రోహిత్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోహిత్ శర్మ
Rohit Sharma.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు రోహిత్ గురునాధ్ శర్మ
జననం (1987-04-30) 1987 ఏప్రిల్ 30 (వయస్సు 34)
నాగపూర్, మహారాష్ట్ర, భారతదేశం
పాత్ర బ్యాటింగ్
బ్యాటింగ్ శైలి కుడి చేయి వాటం
బౌలింగ్ శైలి కుడి చేయు అఫ్ స్పిన్
అంతర్జాతీయ క్రికెట్ సమాచారం
తొలి వన్డే (cap 168) 23 June 2007: v Ireland
దేశవాళీ క్రికెట్ సమాచారం
Years Team
2006/07–present ముంబై క్రికెట్ టీమ్, ముంబై
2008–present mumbai indians
కెరీర్ గణాంకాలు
ODIsFCList AT20I
మ్యాచ్‌లు 227 35 84 111
పరుగులు 9205 2,462 2,112 2864
బ్యాటింగ్ సగటు 48.96 53.52 33.52 33.00
100s/50s 29/43 7/10 3/11 4/22
అత్యుత్తమ స్కోరు 264 309* 142* 118
వేసిన బంతులు {{{deliveries1}}} {{{deliveries2}}} {{{deliveries3}}} {{{deliveries4}}}
వికెట్లు {{{wickets1}}} {{{wickets2}}} {{{wickets3}}} {{{wickets4}}}
బౌలింగ్ సగటు {{{bowl avg1}}} {{{bowl avg2}}} {{{bowl avg3}}} {{{bowl avg4}}}
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు {{{fivefor1}}} {{{fivefor2}}} {{{fivefor3}}} {{{fivefor4}}}
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు {{{tenfor1}}} {{{tenfor2}}} {{{tenfor3}}} {{{tenfor4}}}
అత్యుత్తమ బౌలింగ్ {{{best bowling1}}} {{{best bowling2}}} {{{best bowling3}}} {{{best bowling4}}}
క్యాచ్ లు/స్టంపింగులు {{{catches/stumpings1}}} {{{catches/stumpings2}}} {{{catches/stumpings3}}} {{{catches/stumpings4}}}

As of [[{{{date}}}]], [[{{{year}}}]]
Source: [{{{source}}}]

రోహిత్ శర్మ ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు. ఇతను భారత T20, వన్డే జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

బాల్యము[మార్చు]

రోహిత శర్మ బంసొద్, నాగ్పూర్, మహారాష్ట్రలో ఏప్రిల్ 1987 30 న జన్మించాడు. అమ్మ పూర్ణిమా శర్మది విశాఖపట్టణం [1]. అతని తండ్రి గురునాథ్ శర్మ ఒక రవాణా సంస్థ స్టోర్ హౌస్ లో కేర్ టేకర్ గా పనిచేసేవాడు. రోహిత్ శర్మ తండ్రి ఆదాయం తక్కువ కావడం వల్ల బోరివలిలో తన తాత, పినతండ్రులు పెంచారు.[1]. అతను డోమ్బివిలిలో ఒకే గది ఇంట్లో నివసించే అతని తల్లిదండ్రులని వారాంతాలలో మాత్రమే సందర్శించేవాడు. రోహిత్ శర్మ తమ్ముడి పేరు విశాల్ శర్మ.[2]

అతని మేనమామ డబ్బుతో 1999 లో ఒక క్రికెట్ క్యాంపులో చేరాడు. శిబిరం వద్ద అతని శిక్షకుడు కోచ్ లాడ్ మంచి క్రికెట్ సౌకర్యాలు కలిగి ఉన్న స్వామి వివేకానంద్ ఇంటర్నేషనల్ స్కూల్, తన పాఠశాల మార్చడానికి కోరాడు. అతను ఆ స్కూల్ లో చదవడానికి డబ్బులు లేవని చెప్పాడు. అప్పుడు కోచ్ లాడ్ ఒక ఉపకారవేతనం ఇచ్చాడు కాబట్టి నాలుగు సంవత్సరాలు తను ఉచితంగా చదివాడు, తను క్రికెట్లో బాగా మెరుగయ్యాడు.[3] రోహిత్ శర్మ ఒక ఆఫ్ స్పిన్నరుగా కెరీర్ ఆరంభించాడు. లాడ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సామర్ధ్యాలు గమనించి ఇన్నింగ్స్ను ప్రారంభించమని సంఖ్య ఎనిమిది నుండి అతన్ని ఓపెనరుగా పంపాడు. అతను ఓపెనరుగా అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. హారిస్, గిల్స్ షీల్డ్ పాఠశాల క్రికెట్ టోర్నమెంట్లను రాణించారు.[4]

విద్యాభ్యాసము[మార్చు]

ఫీల్డింగ్ సాధన చేస్తున్న రోహిత్ శర్మ.
నెట్స్ లో బౌలింగ్ సాధన చేస్తున్న రోహిత్ శర్మ.

ప్రాథమిక విద్యాభ్యాసం ముంబై లోని అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా పాఠశాలలో పూర్తిచేసాడు. తరువాత ఉపకార వేతనం మీద స్వామి వివేకానంద అంతర్జాతీయ పాఠశాలలో చేరాడు, అక్కడ క్రికెట్లో రోహిత్ లోని ప్రతిభని స్థానిక వ్యాయామ ఉపాధ్యాయుడు గుర్తించి సానబెట్టాడు.

క్రీడాజీవితం[మార్చు]

దేశీయం[మార్చు]

రోహిత్ శర్మ గ్వాలియర్ వద్ద మార్చి 2005 లో దేవధర్ ట్రోఫీ సెంట్రల్ జోన్ కు వ్యతిరేకంగా వెస్ట్ జోన్ తరుపున లిస్ట్ A రంగప్రవేశం చేసాడు [2] . అదే టోర్నమెంట్లో ఉదయపూర్ వద్ద ఉత్తర జోన్ కు వ్యతిరేకంగా 123 లో 142 బంతుల్లో తన అజేయంగా ఇన్నింగ్స్ అతన్ని వెలుగులోకి తెచ్చింది [3] . అబూ ధాబీ, ఆస్ట్రేలియాలో భారతదేశం లిస్ట్ A మ్యాచుల ప్రదర్శన, ఛాంపియన్స్ ట్రోఫీకి 30 మంది సభ్యుల ప్రాబబుల్స్ను జాబితాలో చోటు దకెళ్ళ చేసింది [4] . కాని అతను ఫైనల్ జట్టులో లేదు. ఇది అంత తన రంజీ ట్రోఫీలో రంగప్రవేశం చేసే ముందు జరిగింది. [5] అతన్నిNKP సాల్వే చాలెంజర్ ట్రోఫీ కోసం ఎంపిక చేశారు.

రోహిత్ శర్మ తన ఫస్ట్-క్లాస్ ఆరంగేట్రం న్యూజిల్యాండ్ A వ్యతిరేకంగా భారతదేశం తరుపున, డార్విన్ జూలై 2006 [6]లో ఆడాడు. అతను 2006/2007 సీజన్లో అతని ఫస్ట్-క్లాస్ సారథ్యంలో ముంబై తన రంజీ ట్రోఫీ గెలిచింది. అతను ప్రారంభ మ్యాచ్ల్లో సరిగ్గ ఆడలేదు [7]. కాని 205 గుజరాత్ జరిగిన మ్యాచ్ లో 267 బంతుల్లోనే చేసాడు. [8] రోహిత్ శర్మ బెంగాల్ తొ జరిగిన ఫైనల్ లో అర్ధ సెంచరీ చేశాడు, ముంబై టోర్నమెంట్ను గెలుచుకుంది. [9][permanent dead link]

అక్టోబరు 2013 లో, అజిత్ అగార్కర్ విరమణ, అతను IPL, ఛాంపియన్స్ లీగ్ టి 20 గెలిచాడు. బీసీసీఐ 2013-14 సీజన్ కోసం ముంబై రంజీ జట్ కెప్టెన్గా నియమించింది[citation needed]

అంతర్జాతీయ[మార్చు]

రోహిత్ శర్మ 2007 లో ఐర్లాండ్ భారతదేశం యొక్క పర్యటన పరిమిత ఓవర్ల మ్యాచ్లకి ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ చేయనప్పటికీ, అతను బెల్ఫాస్ట్ వద్ద ఐర్లాండ్ వ్యతిరేకంగా తన తొలి వన్ డే ఇంటర్నేషనల్ అడాడు. [10].

రోహిత్ శర్మ చివరికి తన మార్క్ అంతర్జాతీయ వేదికపై 2007 సెప్టెంబరు 20 దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 50 పరుగులు చేసి భారతదేశం విజయానికి దొహదపడింది. [11] ఒక దశలో భారతదేశం వద్ద 61-4 ఉన్నారు, కానీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో 85 పరుగులు భాగస్వాయంతొ మొత్తం 153/5 పరుగులు చెయ్యగలిగింది. ఈ విజయం భారతదేశం రిజర్వు టోర్నమెంట్లో సెమీఫైనల్కు నడిపించారు. అతను చివరికి మాన్ అఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు. [12] రోహిత్ శర్మ ఆపై పాకిస్థాన్తో ఫైనల్ లో 16 బంతులలో 30 పరుగులు చేసాడు [13].

రోహిత్ శర్మ తన తొలి వన్డే అర్ధ సెంచరీ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా జైపూర్లో 2007 నవంబరు 18 చేశాడు [14]. ఆస్ట్రేలియా సిబి సిరీస్ కోసం భారతదేశం యొక్క 16-మంది బృందంలో భాగంగా ఎంపికయ్యాడు [15]. ఇక్కడ, 33.57 సగటున 2 యాభైలలో 235 పరుగులు చేశాడు [16]. అందులో సిడ్నీ వద్ద 1st ఫైనల్లో 66 పరుగులుతో సచిన్ టెండూల్కర్ భాగస్వామ్యంతో భారతదేశం యొక్క చాలా విజయవంతమైన రన్ చేజ్ చేసారు [17].

అయితే, అతని ODI లో మంచి ప్రదర్శనలు చెయ్యకపొవడం వల్ల అతని మిడిలార్డర్ స్థానం సురేష్ రైనా, విరాట్ కొహ్లి ఆక్రమించారు. చివరికి విరాట్ కొహ్లి రిజర్వ్ బ్యాట్సమెన్ గా స్థిర పడిపోయాడు. [18].

డిసెంబరు 2009 లో, అతను రంజీ ట్రోఫీ ట్రిపుల్ సెంచరీ చేశాడు[19]. ముక్కోణపు వన్ డే టోర్నీ బంగ్లాదేశ్ లో జరిగింది. ఆ టోర్నీలో సచిన్ విశ్రాంతికి మొగ్గుచూపడంతో రోహిత్ శర్మ వన్డే జట్టులోకి వచ్చాడు [20] అయితే, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా సరిగ్గా ఆడుతున్నరు కాబట్టి అతనికి అవకాశం రాలేదు, అతను భారతదేశం యొక్క ఐదు మ్యాచ్ లో ఏ ఒక్క మ్యాచు ఆడలేదు.

ఫిబ్రవరి 2010 లో భారత టెస్ట్ జట్టు లోని వి వి ఎస్ లక్ష్మణ్ గాయం కావడంతో రిజర్వ్ బ్యాట్సమెన్ గా రోహిత్ శర్మ జట్టు లోకి వచ్చాడు[citation needed]. రోహిత్ శర్మ తొలి చేయడానికి సెట్, కానీ తాను మ్యాచ్లో తొలి ఉదయం సన్నాహక ఫుట్ బాల్ ఆడుతూ గాయపడ్డాడు. కాబట్టి రిజర్వ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా ఎంపికయ్యడు. అప్పటి నుండి సురేష్ రైనా, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ అతన్ని దాటేసి మిడిలార్డర్లో వారి టెస్ట్ ఆరంభాలు చేసారు.

ఆయన మే 2010 28 న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో తొలి వన్డే సెంచరీ చేశాడు.తదుపరి మ్యాచ్లొ అతను 2010 మే 30 న శ్రీలంక వ్యతిరేకంగా ముక్కోణపు సిరీస్లో మళ్ళీ సెంచరీ చేసాడు.[21] [22].

అతను 2011 వరల్డ్ కప్కు భారత జట్టుకు ఎంపిక అవ్వలేదు. [23]

అతను 2011 IPL తర్వాత జట్టులో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, కెప్టెన్ ధోనీ వంటి సీనియర్ బ్యాట్స్మెన్ విశ్రాంతి తీసుకొవడంతో 2011 వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ గాయాల వల్ల నిష్రమించారు.[24]. సురేష్ రైనా కెప్టెన్గా, హర్బజన్ సింగ్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు . అతను క్వీన్స్ పార్క్ ఓవల్ వద్ద T20I రెండు సిక్సర్లతో 23 బంతుల్లో 26 పరుగులు చేసాడు. సుబ్రమణ్యం బద్రీనాథ్తో 71-పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొలిపి భారత విజయానికి దోహదపడ్డాడు[citation needed].

తరువాత ఆ వన్డే సిరీస్లో అతను తన ఫామ్ను కొనసాగించారు. తొలి వన్డే కూడా క్వీన్స్ పార్క్ ఓవల్లో జరిగింది. రోహిత్ మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 68 పరుగులతొ అజేయంగా నిలిచిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికయ్యారు [25] సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, ఆంటిగ్వా మూడో వన్డే జరిగింది. ఆ మ్యాచ్ లో శర్మ 91 బంతుల్లో 86 పరుగులు చేశాడు. హర్భజన్ సింగ్తో కలిసి రోహిత్ మ్యాచ్ ను గెలిపించాడు[26]. అతను విస్తృతంగా తన ప్రశాంతతతొ ప్రశంసలు అందుకున్నాడు. రోహిత్ శర్మ వన్డే సిరీస్ అంతటా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి తన మొదటి మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. [27] అతను మళ్ళీ భారత గడ్డపై వెస్టిండీస్తో సిరీస్లో మరొక మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు [28]. అతను జట్టులోకి ఆస్ట్రేలియన్ సిరీస్ ఆడేందుకు ఎంపికయ్యడు.

2013 లో, అతను ఛాంపియన్స్ ట్రోఫీకి శిఖర్ ధావన్ పాటు ఓపెనింగ్ బ్యాట్స్మన్ గ ప్రయోగం చేశాడు.

ఈ ఓపెనింగ్ పైర్ భారతదేశం వెస్ట్ ఇండీస్ చాంపియన్స్ ట్రోఫి, ముక్కోణపు దేశం సిరీస్ సాధించిపెట్టింది. స్వదేశంలో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా జరిగిన సిరీస్లో తన ఫామ్నుకొనసాగించాడు. అతను జైపూర్ 141 పరుగులతో అజేయంగా, బెంగుళూర్లో 209 పరుగులు 158 బంతులలో చేశాడు. 16 సిక్సర్లతో ఆయన ఒక ODI ఇన్నింగ్స్ లో అత్యంత సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

నవంబరు 2013 లో, సచిన్ టెండూల్కర్ యొక్క వీడుకోలు టెస్ట్ సిరీస్ సందర్భంగా శర్మ తన తొలి టెస్ట్ ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో కోలకత్తాలో అడాడు. అతను శిఖర్ ధావన్ తరువాత భారతీయుడు అరంగ్రేటంలో సాధించిన రెండవ ఉత్తమ స్కోరు ఇది. శర్మ 177 పరుగులు చేశాడు దానిని అనుసరించి ముంబై వాంఖడే స్టేడియం వద్ద తన సొంత మైదానంలో 111 పరుగులతొ నాటౌట్ గా నిలిచాడు. . శర్మ తన మొదటి రెండు టెస్టులోను సెంచరీలు చేసి భారత కలిగిన కొన్ని క్రీడాకారులులో ఒకటిగా మారాడు. ఈ ఘనతను ముందు ఇంగ్లాండ్ లో 1996 లో సౌరవ్ గంగూలీ, 1984 లో మొహమ్మద్ అజారుద్దీన్ తన తొలి మూడు టెస్టుల్లో సెంచరీలు నమోదు చేసారు.

2014 లో, అతను వన్డే అంతర్జాతీయ క్రికెట్లో 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి వ్యక్తి అయ్యాడు. అతను ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకకు వ్యతిరేకంగా 264 చేశాడు. ఈ ఇన్నింగ్స్ తొ అతను వన్డేల్లో రెండు డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు అయ్యాడు. 219 పరుగులు వీరేంద్ర సెహ్వాగ్ స్కోరును 264 పరుగులతొ అధిగమించాడు. ODI లో ఇదే అత్యధిక స్కోరు. 2017 లో శ్రీలంక తో జరిగిన రెండో వన్డేలో 3 వసారి ద్విశతకం సాధించి చరిత్రలో రికార్డ్ నెలకొల్పాడు. హ్హ్హెహ్హెహ్హ

2015 అక్టోబరు 2 న, భారతదేశం పర్యటనలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో శర్మ ధర్మశాల లోని హెచ్పిసిఎ స్టేడియంలో తన మొదటి T20 శతకం చేశాడు. ఈ శతకంతో అతను ఆట యొక్క అన్ని ఫార్మాట్లలో సెంచరీలు కలిగి రెండో భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. 11 అక్టోబరు న, క మొదటి ODI లో, అతను 150 పరుగులు 133 బంతులలో సాధించాడు. తరువాత ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో తిరిగి 2 శతకలు బాదాడు. చివరి మ్యాచ్ లో 99 పరుగులు కుడా చేసాడు.

2017లో గాయం కారణంగా కొద్దిరోజులు ఆటకి దూరంగా ఉండి తిరిగి ఛాంపియన్ ట్రోఫీ లో పరుగుల వరదపారించాడు.శ్రీలంకతో జరిగిన నిదాస్ ట్రోఫీలో ఇండియానీ కెప్టెన్ గా విజేత గా నిలిపాడు. శ్రీలంకతో జరిగిన ఒక టీ20 మ్యాచ్ లో 35 బంతుల్లో శతకము బాధి T20 లో వేగవంతం గా శతకము బదిన ఆటగాడిగా నిలిచాడు.

2019 వరల్డ్ కప్ నందు రోహిత్ అద్భుతమైన ప్రదర్శన చేసి 5శతకలు బాది 547 పరుగులు చేసి ఆద్యాధికా పరుగులు చేసాడు.ఒకే వరల్డ్ కప్ లో ఎక్కువ శతకలుచేసినా ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పినాడు

రోహిత్ 2019 వరకు టెస్ట్ టీంలో కూడా 6 వ స్థానము లో ఆడేవాడు.అతను 6వ స్థానము లో సరిగా ఆడలేక టీం లో చోటు కోల్పోయాడు. 2019 దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్లో ఓపెనర్ గా దిగి రెండు ఇన్నింగ్స్లో కూడా 100 పరుగులు చేసి టెస్ట్ టీం లో కూడా ముఖ్యమైన ఆటగాడిగా ఎదిగాడు .

2019-2021 టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఇండియా నీ ఫైనల్ వరకు తీసుకెళ్లడం లో రోహిత్ పాత్ర ముఖ్యమైనది .

ఇండియన్ ప్రీమియర్ లీగ్[మార్చు]

2009 సీజన్ ఐ.పి.ఎల్.లో వైస్ కెప్టెన్ గా ఎన్నుకోబడ్డాడు.అంతేకాకుండా ఆడం గిల్ క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ చార్జర్స్ 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పొషించాడు.2011లో రోహిత్శర్మ నీ ముంబై తీసుకోవడం తో రోహిత్ దశ తిరిగిపోయింది.సచిన్ తరువత ముంబై కెప్టెన్ గా ఐపీల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్. రోహిత్ సారధ్యంలో ముంబై ఇండియన్స్ టీం అత్యధికంగా ఐదుసార్లు (2013, 2015, 2017, 2019,2020) ఐపీల్ ట్రోపిని గెలుచుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లొ రోహిత్ శర్మ[మార్చు]

IPL Batting Statistics of Rohit Sharma
Year Team Inns Runs HS Ave SR 100 50 4s 6s
2008 దెక్కన్ చార్గెర్స్[5][6][7] 12 404 76* 36.72 147.98 0 4 38 19
2009 16 362 52 27.84 114. 0 1 22 18
2010 16 404 73 28.85 133.77 0 3 36 14
2011 ముంబై ఇండియంస్[8][9] 14 372 87 33.81 125.25 0 3 32 13
2012 16 433 109* 30.92 126.60 1 3 39 18
2013 19 538 79* 38.42 131.54 0 4 35 28
2014 15 390 59* 30 129.13 0 3 31 16
2015 16 482 98* 34.45 144.44 0 3 41 21
2008–2015 Total[10] 128 3385 109* 32.55 131.29 1 24 274 147

బయటి లింకులు[మార్చు]

  1. క్రిక్ ఇన్ఫో లో కథనం
  2. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం
  3. క్రిక్ ఇన్ఫో కథనం
  4. abplive.in story
  5. "Indian Premier League, 2007/08 / Records / Most runs". Retrieved 20 May 2012.
  6. "Indian Premier League, 2009/10 / Records / Most runs". Retrieved 20 May 2012.
  7. "Indian Premier League, 2009 / Records / Most runs". Retrieved 20 May 2012.
  8. "Indian Premier League, 2011 / Records / Most runs". Retrieved 20 May 2012.
  9. "Indian Premier League, 2012 / Records / Most runs". Retrieved 31 May 2012.
  10. "Indian Premier League / Records / Most runs". Retrieved 13 November 2015.