వెంకటేష్ ప్రసాద్
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | బాపూ కృష్ణారావ్ వెంకటేష్ ప్రసాద్ | |||
జననం | బెంగళూరు, మైసూరు రాష్ట్రం | 1969 ఆగస్టు 5|||
ఎత్తు | 1.91 మీ. (6 అ. 3 అం.) | |||
బ్యాటింగ్ శైలి | కుడిచేతివాటం | |||
బౌలింగ్ శైలి | కుడిచేతి వాటం మీడియం-ఫాస్ట్ | |||
పాత్ర | బౌలరు | |||
అంతర్జాతీయ సమాచారం | ||||
జాతీయ జట్టు | భారతదేశం | |||
టెస్టు అరంగ్రేటం(cap 204) | జూన్ 7 1996 v ఇంగ్లండు | |||
చివరి టెస్టు | ఆగస్టు 29 2001 v శ్రీలంక | |||
వన్‌డే లలో ప్రవేశం(cap 89) | ఏప్రిల్ 2 1994 v న్యూజీలాండ్ | |||
చివరి వన్‌డే | అక్టోబరు 17 2001 v కెన్యా | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
1991–2003 | కర్ణాటక రాష్ట్ర జట్టు | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | టెస్టు | వన్‌డే | దేశీవాళీ | లిస్ట్ ఏ క్రికెట్ |
మ్యాచ్‌లు | 33 | 161 | 123 | 236 |
సాధించిన పరుగులు | 203 | 221 | 892 | 304 |
బ్యాటింగ్ సగటు | 7.51 | 6.90 | 10.02 | 6.46 |
100s/50s | 0/0 | 0/0 | 0/0 | 0/0 |
ఉత్తమ స్కోరు | 30* | 19 | 37 | 20 |
బాల్స్ వేసినవి | 7,041 | 8,129 | 22,222 | 11,951 |
వికెట్లు | 96 | 196 | 361 | 295 |
బౌలింగ్ సగటు | 35.00 | 32.30 | 27.75 | 29.72 |
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 7 | 1 | 18 | 2 |
మ్యాచ్ లో 10 వికెట్లు | 1 | 0 | 3 | 0 |
ఉత్తమ బౌలింగ్ | 6/33 | 5/27 | 7/37 | 6/18 |
క్యాచులు/స్టంపింగులు | 6/– | 37/– | 75/– | 56/– |
Source: CricketArchive, సెప్టెంబరు 2 2017 |
వెంకటేష్ ప్రసాద్ (జ. 1969 ఆగస్టు 5)[1] భారత మాజీ క్రికెట్ ఆటగాడు. టెస్టుల్లో, వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అప్పటి మైసూరు రాష్ట్రంలో బెంగుళూరులో జన్మించిన వెంకటేష్ ప్రసాద్ 1994 లో తన కెరీర్ మొదలు పెట్టాడు. ప్రసాద్ ప్రధానంగా కుడిచేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్. జవగళ్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ తో కలిసి కొంతకాలం భారత జట్టులో మంచి జోడీగా పేరుపొందారు.[2] ప్రసాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కింగ్స్ XI పంజాబ్ కి బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడు. 2007 నుంచి 2009 మధ్యలో భారత క్రికెట్ జట్టుకి కూడా బౌలింగ్ కోచ్ గా సేవలందించాడు.
అంతర్జాతీయ క్రీడల్లో ప్రసాద్ మొత్తం 33 టెస్టులాడి 35 సగటున 96 వికెట్లు తీశాడు. 161 వన్డేలు ఆడి 32.3 సగటుతో 196 వికెట్లు తీశాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
వెంకటేష్ ప్రసాద్ పూర్తి పేరు బాపు కృష్ణారావ్ వెంకటేష్ ప్రసాద్. 1969 ఆగస్టు 5న అప్పటి మైసూరు రాష్ట్రం, బెంగళూరులో జన్మించాడు.
1996 ఏప్రిల్ 22 న తనకన్నా వయసులో పెద్దదైన జయంతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి పృథ్వి అనే కుమారుడు ఉన్నాడు.[3]
మూలాలు[మార్చు]
- ↑ "Cricinfo - Players and Officials - Venkatesh Prasad". Retrieved 2008-08-29.
- ↑ "Could have played little longer but knees made it difficult, says Javagal Srinath". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-20. Retrieved 2021-03-02.
- ↑ Staff (2008-01-23). "Love Stories Of Famous Indian Bowlers". boldsky.com (in ఇంగ్లీష్). Retrieved 2021-02-04.