అనిల్ కుంబ్లే
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | బెంగళూరు | 1970 అక్టోబరు 17|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | జంబో ది గ్రేట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 1 అం. (1.85 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 192) | 1990 ఆగస్టు 9 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2008 అక్టోబరు 29 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 78) | 1990 ఏప్రిల్ 25 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2007 మార్చి 19 - Bermuda తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1989/90–2008/09 | కర్ణాటక | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1995 | Northamptonshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000 | Leicestershire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006 | Surrey | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: espncricinfo, 2016 నవంబరు 8 |
భారతదేశపు ప్రముఖ క్రికెట్ బౌలర్ అనిల్ కుంబ్లే. 1970 అక్టోబర్ 17 న కర్ణాటక లోని బెంగుళూరులో జన్మించిన అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. ప్రస్తుతం మనదేశం తరఫున టెస్ట్ క్రికెట్ లోనూ, వన్డే క్రికెట్ లోనూ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ అనిల్ కుంబ్లే. 2007 నవంబర్ 8 న అతనికి టెస్ట్ క్రికెట్ నాయకత్వ బాధ్యతలు కూడా అప్పగించబడింది. మొదటగా పాకిస్తాన్తో స్వదేశంలో జరిగిన 3 టెస్టుల సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. 1990లో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించి 603 టెస్ట్ వికెట్లను, 337 వన్డే వికెట్లను పడగొట్టాడు. బంతిని బాగా స్పిన్ చేయలేడని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ తర్వాత టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో లెగ్ స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు, స్పిన్నర్లలో షేన్ వార్న్, శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ ల తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. 2008, జనవరి 17 నాడు టెస్ట్ క్రికెట్‌లో 600వ వికెట్టును సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు అయ్యాడు. టెస్ట్ క్రికెట్ లో అతని యొక్క అత్యంత ప్రముఖ సంఘటన ఒకే ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లను సాధించడం. ఇంగ్లాండ్కు చెందిన జిమ్‌లేకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ కావడం గమనార్హం. అతని యొక్క సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2005లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తనకు ఎంతో ప్రీతిపాత్రమైన ఢిల్లీ ఫిరీజ్‌షా కోట్లా మైదానంలో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి 2008, నవంబర్ 2న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.[1]
బాల్యం, వ్యక్తిగత జీవితం
[మార్చు]కృష్ణస్వామి, సరోజ దంపతులకు కర్ణాటక రాజధాని బెంగుళూరులో 1970 అక్టోబర్ 17 న జన్మించాడు. ఇంటిపేరు కుంబ్లే కేరళ లోని కాసర్‌గొడ్ జిల్లాలోని కర్ణాటక సరిహద్దు గ్రామమైన కుంబ్లే నుంచి వచ్చింది. అతని భార్య పేరు చేతన రామతీర్థ. చిన్నతనంలోనే అనిల్ కుంబ్లేకు క్రికెట్ పై మక్కువ ఉండేది. బెంగుళూరు వీధులలో బ్యాటింగ్ ప్రాక్టీసు చేసి 13 సంవత్సరాల ప్రాయంలోనే యంగ్ క్రికెటర్స్ క్లబ్ లో ప్రవేశించాడు. 1991-92 లో రాష్ట్రీయ విద్యాలయ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పుచ్చుకున్నాడు. ఇతనికి దినేశ్ అనే సోదరుడు ఉన్నాడు. అతని బంతి జంబోజెట్ వేగంతో వస్తుందని అతనికి జంబో అనే ముద్దు పేరు ఉంది.
క్రికెట్ ఆటగాడిగా
[మార్చు]కుడి చేతివాటంగల అనిల్ కుంబ్లే లెగ్ స్పిన్ తో అందునా ఫ్లిప్పర్ తో బంతులను విసరడంలో నేర్పరి. మీడియం పేసర్‌గా తను క్రీడాజీవితం ప్రారంభించడంతో బంతులు వేయడంలో వేగం ఉంటుంది. 1989 నవంబర్ లో అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కర్ణాటక జట్టు తరఫున మొదటిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. హైదరాబాదుతో జరిగిన ఈ మ్యాచ్ లో 4 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత అండర్-19 జట్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి అందులో సెంచరీ సాధించాడు. 1990 ఏప్రిల్ 5 న మొదటిసారిగా శ్రీలంకతో షార్జాలో ఒకరోజు క్రికెట్ మ్యాచ్ ఆడినాడు. అదే సంవత్సరంలో ఇంగ్లాండ్ వెళ్ళిన భారత జట్టులో ఎంపికై రెండో టెస్టులో ప్రాతినిధ్యం వహించి టెస్టులలో ఆరంగేట్రం చేశాడు. 1992లో దక్షిణాప్రికా వెళ్ళిన భారత జట్టు ద్వారా ప్రాతినిధ్యం వహించి రెండో టెస్టులో 8 వికెట్లు సాధించి తన బౌలింగును మెరుగుపరచుకున్నాడు. అదే సంవత్సరం ఇంగ్లాండు జట్టు భారత పర్యటనలో 3 టెస్టుల సిరీస్ లో కేవలం 19.8 సరాసరితో మొత్తం 21 వికెట్లు సాధించి తన సత్తా నిరూపించుకున్నాడు.
తక్కువ మ్యాచ్ లలో 50 వికెట్లు
[మార్చు]టెస్ట్ క్రికెట్ లో తను మొదటి 50 వికెట్లను కేవలం 10 టెస్టు మ్యాచులలోనే తీసుకోవడం అతని పోరాట పటిమను తెలియజేస్తుంది. అతితక్కువ టెస్టులలోనే ఈ ఘనత సాధించిన భారతీయ బౌలర్ గా రికార్డును సృష్టించాడు, ఆ తర్వాత కేవలం 21 టెస్టులలోనే 100 వికెట్లు పడగొట్టి ఎర్రవల్లి ప్రసన్న తర్వాత అతితక్కువ టెస్టులలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా నిల్చాడు. 1993 నవంబర్ 27 న కోల్‌కతలో వెస్ట్‌ఇండీస్ తో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో కేవలం 12 పరుగులకే 6 వికెట్లు సాధించాడు. 10 సంవత్సరాల వరకు ఈ గణాంకమే భారతదేశం తరఫున బెస్ట్ బౌలింగ్ రికార్డుగా నిల్చింది.
1996 ప్రపంచ కప్ లో
[మార్చు]1996లో అతని వన్డే క్రికెట్ బౌలింగ్ శిఖరాలకు చేరింది. ఆ సంవత్సరం జరిగిన భారత ఉపఖండంలో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ లో 16 వికెట్లను సాధించాడు. ఈ ప్రపంచ కప్ లో అతనిచ్చిన ప్రతి వికెట్టుకు సరాసరి పరుగులు 20.24 కాగా ప్రతి ఓవర్ కు ఇచ్చిన పరుగులు కేవలం 4.06 మాత్రమే.
ఒకే ఇన్నింగ్సులో మొత్తం 10 వికెట్లు
[మార్చు]టెస్ట్ చరిత్రలోనే ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు సాధించిన వారిలో ఇంగ్లాండుకు చెందిన జిమ్‌లేకర్ తర్వాత అనిల్ కుంబ్లే రెండో బౌలర్. 1999లో ఫిబ్రవరి 4 నుండి 8 వరకు ఢిల్లీలో పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో అనిల్ కుంబ్లే ఈ ఘనతను సాధించాడు. కాని ఈ టెస్టులో పాకిస్తాన్ కు చెందిన వకార్ యూనిస్ను రెండు ఇన్నింగ్సులలోనూ ఒక్కసారి కూడా ఔట్ చేయలేదు. అతని వికెట్టును కూడా సాధించి ఉంటే ఒకే టెస్ట్ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టుకి చెందిన మొత్తం 11 బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసిన అరుదైన ఘనతను అనిల్ కుంబ్లే సొంతం చేసుకునేవాడు. ఆ ఇనింగ్సులో 9 వికెట్లను తీసిన తర్వాత అతని సహ బౌలర్ అయిన జవగళ్ శ్రీనాథ్, కుంబ్లేకు 10 వికెట్లు దక్కాలనే నెపంతో అతను వికెట్టు సాధించడానికి ప్రయత్నించలేదనే వాదన ఉంది. అనిల్ కుంబ్లే ఈ అరుదైన రికార్డు సాధించిన తర్వాత బెంగుళూరు లోని ఒక ప్రధాన కూడలికి అతని పేరు పెట్టారు. 2019 సంవత్సరం ఫిబ్రవరి 8 తేదీతో ఈ ఘనత సాధించి 20 ఏళ్ళు పూర్తి అయింది. భారతీయుల హృదయాల్లో ఈ అద్భుతమైన ప్రదర్శన ఇప్పటికి చిరస్థాయిగా ఉండిపోయింది.
400, 500 వికెట్ల క్లబ్ లో కుంబ్లే
[మార్చు]అక్టోబర్ 6, 2004 రోజున కుంబ్లే సాధించిన మరో మైలురాయి టెస్టు క్రికెట్ లో 400 వికెట్లను సాధించడం. కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ బౌలర్ కుంబ్లే, స్పిన్నర్లలో ఇతనే ప్రథముడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే షేన్ వార్న్ (ఆస్ట్రేలియా), ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) ల తర్వాత ఇతను ఈ ఘనత సాధించిన మూడవ స్పిన్నర్. 400 టెస్టు వికెట్ల సాధనలో కుంబ్లే, కపిల్ దేవ్ కంటే 30 టెస్టులు, షేర్ వార్న్ కంటే 7 టెస్టులు తక్కువగా ఆడి ఈ ఘనత పొందినాడు. అంతేకాకుండా, 300 వన్డే వికెట్లు సాధించాడు. ఈ ఘనత కుంబ్లే కాకుండా మరో భారతీయ బౌలర్ (జవగళ్ శ్రీనాథ్) మాత్రమే సాధించాడు. 2006లో వెస్ట్‌ఇండీస్ పై చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్సులో 78 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి భారత్ కు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ సీరీస్ లోని మొదటి టెస్ట్ మ్యాచ్ లో కుంబ్లే 45 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు, 2000 పరుగుల ఘనతను సాధించిన రెండో ఆల్‌రౌండరుగా (షేన్ వార్న్ తర్వాత) రికార్డు సృష్టించాడు.
కపిల్ దేవ్ రికార్డు ను అధిగమించుట
[మార్చు]డిసెంబర్ 10, 2004 న బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ రఫీక్ ను ఔట్ చేసి టెస్ట్ క్రికెట్ లో 434 వికెట్లు చేజిక్కించుకొని భారత్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు. అదే ఆటతీరును ప్రదర్శిస్తూ జూన్ 11, 2006 న 520 టెస్ట్ వికెట్లు పూర్తిచేసి కోర్ట్నీవాల్ష్ రికార్డును కూడా వెనక్కి నెట్టి నాలుగవ స్థానంలో నిలబడ్డాడు.
వన్డే క్రికెట్ నుంచి విరమణ
[మార్చు]2007 ప్రపంచ కప్లో భారత జట్టు పేవలమైన ఆటతీరుతో దేశవ్యాప్తంగా ఆటగాళ్ళపై ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ళపై నిరసన వ్యక్తం కావడంతో బాధ్యతాయుతంగా ముందుకు వచ్చి వన్డే క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు మార్చి 30, 2007 న ప్రకటించాడు.
తొలి శతకం
[మార్చు]టెస్ట్ క్రికెట్ లో ఎన్నో వికెట్లు సాధించి రికార్డులు నెలకొల్పిన కుంబ్లేకు శతకం మాత్రం ఊరిస్తూనే ఉంది. తన 118 వ టెస్టు మ్యాచ్ ఆడుతూ ఆగస్టు 10, 2007 రోజున ఇంగ్లాండు పై 110* సాధించడంతో తన కల ఫలించింది. సుదీర్ఘ కాలం తర్వాత సాధించిన శతకం కూడా మరో రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు 96 టెస్టు మ్యాచ్ తర్వాత శతకం సాధించి శ్రీలంకకు చెందిన చమిందా వాస్ రికార్డును కుంబ్లే దాటి పోయాడు. ఇది 3 టెస్టుల సీరీస్ లో భారతీయుడి ఏకైక సెంచరీ. అంతేకాదు టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్సులో మొత్తం పదికి పది వికెట్లు, టెస్ట్ సెంచరీ సాధించిన ఏకైక క్రికెటర్ గా కొత్త రికార్డునూ నెలకొల్పాడు.
ఇన్నింగ్సులో అత్యధిక సార్లు 5 వికెట్లు సాధించిన భారతీయుడు
[మార్చు]టెస్ట్ ఇన్నింగ్సులో 30 సార్లు 5 వికెట్లు పైగా సాధించి భారత్ తరఫున ఈ ఘనతను అత్యధిక పర్యాయాలు సాధించిన బౌలర్ గా రికార్డు స్థాపించాడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ ఘనతను కేవలం నలుగురు బౌలర్లు మాత్రమే (రిచర్డ్ హాడ్లీ, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, కుంబ్లే ) సాధించారు.
టెస్ట్ కెప్టెన్ గా నియామకం
[మార్చు]భారత టెస్ట్ జట్టుకు సారథిగా వ్యవహరించడానికి రాహుల్ ద్రవిడ్ నిరాకరించడం, సచిన్ టెండుల్కర్ ఒప్పుకోకపోవడంతో కెప్టెన్‌కై వేట మొదలైంది. 17 సంవత్సరాలుగా దేశానికి సేవలందిస్తూ వివాదరహితుడిగా పేరుతెచ్చుకున్న అనిల్ కుంబ్లే పేరు వాస్తవంగానే బయటికి రావడం, అతనూ సమ్మతించడంతో దేశంలో జరిగే 2007 పాకిస్తాన్ సిరీస్ కై కెప్టెన్ గా నియామకం ఖరారైంది. 118 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన కుంబ్లేకు కెప్టెన్ పదవి ఇవ్వడం సముచితమే. దీంతో కుంబ్లే - బిషన్ సింగ్ బేడీ, వెంకట రాఘవన్ ల తర్వాత భారత టెస్ట్ జట్టుకు నేతృత్వం వహించిన మూడో స్పిన్నర్ అయ్యాడు.
600 వికెట్ల క్లబ్‌లో కుంబ్లే
[మార్చు]2008 జనవరి 17 నాడు పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో సిమ్మండ్స్ వికెట్ సాధించి 600 వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచ బౌలర్లలో కుంబ్లే మూడో బౌలర్. ఇది వరకు ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్, శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్లు మాత్రమే ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు.
క్రీడా జీవితం నుండి విరమణ
[మార్చు]2008 ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలోనే మూడో టెస్ట్ నాల్గవరోజు క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించాడు. వంద శాతం ఫిట్‌గా లేనందున జట్టుకు తగినంత న్యాయం చేకూర్చలేనని ప్రకటించి ఒకే ఇన్నింగ్సులో పదికి పది వికెట్లను తీసిన ఫిరోజ్‌షా కోట్లా (ఢిల్లీ) మైదానాన్నే తన విరమణ వేదికగా చేసుకున్నాడు.
రికార్డులు
[మార్చు]- ఒకే టెస్ట్ ఇన్నింగ్సులో మొత్తం 10 వికెట్లు సాధించిన ఏకైక భారతీయుడు.
- టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారతీయుడు. (619 వికెట్లు)
- అతి తక్కువ మ్యాచ్‌లలో 50 వికెట్లు సాధించిన భారతీయుడు.
- ఇన్నింగ్సులో 5 వికెట్లను అత్యధిక పర్యాయాలు సాధించిన భారతీయుడు. (35 సార్లు)
- అత్యధిక టెస్టుల తరువాత సెంచరీ సాధించిన క్రికెటర్ (ప్రపంచ రికార్డు).
- 500 టెస్ట్ వికెట్లను సాధించిన తొలి, ఏకైక భారతీయుడు.
- 600 టెస్ట్ వికెట్లను సాధించిన తొలి, ఏకైక భారతీయుడు.
అవార్డులు, గుర్తింపులు
[మార్చు]- 1995లో భారత ప్రభుత్వంచే క్రీడా రంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డు గ్రహీత అయ్యాడు.
- 1996 విజ్డెన్ క్రికెటర్ ఆప్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.
- 2002లో 21 వ శతాబ్దపు విజ్డెన్ అత్యున్నత భారత క్రికెటర్లలో 16 వ స్థానం పొందినాడు. (కపిల్ దేవ్కు ప్రథమ స్థానం లభించింది.)
- 2005లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు లభించింది.
టెస్ట్ క్రికెట్ లో 4 అవార్డులు
[మార్చు]# సీరీస్ సంవత్సరం సీరీస్ లో గణాంకాలు 1 ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరీస్ 1992/93 16 (3 మ్యాచ్ లు, 2 ఇన్నింగ్సులు) ; 181-53-416-21 (1x5 WI) ; 1 Catch 2 న్యూజీలాండ్ తో టెస్ట్ సీరీస్ 1999/00 39 పరుగులు (3 మ్యాచ్ లు, 3 ఇన్నింగ్సులు) ; 197.4-76-364-20 (2x5 WI, 1x10 WM) ; 2 Catches 3 జింబాబ్వేతో టెస్ట్ సీరీస్ 2001/02 47 పరుగులు (2 మ్యాచ్ లు, 3 ఇన్నింగ్సులు) ; 134.2-48-291-16 (1x5 WI) 4 శ్రీలంకతో తెస్ట్ సీరీస్ 2005/06 67 పరుగులు (3 మ్యాచ్ లు, 4 ఇనింగ్సులు) ; 138.3-28-374-20 (2x5 WI, 1x10 WM) ; 2 Catches
వన్డే క్రికెట్ లో ఒక అవార్డు
[మార్చు]# సీరీస్ సీజన్ సీరీస్ గణాంకాలు 1 సహారా కప్ (పాకిస్తాన్ v/s ఇండియా) 1996 26 (5 మ్యాచ్ లు & 3 ఇన్నింగ్సులు) ; 44-2-159-13
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (టెస్ట్ లలో)
[మార్చు]మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డులు (వన్డే లలో)
[మార్చు]క్ర.సం. ప్రత్యర్థి స్టేడియం సీజన్ మ్యాచ్ గణాంకాలు 1 ఇంగ్లాండ్ హెడింగ్లే స్టేడియం, హెడింగ్లే, లీడ్స్ 1990 11-2-29-2 2 వెస్ట్‌ఇండీస్ ఈడెన్ గార్డెన్ స్టేడియణ్, కోల్‌కత 1993/94 5* (1x4) ; 6.1-2-12-6 3 న్యూజీలాండ్ బేసిన్ రిజర్వ్ స్టేడియం, వెల్లింగ్టన్ 1993/94 10-0-33-5 4 దక్షిణాప్రికా వాంఖేడే స్టేడియం, ముంబాయి 1996/97 8.2-0-25-4 5 బంగ్లాదేశ్ వాంఖేడే స్టేడియం, ముంబాయి 1998 10-4-17-3 6 కెన్యా నైరోబీ జింఖానా క్లబ్, నైరోబీ 2001/02 10-1-22-2
ఇవి కూడా చూడండి
[మార్చు]
బయటి లింకులు
[మార్చు]- 10 wicket haul for Kumble at Google Video
- The Score board of the second Test in Delhi - the ten wicket haul for Kumble
- India's greatest bowler - Cricinfo.com article dated 6 October 2004
- Most wickets in Test cricket Cricinfo.com (updated after each match)
- Most 5 wickets in an innings in Test matches - Cricinfo.com (updated after each match)
- Most wickets in ODI cricket - Cricinfo.com (updated after each match)
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, తేది 02-11-2008.
- టెస్ట్ క్రికెట్‌లో 400 వికెట్లు సాధించిన బౌలర్లు
- Commons category link is on Wikidata
- భారతీయ క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ టెస్ట్ క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ వన్డే క్రికెట్ క్రీడాకారులు
- కర్ణాటక క్రికెట్ క్రీడాకారులు
- విజ్డెన్ క్రికెట్ ఆప్ ది ఇయర్ క్రికెటర్లు
- అర్జున అవార్డు గ్రహీతలు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- 1970 జననాలు
- భారతీయ క్రికెట్ కెప్టెన్లు
- కర్ణాటక క్రీడాకారులు
- భారతీయ క్రీడాకారులు
- జీవిస్తున్న ప్రజలు