Jump to content

తిరుమలశెట్టి సుమన్

వికీపీడియా నుండి
తిరుమలశెట్టి సుమన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తిరుమలశెట్టి లక్ష్మీనారాయణ సుమన్
పుట్టిన తేదీ (1983-12-15) 1983 డిసెంబరు 15 (వయసు 40)
హైదరాబాదు, తెలంగాణ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాట్స్‌మెన్‌
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002–ప్రస్తుతంహైదరాబాదు
2009–2010డెక్కన్ ఛార్జర్స్‌
2011–2012ముంబై ఇండియన్స్
2013పూణే వారియర్స్
2016సన్ రైజర్స్ హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్టు-ఏ ట్వంటీ20
మ్యాచ్‌లు 38 47 75
చేసిన పరుగులు 1,668 1,159 1,546
బ్యాటింగు సగటు 28.27 25.19 24.53
100s/50s 3/7 3/4 1/5
అత్యధిక స్కోరు 160 136 100
వేసిన బంతులు 937 607 426
వికెట్లు 9 14 17
బౌలింగు సగటు 54.22 40.35 33.11
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/63 3/31 2/14
క్యాచ్‌లు/స్టంపింగులు 18/0 13/0 21/0
మూలం: Cricinfo, 2018 జూన్ 23

తిరుమలశెట్టి లక్ష్మీనారాయణ సుమన్, తెలంగాణకు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ క్రీడాకారుడు.[1] హైదరాబాద్ క్రికెట్ టీం తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.[2] రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన సుమన్ ఓపెనింగ్ లోగానీ, మిడిల్ ఆర్డర్‌లోగానీ బ్యాటింగ్ చేశాడు. సినీ నిర్మాత నీలిమ తిరుమలశెట్టికి బంధువు.

జననం

[మార్చు]

సుమన్ 1983 డిసెంబరు 15న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్

[మార్చు]

సుమన్ హైదరాబాద్ నుండి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. హైదరాబాదు టీం అండర్-16కి కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత, 2001లో రంజీ ప్రాబబుల్స్‌లోకి వచ్చాడు. 2001లో ఇంగ్లండ్ తో జరిగిన అండర్-19లలో మంచి స్కోర్‌ సాధించాడు. సుమన్ 2003-04 సీజన్‌లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.

2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపిఎల్ లో అతనికి మొదటి అవకాశం లభించింది.[3] 2009లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించిన సుమన్, 3వ సీజన్‌లో 307 పరుగులతో మెరుగ్గా రాణించి, ఛార్జర్స్‌ని సెమీ-ఫైనల్‌కు చేర్చాడు. 2011, 2012 సీజన్‌కు ముంబై ఇండియన్స్, 2013 సీజన్‌లో పూణే వారియర్స్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. 2014, 2015లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు.[4]

2014-15లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 40 సగటుతో 361 పరుగులతో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో సహా 143 స్ట్రైక్ రేట్‌ను సాధించాడు.[5]

మ్యాచ్‌లు

[మార్చు]

ఫస్ట్-క్లాస్

[మార్చు]

2003, నవంబరు 07 నుండి 10 వరకు అహ్మదాబాదులో గుజరాత్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[6] 2015 అక్టోబరు 22 నుండి 23 వరకు రాజ్ కోట్ పట్టణంలో సౌరాష్ట్ర క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[7]

38 మ్యాచ్‌లలో 63 ఇన్నింగ్స్ ఆడి 28.27 సగటుతో 1,668 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 7 అర్థ సెంచరీలు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 160.

లిస్టు-ఎ

[మార్చు]

2002-2003 మధ్యకాలంలో లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2015 డిసెంబరు 13న హైదరాబాదులో సర్వీస్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[8]

47 మ్యాచ్‌లలో 47 ఇన్నింగ్స్ ఆడి 25.19 సగటుతో 1,159 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 4 అర్థ సెంచరీలు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 136.

ట్వంటీ20

[మార్చు]

2007, ఏప్రిల్ 03న విశాఖపట్టణంలో గోవా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[9] 2015 ఏప్రిల్ 05న కటక్ లో ముంబై క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[10]

75 మ్యాచ్‌లలో 72 ఇన్నింగ్స్ ఆడి 24.53 సగటుతో 1,546 పరుగులు చేశాడు. 1 సెంచరీలు, 5 అర్థ సెంచరీలు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 100.

మూలాలు

[మార్చు]
  1. "Suman 93 powers Hyderabad win". ESPNcricinfo. 2015-03-26. Archived from the original on 2022-06-30. Retrieved 2022-12-13.
  2. "Waiting in the wings". The Hindu. Archived from the original on డిసెంబరు 27 2002. {{cite news}}: Check date values in: |archive-date= (help)CS1 maint: unfit URL (link)
  3. Devanathan, Varun (2018-04-06). "IPL: 8 Players who have won the IPL with more than one team". www.sportskeeda.com. Archived from the original on 2022-12-13. Retrieved 2022-12-13.
  4. "IPL's forgotten heroes: They came, they conquered and went into oblivion". The Economic Times. 2022-03-26. Archived from the original on 2022-07-11. Retrieved 2022-12-13.
  5. "Tirumalasetti Suman profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Archived from the original on 2022-08-20. Retrieved 2022-12-13.
  6. "Full Scorecard of Hyderabad vs Gujarat Elite Group 2003/04 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-04-13. Retrieved 2022-12-13.
  7. "Full Scorecard of Saurashtra vs Hyderabad Group C 2015/16 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-08-12. Retrieved 2022-12-13.
  8. "Full Scorecard of Hyderabad vs Services Group A 2015/16 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-07-28. Retrieved 2022-12-13.
  9. "Full Scorecard of Hyderabad vs Goa South Zone 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-10-04. Retrieved 2022-12-13.
  10. "Full Scorecard of Mumbai vs Hyderabad Super League, Group B 2014/15 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-07-02. Retrieved 2022-12-13.

బయటి లింకులు

[మార్చు]