సురేష్ రైనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేష్ రైనా బ్యాటింగ్
సురేష్ రైనా ఫీల్డింగ్

1986, నవంబర్ 27న ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాదులో జన్మించిన సురేష్ రైనా (Suresh Raina) భారత్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 2005 జూలై నుంచి భారత వన్డే జట్టులో ఉంటున్నప్పటికీ ఇప్పటి వరకు 36 వన్డేలలో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. 2006 ప్రారంభం నుంచి టెస్ట్ క్రికెట్‌కు అందుబాటులో ఉన్ననూ ఇంకనూ టెస్ట్ మ్యాచ్ ఆరంగేట్రం చేయలేడు. దేశవాళీ క్రికెట్ పోటీలలో రంజీ ట్రోఫిలో ఉత్తర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దులీప్ ట్రోఫి పోటీలలో సెంట్రల్ జోన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఎడమచేతితో చేసే రైనా బౌలింగ్‌లో మంచి ఆఫ్ స్పిన్నర్.

బాల్యం

[మార్చు]

రైనాది కశ్మీరీ పండిట్ల కుటుంబం. వారి కుటుంబం కశ్మీర్ లోని రైనావారీ నుంచి 1980 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు వలస వెళ్ళింది. నాన్న త్రిలోక్ చంద్ ఆర్మీలో అధికారిగా పనిచేశాడు. అమ్మ పర్వేష్ గృహిణి. వారికి అయిదుగురు సంతానం. అందులో రైనా అందరికంటే చిన్నవాడు. ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క అందరూ చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పదేళ్ళ వయసులో తనకు క్రికెట్ అంటే ఇష్టమని ఇంట్లోవాళ్ళకి చెబితే వాళ్ళు లక్నోలోని ప్రభుత్వ క్రీడాపాఠశాలలో చేర్పించారు. ఆరో తరగతి నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టేంత వరకు దాదాపు తొమ్మిదేళ్ళు అక్కడే ఉన్నాడు.[1]

ప్రారంభ క్రీడా జీవితం

[మార్చు]

13 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ ఆటపై దృష్టి పెట్టినాడు. చిన్న వయస్సులోనే అండర్-16 ఉత్తర ప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పదిహేనున్నర సంవత్సరాల ప్రాయంలో అండర్-19 జట్టుకు ఎంపైకై ఇంగ్లాండు పర్యటించి రెండు అర్థసెంచరీలు సాధించాడు.[2] ఆ తదుపరి సంవత్సరం అండర్-17 టీం తరఫున శ్రీలంక పర్యటించాడు. 2003లో 16 సంవత్సరాల వయస్సులోనే ఉత్తర ప్రదేశ్ తరఫున తొలిసారిగా రంజీ ట్రోఫి అస్సాంపై ఆడినాడు. ఆ తదనంతరం అండర్-19 ఆసియా కప్‌లో పాల్గొనడానికి పాకిస్తాన్ పర్యటించాడు. 2004లో అండర్-19 ప్రపంచ కప్ పోటీలలో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆ ప్రపంచ కప్ పోటీలలో కేవలం 38 బంతుల్లో 90 పరుగులు సాధించడమే కాకుండా మొత్తం 3 అర్థసెంచరీలు సాధించాడు. 2005 ప్రారంభంలో ఛాలెంజర్ సీరీస్‌కు ఎంపైకైనాడు.[3] సచిన్ టెండుల్కర్ గాయపడటంతో 2005 లో శ్రీలంకలో జరిగిన ఇండియన్ ఆయిల్ కప్ లో పాల్గొన్నాడు.[4]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

రైనా అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం నిరాశజనకంగా ప్రారంభమైంది. ముత్తయ్య మురళీధరన్ చేతిలో గోల్డెన్ డకౌట్ అయి [5] టోర్నమెంటు మొత్తం కలిపి 12.33 సగటుతో కేవలం 37 పరుగులు మాత్రమే సాధించాడు. సౌరవ్ గంగూలీ మళ్ళీ జట్టులోకి రావడంతో ఇతనికి అవకాశం రాలేదు. అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ గంగూలీని తప్పించడంతో, మహ్మద్ కైఫ్కు గాయం కావడంతో భారత్ పర్యటించిన శ్రీలంకతో 5 వన్డేల సీరీస్‌లో స్థానం సంపాదించాడు. తుది జట్టులో ఒక సారి స్థానం పొంది భారత్ గెలిచిన నాలుగవ వన్డేలో 39 (నాటౌట్) పరుగులు సాధించాడు. ఆ తరువాత గంగూలీ మళ్ళీ జట్టులో చేరడం గౌతం గంభీర్ ఓపెనర్‌గా స్థానం పొందడంతో ఇతనికి అవకాశం లభించలేదు. ఇంగ్లాండుతో జరిగిన టెస్ట్ సీరీస్‌కు ఎంపైకైననూ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. ఫరీదాబాదులో జరిగిన వన్డేలో 81 (నాటౌట్) పరుగులు చేసి తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు. ఆ తర్వాత మరో రెండు అర్థసెంచరీలు సాధించడంతో బిసిసిఐ సి-గ్రేడు (కాంట్రాక్టు) ప్రధానం చేసింది.రైనా ఉపయుక్తం అయిన స్పిన్నర్ కూడా.ఎన్నో మ్యాచ్లో దేశాన్ని తన బౌలింగ్ తో గెలిపించాడు.మూడు ఫార్మాట్ లలో శతకలు సాధించిన అతికొద్దివాళ్ళలో రైనా ఒకడు .

వన్డే గణాంకాలు

[మార్చు]

సురేష్ రైనా 226 వన్డేలు ఆడి 35.31 సగటుతో 5615పరుగులు సాధించాడు. అందులో 36అర్థసెంచరీలు 5 శతకలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు116 .

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]