సౌరవ్ గంగూలీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సౌరవ్ గంగూలీ
Gangooly (2790859586).jpg
Flag of India.svg India
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు సౌరవ్ చండీదాస్ గంగూలీ
మారుపేరు దాదా, కొలకత్తా యువరాజు, బెంగాల్ టైగర్, మహారాజా
జననం (1972-07-08) 8 జూలై 1972 (వయస్సు: 44  సంవత్సరాలు)
కొలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
ఎత్తు 5 ft 11 in (1.80 m)
పాత్ర బాట్స్‌మన్
బ్యాటింగ్ శైలి లెఫ్ట్-హాండెడ్
బౌలింగ్ శైలి కుడిచేయి (ఫాస్ట్ బౌలింగ్, మీడియం)
International information
తొలి టెస్టు (cap 207) 2 జూన్ 1996: v ఇంగ్లాండ్
చివరి టెస్టు 6 నవంబర్ 2008: v ఆస్ట్రేలియా
తొలి వన్డే (cap 84) 11 జనవరి 1992: v వెస్టిండీస్
చివరి వన్డే 15 నవంబర్ 2007:  v పాకిస్తాన్
Domestic team information
Years Team
1989/90–2006/07 బెంగాల్
2000 లాంకషైర్
2005 గ్లామొర్గాన్
2006 నార్తాంప్‌షైర్‌
2008–ప్రస్తుతం కొలకత్తా నైట్ రైడర్స్
కెరీర్ గణాంకాలు
టెస్ట్ క్రికెట్ వన్ డే క్రికెట్ FC List A
మ్యాచ్‌లు 113 311 241 423
పరుగులు 7,212 11,363 14,864 15,161
బ్యాటింగ్ సగటు 42.17 41.02 43.84 41.53
100s/50s 16/35 22/72 31/84 31/93
అత్యుత్తమ స్కోరు 239 183 239 183
వేసిన బంతులు 3,117 4,561 10,920 7,949
వికెట్లు 32 100 164 168
బౌలింగ్ సగటు 52.53 38.49 36.66 38.41
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 2 4 2
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 3/28 5/16 6/46 5/16
క్యాచ్ లు/స్టంపింగులు 71/– 100/– 166/– 129/–

As of 15 నవంబర్, 2008
Source: CricketArchive

1972 జూలై 8 న జన్మించిన సౌరవ్ గంగూలీ (Sourav Chandidas Ganguly) (Bengali: সৌরভ গাঙ্গুলী) ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు. కోల్‌కతకు చెందిన ఈ క్రీడాకారుడు టెస్ట్ కెప్టెన్ గా భారత్ కు పలు విజయాలు అందించాడు. ఎడమచేతితో బ్యాటింగ్ మరియు కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేయగల గంగూలీకి బెంగాల్ టైగర్, కోల్‌కత యువరాజు, దాదా అనే ముద్దుపేర్లు ఉన్నాయి. 2002 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించి అత్యధిక టెస్ట్ విజయాలు (21) సాధించిపెట్టిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. 2003 ప్రపంచ కప్ క్రికెట్ లో ఫైనల్ చేరిన భారత జట్టుకు నాయకుడు కూడా అతనే. 2006 ప్రారంభంలో భారత జట్టునుంచి దూరమైననూ మళ్ళీ డిసెంబరులో జట్టులోకి ప్రవేశించి 2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో తన ప్రతిభను నిరూపించాడు. 2008 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీసుతో అంతర్జాతీయ గతి నుండి రిటైర్ అయ్యారు.

బాల్యం[మార్చు]

చండీదాస్, నిరూపా గంగూలీ దంపతులకు కనిష్ఠ పుత్రుడిగా 8జులై,1972 న కోల్ కతాలో గంగూలీ జన్మించాడు. అతని తండ్రి ముద్రణా వ్యాపాం చేసేవారు. అప్పట్లో కోల్ కతాలో అత్యంత ధనవంతుల్లో అతని తండ్రి ఒకరు. గంగూలీ బాల్యం విలాసవంతంగా గడిచింది. అప్పుడే అతనికి మహారాజా అని ముద్దు పేరు వచ్చింది. గంగూలీ క్రికెట్ ఆడటం అతని తల్లిదండ్రులకు ఇష్టం లేనప్పటికి అతని అన్నయ్య స్నేహశీష్ గంగూలీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆట కొనసాగించాడు. స్నేహశీష్ అప్పటికే మంచి పేరున్న ఎడమచేతి వాటం బెంగాల్ ఆటగాడు. నిజానికి గంగూలీ కుడిచేతి వాటం వాడు అయినప్పటికీ తన అన్న పరికరాలు ఉపయొగించుకోవడం కోసం ఎడమ చేతి వాటంతో సాధన మొదలు పెట్టాడు. బ్యాట్స్ మెన్ గా గంగూలీ అద్భుత ప్రతిభ కనపర్చటంతో అతనిని క్రికెట్ అకాడమీలో చేర్చారు. సౌరవ్ మరియు అతని అన్న కోసం వారి తండ్రి ఇంట్లోనే ఒక వ్యాయమశాల ఏర్పాటు చేయించారు. తొలినాళ్ళలో గంగూలీ ఎక్కువగా ఇంగ్లాడుకు చెందిన ఎడమ చేతి వాటం ఆటగాడు డేవిడ్ గోయర్ ఆటను తిలకించే వాడు. అండర్-15 జట్టు తరుపున ఒడిషా జట్టు మీద గంగూలీ సెంచురీ సాధించటంతో అతనిని సెయింట్ జేవియర్స్ పాఠశాల జట్టుకు నాయకుడిగా నియమించారు. అయితే అతని దుందుడుకు ప్రవర్తనతో విసిగిన అనేకమంది జట్టు సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది.

అంతర్జాతీయ జీవితం[మార్చు]

An innings-by-innings breakdown of Ganguly's Test match batting career, showing runs scored (red bars) and the average of the last ten innings (blue line).

అరంగేట్రం[మార్చు]

1990-91 రంజీ సీజన్ లో అనేక పరుగులు సాధించటంతో వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కు గంగూలీ ఎంపిక అయ్యాడు. ఆడిన మొదటి ఆటలో కేవలం మూడు పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ఆట పట్ల అతని తీరు మీద వచ్చిన విమర్శలతో జట్టులో స్ఠానం పోగొట్టుకున్నాడు. గంగూలీ తిరిగి దేశవాళీ క్రికెట్ 1993-94 మరియు 1994-95 సీజన్ లో అనేక పరుగులు సాధించాడు.1995-96 దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్ లో 171 పరుగుకు సాధించటంతో తిరిగి జాతీయ జట్టుకు పిలుపు వచ్చింది. ఒకే వన్డే ఆడినప్పటికీ మొదటి టెస్టులో గంగూలీకి స్థానం లభించలేదు. అయితే అదే సమయంలో కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తో వివాదం ఏర్పడటంతో నవజ్యొత్ నిద్దూ యాత్ర నుండి విరమించుకున్నాడు. అలా రెండవ టెస్టులో రాహుల్ ద్రావిడ్ తో కలిసి గంగూలీ అరంగేట్రం చేయడం జరిగింది. ప్రఖ్యాత అంపైర్ డికీ బర్డ్ కు ఇదే చివరి టెస్టు. ఈ ఆటలో గంగూలీ సెంచురీ సాధించి లార్డ్స్ లో అరంగేట్రం లోనే సెంచురీ సాధించిన మూడవ ఆటగాడిగా రిచార్డుకెక్కాడు.లార్డ్స్ అరంగేట్రంలో అత్యధిక పరుగుల రికార్డు (131) ఇంకా గంగూలీ పేరు మీదే ఉంది. టెంట్ బ్రిడ్జ్ లో జరిగిన తరువాతి ఆటలో మళ్ళీ సెంచురీ (136) సాధించటంతో క్రికెట్ చరిత్రలో అలా చేసిన కేవలం మూడవ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ తో కలిసి భాగస్వామ్యంలో చేసిన 255 పరుగులు ఆ సమయానికి భారత్ తరుపున, భారత్ బయట ఏ వికెట్ కి అయినా ఏ దేశం పై అయినా అత్యధిక పరుగుల రికార్డు.

ఇవి కూడా చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]