డెక్కన్ చార్జర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
{{{name}}}
సారధి: శ్రీలంక కుమార సంగక్కర
కోచ్: ఆస్ట్రేలియా డారిల్ లీమన్
నగరం: హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
రంగు(లు): DC
స్థాపన: 2008
స్వంత మైదానం:
యజమాని: డెక్కన్ క్రానికల్
IPL జయాలు: 1 (2009)
CLT20 జయాలు: 0 (Qualified 2009)
అధికారిక అంతర్జాలం: http://www.deccanchargers.com/

డెక్కన్ చార్జర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో 2009 నుండి 2012 వరకు హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహించిన జట్టు. 2009 లో దక్షిణ ఆఫ్రికాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 పోటీలలో ఇది విజేతగా నిలిచింది. 2010 లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-3 పోటిలలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సెమీఫైనల్స్ లో ఓడిపోయి పోటీనుండి నిష్క్రమించింది. 2010 లో జరిగిన వేలంపాటలో ఈ జట్టుకు చెందిన అనేక మంది ఆటగాళ్ళను వేరే జట్లు కొనుగోలు చేశాయి.

2012లో దీని యజమానులు ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టారు. మునుపటి సీజన్లలో జట్టు లోని ఆటగాళ్లను పదేపదే నిషేధించడం వల్ల వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, వచ్చిన ఏకైక బిడ్‌ను వాళ్ళు తిరస్కరించారు. 2012 సెప్టెంబరు 14 న, కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, IPL పాలక మండలి ఫ్రాంచైజీని రద్దు చేసింది.[1] సన్ టీవీ నెట్‌వర్కు, హైదరాబాద్ ఫ్రాంచైజీ బిడ్‌ను గెలుచుకుంది. ఈ సంగతిని బిసిసిఐ, 2012 అక్టోబరు 25 న ధ్రువీకరించింది.[2] కొత్త జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అని పేరు పెట్టారు.[3]

2020 జూలైలో బాంబే హైకోర్టు నియమించిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్, బీసీసీఐ డెక్కన్ ఛార్జర్స్‌ ఫ్రాంచైజీని రద్దు చేయడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. డెక్కన్ చార్జర్స్ హోల్డింగ్ లిమిటెడ్‌కి బిసిసిఐ 2012 నుండి నష్టపరిహారంగా 10% వడ్డీతో సహా ₹4,814.67 కోట్లు చెల్లించాలని కోర్టు చెప్పింది.[4]

జట్టు వివరాలు (2010)

[మార్చు]
డెక్కన్ చార్జర్స్ జట్టు

బ్యాటింగ్ సభ్యులు

ఆల్ రౌండర్లు

వికెట్ కీపర్లు

బౌలింగ్ సభ్యులు

జట్టు సహాయ సభ్యులు
  • శిక్షకుడు: ఆస్ట్రేలియా డారిల్ లీమన్
  • ఉప శిక్షకుడు: India కన్వల్జిత్ సింగ్
  • ఫీల్డింగ్ శిక్షకుడు: యు.ఎస్.ఏ మైక్ యంగ్
  • వ్యాయామ శిక్షకుడు: ఆస్ట్రేలియా డాక్టర్.సీన్ స్లాటరీ
  • మానసిక శిక్షకుడు: ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్
క్రమ సంఖ్య. తేదీ ప్రత్యర్థి వేదిక ఫలితం
1 మార్చి 12 కోల్కతా నైట్ రైడర్స్ డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై 11 పరుగుల తేడాతో ఓటమి.
2 మార్చి 14 చెన్నై సూపర్ కింగ్స్ ఎమ్.ఎ.చిదంబరం స్టేడియం, చెన్నై 31 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - శ్రీలంక చమిందా వాస్ - 4/21
3 మార్చి 19 కింగ్స్ XI పంజాబ్ బారాబత్తి స్టేడియం, కటక్ 6 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఆస్ట్రేలియా ఆండ్రూ సైమండ్స్ - 53 పరుగులు
4 మార్చి 21 ఢిల్లీ డేర్ డెవిల్స్ బారాబత్తి స్టేడియం, కటక్ 10 పరుగుల తేడాతో గెలుపు -మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఆస్ట్రేలియా ఆండ్రూ సైమండ్స్ - 3 వికెట్లు
5 మార్చి 26 రాజస్తాన్ రాయల్స్ సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ 8 వికెట్ల తేడాతో ఓటమి
6 మార్చి 28 ముంబై ఇండియన్స్ డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై 41 పరుగుల తేడాతో ఓటమి.
7 ఏప్రిల్ 1 కోల్కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, కోల్కతా 24 పరుగుల తేడాతో ఓటమి.
8 ఏప్రిల్ 3 ముంబై ఇండియన్స్ బ్రబోర్న్ స్టేడియం, ముంబై 63 పరుగుల తేడాతో ఓటమి.
9 ఏప్రిల్ 5 రాజస్తాన్ రాయల్స్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగపూర్ 2 పరుగుల తేడాతో ఓటమి.
10 ఏప్రిల్ 8 రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ ఎమ్. చిన్నస్వామి స్టేడియం, బెంగలూరు 7 వికెట్ల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- India తిరుమలశెట్టి సుమన్ - 78 పరుగులు
11 ఏప్రిల్ 10 చెన్నై సూపర్ కింగ్స్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగపూర్ 6 వికెట్ల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఆస్ట్రేలియా ర్యాన్ హ్యారిస్ - 3/18
12 ఏప్రిల్ 12 రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగపూర్ 13 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- India హర్మీత్ సింగ్
13 ఏప్రిల్ 15 కింగ్స్ XI పంజాబ్ హెచ్.పి.సి.ఎ క్రికెట్ స్టేడియం, ధర్మశాల 5 వికెట్ల తేడాతో గెలుపు -మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- India రోహిత్ శర్మ - 68* పరుగులు ఔట్ కాకుండా
14 ఏప్రిల్ 18 ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫిరోజ్ షా కోట్ల స్టేడియం, ఢిల్లీ 11 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఆస్ట్రేలియా ఆండ్రూ సైమండ్స్ - 54 పరుగులు
15 ఏప్రిల్ 22[సెమీ ఫైనల్] చెన్నై సూపర్ కింగ్స్ డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై 38 పరుగుల తేడాతో ఓటమి.
16 ఏప్రిల్ 24 [మూడో స్థానం కోసం పోటీ] రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై 9 వికెట్ల తేడాతో ఓటమి
మొత్తం గెలిచినవి 8, ఓడినవి 8

బయటి లింకులు

[మార్చు]
  1. "India Cricket News: BCCI terminates Deccan Chargers franchise". ESPN Cricinfo. Archived from the original on 17 September 2012. Retrieved 22 May 2013.
  2. "Sun TV Network win Hyderabad IPL franchise". Wisden India. 25 October 2012. Archived from the original on 25 June 2017. Retrieved 25 October 2012.
  3. "Sun Risers to represent Hyderabad in IPL". Wisden India. 18 December 2012. Archived from the original on 25 June 2017. Retrieved 18 December 2012.
  4. "IPL: BCCI asked to pay Rs 4814.67 crore to Deccan Chargers for wrongful termination".