాట్స్ మెన్ ని ఔట్ గా ప్రకటించే ముందు ఆ ఫీల్డింగ్ జట్టు నుండి ఎవరైనా (సాధారణంగా బౌలర్) అప్పీల్ చేయవల్సి ఉంటుంది. ఒకవేళ అప్పీల్ కి అంపైర్ అంగీకరించినట్లైతే తన చూపుడు వేలు ఎత్తి చూపిస్తాడు. లేని పక్షంలో తలను అడ్డంగా ఊపి నాట్ ఔట్ అని ప్రకటిస్తాడు.

బౌల్డ్
బౌలర్ వేసిన బంతి బ్యాట్స్ మెన్ ని దాటుకొని వికెట్లను తకినట్లైతే బ్యాట్స్ మెన్ ని బౌల్డ్ ఔట్ గా పరిగణిస్తారు. అయితే బంతి వికెట్లు తాకిన తరువాత వికెట్ల పై ఉండే బెయిల్ చెదిరి కింద పడిపోవాలి. లేని పక్షంలో నాట్ ఔట్.
టైమ్ అవుట్
ఒక బ్యాట్స్ మెన్ ఔట్ అయిన తరువాత నిర్ణీత సమయంలో తరువాతి బ్యాట్స్ మెన్ కనుక మైదానములో అడుగుపెట్టనట్లైతే అతనిని అంపైర్ ఔట్ గా పరిగణిస్తాడు.
క్యాచ్
బ్యాట్స్ మెన్ బంతిని తన చేతిలో బ్యాట్ (లేదా చేయి) తో కొట్టిన తరువాత అది నేలను త్రాకే లోపు ఫీల్డింగ్ జట్టులో ఎవరైనా ఆ బంతిని ఒడిసి పట్టుకునట్లైతే క్యాచ్ ఔట్ అంటారు.

నో బాల్

బౌలర్ క్రీస్ దాటి వెస్తె అదే నో బాల్ ధినివల బ్యాట్స్ మన్ అవుట్ అయీన నాట్అవుట్ .

హ్యాండిల్ ద బాల్

హిట్ ద బాల్ ట్వైస్

ఎల్.బి.డబ్ల్యు
అన్ని ఔట్ లో కెల్లా ఇది క్లిష్టమైంది. బౌలరు బంతిని విసిరన తరువాత అది మూడు వికెట్ల బాటలో వెళ్ళేలోగా బ్యాట్స్ మెన్ తను కట్టుకున్న ప్యాడుకు బంతితగిలితే దానిని ఎల్ .బి. డబ్ల్యు అంటారు.
హిట్ వికెట్
ఒక బ్యాట్స్ మన్ బంతిని ఆడేటప్పుడు చేతిలోని బ్యాట్ లేదా బ్యాట్స్ మన్ వికెట్లను తాకితే దాన్ని హిట్ వికెట్ అంటారు.
ఫీల్డింగ్ ను అడ్డుకోవటం
రన్ అవుట్
ఒక బ్యాట్స్ మన్ పరుగు తీస్తున్నప్పుడు క్రీస్ ను చేరుకునే లోగా బంతి వికెట్ల పై ఉండే బెయిల్ ను పడగొడితే దాన్ని రన్ అవుట్ అంటారు.
స్టంప్ అవుట్

స్టంప్ ను వదిలినప్పుడు, బంతి బ్యాట్స్ మన్ ను దాటి (తగులకుండా) వికెట్ కీపర్ ను చేరితే, వికెట్ కీపర్ బంతితో స్టంప్స్ పైన్ ఉన్న ఒక లేదా రెండు బెయిల్స్ ను తొలగించ గలిగితే (బ్యాట్స్ మన్ తిరిగి తన క్రీస్ ను చేరుకునే లోగా) ఆ బ్యాట్స్ మన్ స్టంప్ అవుట్ గా వెనుదిరుగుతాడు.

చరిత్ర[మార్చు]

ఇంగ్లాండ్ దేశానికి చెందిన క్రీడ.

క్రీడాకారులు, అధికారులు[మార్చు]

https://www.google.co.in/search?q=hyderabad+cricket+stadium&source=lnms&tbm=isch&sa=X&ved=0ahUKEwjQlM3qvJ7UAhVEm5QKHarGABkQ_AUICygC#[permanent dead link]
HYDERABAD CRICKET

మహిళా క్రీడాకారులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Aryu, Aryan. {{cite book}}: Missing or empty |title= (help)

వెలుపలి లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=క్రికెట్&oldid=3657623" నుండి వెలికితీశారు