ఇండియన్ ప్రీమియర్ లీగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ ప్రీమియర్ లీగ్
దేశాలుభారతదేశం
నిర్వాహకుడుబోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ)
ఫార్మాట్ట్వంటీ20
తొలి టోర్నమెంటు2008
చివరి టోర్నమెంటు2023
తరువాతి టోర్నమెంటు2024
టోర్నమెంటు ఫార్మాట్రౌండ్ రాబిన్, ప్లే ఆఫ్
జట్ల సంఖ్య10
ప్రస్తుత ఛాంపియన్చెన్నై సూపర్ కింగ్స్
(2023)
అత్యంత విజయవంతమైన వారుచెన్నై సూపర్ కింగ్స్
ముంబై ఇండియన్స్
(చెరి 5 టైటిళ్ళు)
అత్యధిక పరుగులువిరాట్ కొహ్లి (7263)
అత్యధిక వికెట్లుయజువేంద్ర చాహల్ (187)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అనేది పురుషుల ట్వంటీ20 (T20) క్రికెట్ లీగ్. దీన్ని భారతదేశంలో ఏటా నిర్వహిస్తారు. పది నగరాలకు చెందిన ఫ్రాంచైజీ జట్లు ఇందులో పోటీ చేస్తాయి. [1] దీనిని స్పాన్సర్‌షిప్పును అనుసరించి దీన్ని టాటా IPL అని కూడా పిలుస్తారు. 2007 లో బీసీసీఐ ఈ లీగ్‌ని స్థాపించింది. పోటీలు సాధారణంగా ప్రతి సంవత్సరం వేసవిలో మార్చి, మే నెలల్లో జరుగుతాయి. ఈ సీజనులో ప్రపంచవ్యాప్తంగా తక్కువ అంతర్జాతీయ క్రికెట్ పర్యటనలు జరుగుతున్నందున ICC ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో దీనికి ప్రత్యేకమైన విండో ఉంది.[2]

ఐపిఎల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. 2014లో, సగటు హాజరు ప్రకారం చూస్తే స్పోర్ట్స్ లీగ్‌లన్నిటిలోకీ ఇది ఆరవ స్థానంలో ఉంది. [3] 2010లో, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారమైన మొదటి క్రీడా ఈవెంట్‌గా IPL నిలిచింది. [4] [5] IPL భారీ విజయం నుండి స్ఫూర్తిగా అనేక దేశీయ క్రికెట్ లీగులు, ఇతర క్రీడల లీగ్‌లూ భారతదేశంలో ప్రారంభమయ్యాయి. [a] [8] [9] [10] 2022లో ఈ లీగ్ బ్రాండ్ విలువ రూ 90,038 కోట్లు [11] BCCI ప్రకారం, 2015 సీజనులో ఐపిఎల్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ జిడిపికి రూ 1,150 కోట్లు అందించింది.[12] కన్సల్టింగ్ సంస్థ డి అండ్ పి అడ్వైజరీ నివేదిక ప్రకారం, 2022 డిసెంబరులో IPL విలువ US$10.9 బిలియన్లు. 2020 నుండి డాలర్ పరంగా 75% వృద్ధిని నమోదు చేసింది.[13] 2023 ఐపిఎల్ ఫైనల్‌ను 3.2 కోట్ల మంది వీక్షకులు చూసారు. ఇంటర్నెట్‌లో అత్యధిక వీక్షణలు పొందిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం అది.[14]

2023లో లీగ్ తన మీడియా హక్కులను 2023–2027 కాలానికి US$ 6.4 బిలియన్లకు Viacom18, స్టార్ స్పోర్ట్స్‌కు విక్రయించింది, [15] ఒక్కో మ్యాచ్‌^న్మి IPL, $13.4 మిలియన్లుగా విలువ కట్టింది.[16] 2023 వరకు టోర్నమెంటులో పదహారు సీజన్లు జరిగాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్, 2023 సీజన్‌లో విజేతగా, ప్రస్తుత ఛాంపియన్‌గా నిలిచింది. [17]

చరిత్ర

[మార్చు]
విజేతలు



ఇండియన్ ప్రీమియర్ లీగ్
బుతువు విజేతలు
2008 రాజస్థాన్ రాయల్స్
2009 డెక్కన్ ఛార్జర్స్
2010 చెన్నై సూపర్ కింగ్స్
2011 చెన్నై సూపర్ కింగ్స్(2)
2012 కోల్‌కతా నైట్ రైడర్స్
2013 ముంబై ఇండియన్స్
2014 కోల్‌కతా నైట్ రైడర్స్(2)
2015 ముంబై ఇండియన్స్(2)
2016 సన్‌రైజర్స్ హైదరాబాద్
2017 ముంబై ఇండియన్స్(3)
2018 చెన్నై సూపర్ కింగ్స్(3)
2019 ముంబై ఇండియన్స్(4)
2020 ముంబై ఇండియన్స్(5)
2021 చెన్నై సూపర్ కింగ్స్(4)
2022 గుజరాత్ టైటాన్స్
2023 చెన్నై సూపర్ కింగ్స్(5)

నేపథ్యం

[మార్చు]

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ అందించిన నిధులతో ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL)ను 2007లో స్థాపించారు. [18] ICL ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) గాని, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గానీ గుర్తించలేదు. BCCI కమిటీ సభ్యులు ICL ఎగ్జిక్యూటివ్ బోర్డులో చేరడం దానికి అసంతృప్తి కలిగించింది. [19] ఆటగాళ్లు ICLలో చేరకుండా నిరోధించడానికి, BCCI తన దేశీయ టోర్నమెంట్‌లలో ప్రైజ్ మనీని పెంచింది. BCCI రెబల్ లీగ్‌గా పరిగణించిన ICLలో చేరే ఆటగాళ్లపై జీవితకాల నిషేధాన్ని విధించింది. [20] [21]

పునాది

[మార్చు]

2007 సెప్టెంబరు 13 న,[22] 2007 T20 ప్రపంచ కప్‌లో భారతదేశం విజయం సాధించిన తరువాత, [23] BCCI, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే ఫ్రాంచైజీ ఆధారిత ట్వంటీ20 క్రికెట్ (T20) పోటీని ప్రకటించింది. మొదటి సీజన్ 2008 ఏప్రిల్‌లో న్యూ ఢిల్లీలో "హై-ప్రొఫైల్ వేడుక"లో ప్రారంభం కావాల్సి ఉంది. IPL ప్రయత్నానికి నాయకత్వం వహించిన BCCI వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ, టోర్నమెంట్ ఫార్మాట్, ప్రైజ్ మనీ, ఫ్రాంచైజీ ఆదాయ వ్యవస్థ, స్క్వాడ్‌ల కూర్పు నియమాలతో సహా వివిధ వివరాలను ప్రకటించాడు. ఐపిఎల్‌ను మాజీ భారత ఆటగాళ్లు, బిసిసిఐ అధికారులతో కూడిన ఏడుగురు వ్యక్తుల గవర్నింగ్ కౌన్సిల్ నిర్వహిస్తుందనీ, రెండు అగ్రశ్రేణి ఐపిఎల్ జట్లు ఆ సంవత్సరం ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 కి అర్హత సాధిస్తాయనీ కూడా ప్రకటించారు. 2007లో స్థాపించబడిన ప్రైవేట్ T20 లీగ్ అయిన ఇండియన్ క్రికెట్ లీగ్‌కు పోటీగా IPL ను ప్రారంభించలేదనీ, BCCI [22] అనేక సంవత్సరాలుగా ఈ ఆలోచనపై పనిచేస్తోందనీ కూడా మోడీ చెప్పాడు. లీగ్ ఫార్మాట్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, అమెరికా లోని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ మాదిరిగానే ఉంది. [21] మోడీ, "ఐపిఎల్ పూర్తిగా కొత్త తరం క్రీడాభిమానులను దేశవ్యాప్తంగా మైదానంలోకి ఆకర్షించడానికి రూపొందించబడింది. డైనమిక్ ట్వంటీ 20 ఫార్మాట్ మహిళలు, పిల్లలతో సహా యువ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించాం." అని చెప్పాడు. [22]

కొత్త లీగ్‌లో పాల్గొనే జట్టు యజమానులను ఎంచుకోవడానికి, 2008 జనవరి 24 న ఫ్రాంచైజీల వేలం నిర్వహించారు; ఫ్రాంఛైజీల రిజర్వ్ ధరలు సుమారు $400 మిలియన్లు. [21] వేలం ముగింపులో, గెలుపొందిన బిడ్డర్లు, జట్లు ఉండే నగరాలు: బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, మొహాలీ, ముంబై . [21] ఫ్రాంచైజీలను మొత్తం $723.59 మిలియన్లకు విక్రయించారు. [24] ICL లో పాల్గొనే ఆటగాళ్లపై విధించిన నిషేధం ఫలితంగా, 2009 లో అది మూతపడింది. [25] [26]

కోల్‌కతాలో 2023 IPL సీజన్ మ్యాచ్‌లో ప్రేక్షకులు.

2008 ముంబై ఉగ్రదాడుల డాడులలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నందున పాక్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు అనుమతించలేదు. [27] [28]

విస్తరణలు, ముగింపులు

[మార్చు]
భారతదేశంలోని కోల్‌కతాలో 2023 IPL సీజన్ మ్యాచ్‌లో ప్రేక్షకులు.

2010 మార్చి 21 న, కొత్త ఫ్రాంఛైజీలు పూణె వారియర్స్ ఇండియా, కొచ్చి టస్కర్స్ కేరళ లు 2011 లో నాల్గవ సీజన్‌కు ముందు లీగ్‌లో చేరాయి. [29] సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ గ్రూప్ $370 మిలియన్లకు పూణే ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. రెండెజౌస్ స్పోర్ట్స్ వరల్డ్ కొచ్చి ఫ్రాంచైజీని $333.3 మిలియన్లకు కొనుగోలు చేసింది.[29] కొచ్చి టస్కర్స్ కేరళ 2011 సీజన్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీకి చెందిన 10% బ్యాంక్ గ్యారెంటీ ధనాన్ని BCCI కి చెల్లించడంలో విఫలమైనందున 2011 నవంబరు 11 న దాన్ని రద్దు చేసారు.[30]

2012 సెప్టెంబరు 14 న, 2009 ఛాంపియన్ అయిన డెక్కన్ ఛార్జర్స్‌కు కొత్త యజమానులు దొరకలేదు. BCCI ఆ జట్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. [31] అక్టోబరు 25న, కొత్త ఫ్రాంచైజీ కోసం వేలం నిర్వహించగా, హైదరాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన బిడ్‌ను సన్ టీవీ నెట్‌వర్క్ గెలుచుకుంది. [32] జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అని పేరు పెట్టారు. [33]

BCCIతో ఆర్థిక విభేదాల కారణంగా పూణె వారియర్స్ ఇండియా 2013 మే 21 న IPL నుండి వైదొలిగింది. [34] BCCI అధికారికంగా ఫ్రాంచైజీని 2013 అక్టోబరు 26 న రద్దు చేసింది. అవసరమైన బ్యాంక్ గ్యారెంటీని అందించడంలో విఫలమైనందున రద్దు చేసారు. [35]

2015 జూన్ 14 న, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో రెండుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ప్రారంభ సీజన్ ఛాంపియన్‌లైన రాజస్థాన్ రాయల్స్‌ను రెండు సీజన్‌ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. [36] 2015 డిసెంబరు 8 న, వేలం తర్వాత, చెన్నై, రాజస్థాన్‌ల స్థానంలో రెండు సీజన్‌లకు పూణె, రాజ్‌కోట్‌లు పోటీ పడతాయని ప్రకటించారు. [37] రీప్లేస్‌మెంట్ జట్లు రైజింగ్ పూణె సూపర్‌జెయింట్, గుజరాత్ లయన్స్ . [38]

COVID-19 మహమ్మారి కారణంగా, 2020 సీజన్‌కు వేదికను మార్చి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో గేమ్‌లు నిర్వహించారు. [39] [40] 2012 ఆగస్టులో, BCCI రెండు కొత్త ఫ్రాంచైజీలను ప్రకటించింది. ఇది BCCI షార్ట్‌లిస్ట్ చేసిన ఆరు నగరాల్లో రెండింటిలో ఉంటాయి. అవి – అహ్మదాబాద్, లక్నో, కటక్, గౌహతి, రాంచీ, ధర్మశాల2022 సీజన్ నుండి అవి లీగ్‌లో చేరతాయని ప్రకటించింది. [41] [42] అక్టోబరు 25 న జరిగిన క్లోజ్డ్ బిడ్డింగ్‌లో, RPSG గ్రూప్, CVC క్యాపిటల్‌లు జట్ల కోసం బిడ్‌లను గెలుచుకున్నాయి. RPSG రూ 7,000 కోట్లతో లక్నో, CVC 5,200 కోట్లతో అహ్మదాబాద్‌ను గెలుచుకున్నాయి. [43] [44] ఈ జట్లకు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ అని పేర్లు పెట్టారు.

అనేక మంది IPL జట్టు యజమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ లీగ్‌లలో దక్షిణాఫ్రికాకు చెందిన SA20, కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) వంటి జట్లను కొనుగోలు చేసి తమ వ్యాపారాన్ని విస్తరించారు. వారు తమ జట్లను తమ ఐపిఎల్ జట్లకు సమానమైన పేర్లతో బ్రాండింగు చేసుకున్నారు. [45]

పరిపాలన

[మార్చు]

IPL ప్రధాన కార్యాలయం ముంబైలోని చర్చ్‌గేట్‌లోని వాంఖడే స్టేడియం పక్కన క్రికెట్ సెంటర్‌లో ఉంది. టోర్నమెంట్ సంస్థతో సహా లీగ్ విధులకు IPL గవర్నింగ్ కౌన్సిల్ బాధ్యత వహిస్తుంది. దీని సభ్యులు: [46]

  • అరుణ్ సింగ్ ధుమల్ – చైర్మన్[47][48]
  • జై షా – BCCI సెక్రెటరీ
  • ఆషిష్ షెలార్ – కోశాధికారి, BCCI
  • అవిషేక్ దాల్మియా
  • ప్రజ్ఞాన్ ఓఝా – ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషను ప్రతినిధి
  • అల్కా రేహానీ భరద్వాజ్ – కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి

వ్యవస్థ

[మార్చు]

ఆటగాళ్ళ సముపార్జన, స్క్వాడ్ కూర్పు, జీతాలు

[మార్చు]

ఏటా జరిగే ఆటగాళ్ళ వేలంలో పాడుకోవడం, ట్రేడింగ్ సమయంలో ఇతర జట్ల నుండి కొనుక్కోవడం, అందుబాటులో లేని ఆటగాళ్ళ స్థానంలో వేరేవాళ్ళను తీసుకోవడం ద్వారా జట్టు ఆటగాళ్లను సమకూర్చుకుంటుంది. ఆటగాళ్ళు వేలం కోసం తమను తాము ఆఫర్ చేసుకుంటరు. [49] తమ మూల ధరను నిర్ణయించుకుంటారు. అత్యధిక-బిడ్డింగ్ చేసిన ఫ్రాంచైజీ, వారిని కొనుగోలు చేస్తుంది. వేలంలో విక్రయించబడని ఆటగాళ్లు అందుబాట్యులో లేని ఆటగాళ్ళ స్థానంలో (భర్తీ) చేరడానికి అర్హులు. ట్రేడింగ్ విండోస్‌లో, ఆటగాడి సమ్మతి ఉంటేనే వర్తకం చేయవచ్చు; ఫ్రాంఛైజీ పాత కొత్త ఒప్పందాల మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే దాన్ని చెల్లిస్తుంది. కొత్త కాంట్రాక్టు విలువ పాతదాని కంటే ఎక్కువ ఉంటే, ఆటగాడు, అమ్మే ఫ్రాంచైజీ ఆ తేడాను పంచుకుంటారు. సాధారణంగా మూడు ట్రేడింగ్ విండోలు ఉంటాయి - వేలానికి ముందు రెండు ఉండగా, వేలానికి టోర్నమెంటు ప్రారంభానికీ మధ్య ఒకటి ఉంటుంది. ట్రేడింగ్ విండోస్ వెలుపల లేదా టోర్నమెంట్ సమయంలో ఆటగాళ్ళ వర్తకం చేయకూడదు. అయితే టోర్నమెంట్‌కు ముందు లేదా జరిగే సమయంలో భర్తీ ఆటగాళ్ళను తీసుకోవచ్చు.

2020 సీజన్ నాటికి ఫ్రాంచైజీల నియమాలు కొన్ని:

  • మొత్తం స్క్వాడ్ జీతం రూ 85 కోట్లను మించకూడదు . [50]
  • అండర్-19 ఆటగాళ్ళలో ఇంతకు ముందు ఫస్ట్-క్లాస్ లేదా లిస్ట్ A క్రికెట్ ఆడితే తప్ప వారిని ఎంపిక చేయకూడదు. [51]

ఆటగాళ్ళ కాంట్రాక్టులు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటాయి. ఒప్పందాన్ని ఫ్రాంచైజీ ఒకటి లేదా రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు. 2014 సీజన్ నుండి, ప్లేయర్ కాంట్రాక్ట్‌లు రూపాయిల్లో ఇస్తున్నారు. అంతకు ముందు ఒప్పందాలు US డాలర్లలో ఉండేవి. విదేశీ ఆటగాళ్ళ కాంట్రాక్ట్ తేదీ నాటి లేదా అసలు చెల్లింపు తేదీ నాటి మారకం రేటును బట్టి ఆటగాడు ఎంచుకున్న కరెన్సీలో వేతనం పొందవచ్చు. [52] 2014 సీజన్‌కు ముందు, ఆటగాళ్ళ వేలం పూల్‌లో భారత దేశీయ ఆటగాళ్లను చేర్చలేదు. వారిని ఫ్రాంచైజీలు నేరుగా విడివిడిగా సైన్ అప్ చేసుకోవచ్చు. అయితే ఫ్రాంచైజీ ఇచ్చే జీతం నుండి ఒక్కో ఆటగాడికి 10 లక్షల నుండి 30 లక్షల వరకు వసూలు చేస్తారు. దీన్ని ఫ్రాంచైజీ యజమానులు గట్టిగా వ్యతిరేకించారు. బాగా డబ్బున్న ఫ్రాంఛైజీలు "లోపాయికారీ ఒప్పందాలతో ఆటగాళ్లను ఆకర్షిస్తున్నాయి" అని వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆటగాళ్ల వేలంలో దేశీయ ఆటగాళ్లను చేర్చాలని ఐపీఎల్ నిర్ణయించింది. [53]

విదేశీ ఆటగాళ్ల జీతంలో 10% మొత్తాన్ని బిసిసిఐ, ఆయా దేశాల జాతీయ క్రికెట్ బోర్డులకు ఇస్తుంది. [54]

స్పోర్టింగ్ ఇంటెలిజెన్స్, ESPN ది మ్యాగజైన్ లు 2015 లో చేసిన సర్వే ప్రకారం, ప్రో-రేటింగ్ పద్ధతిలో చూస్తే, IPL లో ఆటగాళ్ళ సగటు జీతం సంవత్సరానికి US$ 4.33 మిలియన్లు ఉంటుంది. ఇది ప్రపంచంలోని స్పోర్ట్స్ లీగ్‌లు ఇచ్చే అత్యధిక జీతాల్లో రెండవ స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్‌లో ఆటగాళ్లు టోర్నమెంట్ వ్యవధికి మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇది రెండు నెలల కన్నా తక్కువ. కానీ, ఇతర స్పోర్ట్స్ లీగ్‌లు కుదుర్చుకునే ఒప్పందాలు మొత్తం సంవత్సరానికి ఉంటాయి.[55]

ది టెలిగ్రాఫ్ యొక్క నివేదిక ప్రకారం, IPL లో వచ్చే ఆదాయంలో ఆటగాళ్లకు 18% చెల్లిస్తారు. ఇది ఇతర ప్రధాన స్పోర్ట్స్ లీగ్‌లతో పోలిస్తే అతి తక్కువ మొత్తం. చాలా స్పోర్ట్స్ లీగ్‌లు తమ ఆదాయంలో ఆటగాళ్లకు కనీసం 50% చెల్లిస్తాయి. ఐపీఎల్ ఆటగాళ్లకు సక్రమంగా చెల్లించాలని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య తెలిపింది.[56] [57] [58]

నగదు బహుమతి

[మార్చు]

IPL 2022 సీజన్లో మొత్తం 46.5 కోట్లు ప్రైజ్ మనీ ఉంది. విజేత జట్టు 20 కోట్లు, రెండవ స్థానంలో నిలిచిన జట్టు 13 కోట్లు, మూడవ స్థానంలో నిలిచిన జట్టు 7 కోట్లు, నాల్గవ స్థానంలో ఉన్న జట్టు 6.5 కోట్లు అందుకుంటాయి.[59] [60] ఇతర జట్లకు ప్రైజ్ మనీ ఉండదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రైజ్ మనీలో సగం మొత్తాన్ని ఆటగాళ్లకు పంచాలి.[61]

నియమాలు

[మార్చు]

అంతర్జాతీయ T20 క్రికెట్ ఫార్మాట్‌కు, ఇతర T20 లీగ్‌లకూ భిన్నంగా IPL లో కొన్ని నియమాలున్నాయి. అవి:

  • IPL గేమ్‌లలో టెలివిజన్ టైమౌట్ ఉంటుంది. ఇన్నింగ్స్ సమయంలో ప్రతి జట్టుకు రెండున్నర నిమిషాల "వ్యూహాత్మక టైమౌట్" ఉంటుంది; బౌలింగ్ జట్టుకు ఆరు తొమ్మిది ఓవర్ల మధ్య, బ్యాటింగు జట్టు పదమూడు, పదహారు ఓవర్ల మధ్య తప్పనిసరిగా టైమౌట్లు తీసుకోవాలి. వ్యూహాత్మక టైమౌట్‌ ముగిసినట్లు సూచించడానికి, ఆన్-ఫీల్డ్ అంపైరు గాలిలో తన చేతిని పైకెత్తి రెండో చేత్తో మణికట్టుపై తడతాడు (గడియారాన్ని సూచిస్తూ). టైమౌట్‌ను జట్లు దుర్వినియోగం చేస్తున్నాయని అంపైర్లు గుర్తిస్తే పెనాల్టీ విధించవచ్చు.
  • 2018 సీజన్ నుండి, అన్ని IPL మ్యాచ్‌లలో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS) ను ఉపయోగిస్తున్నారు. ఇది ఆన్-ఫీల్డ్ అంపైరు నిర్ణయాన్ని సమీక్షించడానికి ప్రతి జట్టుకు ఇన్నింగ్స్‌లో రెండు అవకాశాలు ఉంటాయి. 2023 సీజన్ నుండి, ఆటగాళ్లు వైడ్‌లు, నో-బాల్‌లను కూడా సమీక్షించవచ్చు, ఇది ఇతర పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌లలో ఉండదు.
  • బౌలింగ్ జట్టు తన ఓవర్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయకుంటే, మిగిలిన ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ పరిమితుల సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్‌లను మాత్రమే ఉంచవచ్చు లేదా మ్యాచ్ రిఫరీ ఆట తర్వాత బౌలింగ్ జట్టు కెప్టెన్‌ను శిక్షించవచ్చు. ఒక సీజన్‌లో మొదటి నేరంపై కెప్టెన్‌కు 12 లక్షల రూపాయల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే 24 లక్షల రూపాయల జరిమానా, కెప్టెన్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా జట్టు సభ్యులందరికీ 6 లక్షల రూపాయలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% (ఏది తక్కువ అయితే అది) జరిమానా విధిస్తారు. అదే సీజన్‌లో మూడోసారి జట్టు స్లో ఓవర్‌రేట్‌తో బౌలింగ్ చేస్తే, కెప్టెన్‌ను తదుపరి మ్యాచ్‌కు సస్పెండ్ చేస్తారు. అలాగే అతనికి 30 లక్షల రూపాయల జరిమానా, జట్టులోని మిగిలిన వారికి ఒక్కొక్కరికి 12 లక్షలు లేదా 50% మ్యాచ్ ఫీజు (ఏది తక్కువైతే అది) జరిమానా విధిస్తారు. తదుపరి నేరాలకు ఈ జరిమానాలు అలాగే ఉంటాయి.
  • ముందే పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల జాబితా నుండి "ఇంపాక్ట్ ప్లేయర్"గా పేర్కొనబడే ఒక ఆటగాణ్ణి జట్లు ఉపయోగించవచ్చు. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు గాని, వికెట్ పడినప్పుడు గాని, బ్యాటర్ రిటైర్ అయినప్పుడు గాని, ఓవర్ చివరిలో గానీ ఆటగాణ్ణి మారచ్వచ్చు. ఈ నియమం ఫుట్‌బాల్, NBA నుండి తీసుకున్నారు. రెండు జట్లూ ఒక్కో మ్యాచ్‌కు చెఒకకసారి సబ్‌స్టిట్యూట్‌ని ప్రవేశపెట్టవచ్చు. ఒక బ్యాట్స్‌మన్ అవుట్ అయ్యినపుడు బౌలింగ్ జట్టు ఓవర్ మధ్యలో ఆట్గాణ్ణి మార్చాలని నిర్ణయించుకుంటే, అపుడు వచ్చే బౌలరు ఆ ఓవర్‌లోని మిగిలిన బంతులను వేయకూడదు. వెళ్ళిపోయే ఆటగాడు ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా కూడా మ్యాచ్‌లో పాల్గొనకూడదు. జట్టు తుది జాబితాలో నలుగురు కంటే తక్కువ విదేశీ ఆటగాళ్ళు ఉన్నట్లయితే, ప్రత్యామ్నాయంగా విదేశీ ఆటగాడిని పంపవచ్చు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ తన చేతులతో 'X సింబల్' చేయడం ద్వారా ఆటగాణ్ణి మారుస్తున్నట్లు సూచిస్తాడు.
  • ఒక మ్యాచ్‌లో పాల్గొనే జట్లు తమ ఆడే పదకొండు ఆటగాళ్ళ పేర్లను టాస్‌కు ముందు గాని, తర్వాత గానీ మ్యాచ్-రిఫరీకి ఇవ్వవచ్చు.
  • బౌలర్ బౌలింగు చేస్తూండగా, బంతి బ్యాట్స్‌మన్‌కి చేరే లోగా ఫీల్డరు గానీ, వికెట్ కీపరు గానీ అనుచితమైన కదలికలు చేస్తే ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు, ఆ బంతిని డెడ్ బాల్‌గా గుర్తిస్తారు.
  • ప్లేయింగ్ ఎలెవెన్‌లో జట్లు గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకోవచ్చు.
  • జట్లు తప్పనిసరిగా ఇరవై ఐదు మంది ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకోవాలి. అందులో ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ళు ఉండవచ్చు.

జట్లు

[మార్చు]

ప్రస్తుత జట్లు

[మార్చు]

 

జట్టు నగరం రాష్ట్రం హోమ్ గ్రౌండ్ అరంగేట్రం కెప్టెన్ ప్రధాన కోచ్
చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై తమిళనాడు MA చిదంబరం స్టేడియం 2008 ఎంఎస్ ధోని స్టీఫెన్ ఫ్లెమింగ్
ఢిల్లీ రాజధానులు న్యూఢిల్లీ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం 2008 డేవిడ్ వార్నర్ రికీ పాంటింగ్
గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియం 2022 హార్దిక్ పాండ్యా ఆశిష్ నెహ్రా
కోల్‌కతా నైట్ రైడర్స్ కోల్‌కతా పశ్చిమ బెంగాల్ ఈడెన్ గార్డెన్స్ 2008 నితీష్ రాణా చంద్రకాంత్ పండిట్
లక్నో సూపర్ జెయింట్స్ లక్నో ఉత్తర ప్రదేశ్ BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం 2022 కేఎల్ రాహుల్ జస్టిన్ లాంగర్
ముంబై ఇండియన్స్ ముంబై మహారాష్ట్ర వాంఖెడే స్టేడియం 2008 రోహిత్ శర్మ మార్క్ బౌచర్
పంజాబ్ కింగ్స్ మొహాలి పంజాబ్ ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం 2008 శిఖర్ ధావన్ ట్రెవర్ బేలిస్
రాజస్థాన్ రాయల్స్ జైపూర్ రాజస్థాన్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం 2008 సంజు శాంసన్ కుమార్ సంగకర
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెంగళూరు కర్ణాటక ఎం. చిన్నస్వామి స్టేడియం 2008 ఫాఫ్ డు ప్లెసిస్ ఆండీ ఫ్లవర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 2013 ఐడెన్ మార్క్రామ్ డేనియల్ వెట్టోరి

పనిచేయని జట్లు

[మార్చు]
జట్టు నగరం రాష్ట్రం హోమ్ గ్రౌండ్ అరంగేట్రం రద్దు చేయబడింది యజమాని(లు)
డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తెలంగాణ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 2008 2012
  • టి.వెంకట్రామ్ రెడ్డి
  • గాయత్రి రెడ్డి
కొచ్చి టస్కర్స్ కేరళ కొచ్చి కేరళ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం 2011 2011
  • కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్
పూణే వారియర్స్ ఇండియా పూణే మహారాష్ట్ర మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 2011 2013
  • సుబ్రతా రాయ్
రైజింగ్ పూణె సూపర్ జెయింట్ పూణే మహారాష్ట్ర మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 2016 2018
  • సంజీవ్ గోయెంకా
గుజరాత్ లయన్స్ రాజ్‌కోట్ గుజరాత్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 2016 2018
  • కేశవ్ బన్సాల్

కాలక్రమం

[మార్చు]

టోర్నమెంట్ సీజన్‌లు, ఫలితాలు

[మార్చు]

టైటిల్ వారీగా ఐపీఎల్‌లో ప్రదర్శన

[మార్చు]
జట్టు టైటిళ్ళ

సంఖ్య

ద్వితీయ

స్థానాల సంఖ్య

గెలిచిన సీజన్లు రన్నరప్ సీజన్లు ఆడిన సీజన్ల

సంఖ్య

చెన్నై సూపర్ కింగ్స్ 5 5 2010, 2011, 2018, 2021, 2023 2008, 2012, 2013, 2015, 2019 14
ముంబై ఇండియన్స్ 1 2013, 2015, 2017, 2019, 2020 2010 16
కోల్‌కతా నైట్ రైడర్స్ 2 2012, 2014 2021 16
రాజస్థాన్ రాయల్స్ 1 2008 2022 14
సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016 2018 11
గుజరాత్ టైటాన్స్ 2022 2023 2
డెక్కన్ ఛార్జర్స్ 2009 5
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3 2009, 2011, 2016 16
పంజాబ్ కింగ్స్ 1 2014
ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) 2020
రైజింగ్ పూణే సూపర్ జెయింట్ 2017 2

ఐపీఎల్ సీజన్ ఫలితాలు

[మార్చు]
సీజను విజేత గెలుపు మార్జిన్ రన్నరప్ ఫైనల్ వేదిక నగరం ప్రేక్షకులు జట్లు ప్లేయర్ ఆఫ్ ది సీరీస్
2008

వివరాలు
రాజస్థాన్ రాయల్స్
164/7 (20 overs)
Royals won by 3 wickets

Scorecard
చెన్నై సూపర్ కింగ్స్

163/5 (20 overs)
DY Patil Stadium Navi Mumbai 55,345 8[62] Shane Watson (RR)
2009

వివరాలు
Deccan Chargers

143/6 (20 overs)
Chargers won by 6 runs

Scorecard
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

137/9 (20 overs)
Wanderers Stadium Johannesburg 30,123 8[63] Adam Gilchrist (DC)
2010

వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్

168/5 (20 overs)
Super Kings won by 22 runs

Scorecard
ముంబై ఇండియన్స్

146/9 (20 overs)
DY Patil Stadium Navi Mumbai 55,836 8[64] Sachin Tendulkar (MI)
2011

వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్

205/5 (20 overs)
Super Kings won by 58 runs

Scorecard
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

147/8 (20 overs)
M. A. Chidambaram Stadium Chennai 49,637 10[65] Chris Gayle (RCB)
2012

వివరాలు
కోల్‌కతా నైట్ రైడర్స్

192/5 (19.4 overs)
Knight Riders won by 5 wickets

Scorecard
చెన్నై సూపర్ కింగ్స్

190/3 (20 overs)
48,955 9[66] Sunil Narine (KKR)
2013

వివరాలు
ముంబై ఇండియన్స్

148/9 (20 overs)
Indians won by 23 runs

Scorecard
చెన్నై సూపర్ కింగ్స్

125/9 (20 overs)
Eden Gardens Kolkata 61,619 9[67] Shane Watson (RR)
2014

వివరాలు
కోల్‌కతా నైట్ రైడర్స్

200/7 (19.3 overs)
Knight Riders won by 3 wickets

Scorecard
కింగ్స్ XI పంజాబ్

199/4 (20 overs)
M. Chinnaswamy Stadium Bengaluru 37,854 8[68] Glenn Maxwell (KXIP)
2015

వివరాలు
ముంబై ఇండియన్స్

202/5 (20 overs)
Indians won by 41 runs

Scorecard
చెన్నై సూపర్ కింగ్స్

161/8 (20 overs)
Eden Gardens Kolkata 67,000 8[69] Andre Russell (KKR)
2016

వివరాలు
Sunrisers Hyderabad

208/7 (20 overs)
Sunrisers won by 8 runs

Scorecard
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

200/7 (20 overs)
M. Chinnaswamy Stadium Bengaluru 38,468 8[70] Virat Kohli (RCB)
2017

వివరాలు
ముంబై ఇండియన్స్

129/8 (20 overs)
Indians won by 1 run

Scorecard
Rising Pune Supergiant

128/6 (20 overs)
Rajiv Gandhi International Cricket Stadium Hyderabad 54,158 8[71] Ben Stokes (RPSG)
2018

వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్

181/2 (18.3 overs)
Super Kings won by 8 wickets

Scorecard
Sunrisers Hyderabad

178/6 (20 overs)
Wankhede Stadium Mumbai 33,415 8[72] Sunil Narine (KKR)
2019

వివరాలు
ముంబై ఇండియన్స్

149/8 (20 overs)
Indians won by 1 run

Scorecard
చెన్నై సూపర్ కింగ్స్

148/7 (20 overs)
Rajiv Gandhi International Cricket Stadium Hyderabad 53,560 8[73] Andre Russell (KKR)
2020

వివరాలు
ముంబై ఇండియన్స్

157/5 (18.4 overs)
Indians won by 5 wickets

Scorecard
ఢిల్లీ క్యాపిటల్స్

156/7 (20 overs)
Dubai International Cricket Stadium Dubai 00 8[74] Jofra Archer (RR)
2021

వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్

192/3 (20 overs)
Super Kings won by 27 runs

Scorecard
కోల్‌కతా నైట్ రైడర్స్

165/9 (20 overs)
18,453 8[75] Harshal Patel (RCB)
2022

వివరాలు
గుజరాత్ టైటన్స్

133/3 (18.1 overs)
Titans Won by 7 wickets

Scorecard
రాజస్థాన్ రాయల్స్

130/9 (20 overs)
Narendra Modi Stadium, Ahmedabad 101,566 10[76] Jos Buttler (RR)
2023

వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్

171/5 (15 overs)
Super Kings won by 5 wickets (DLS method) గుజరాత్ టైటన్స్

214/4 (20 overs)
104,859 10 Shubman Gill (GT)

జట్ల ప్రదర్శనలు

[మార్చు]
సీజను

(జట్ల సంఖ్య)
2008

(8)
2009

(8)
2010

(8)
2011

(10)
2012

(9)
2013

(9)
2014

(8)
2015

(8)
2016

(8)
2017

(8)
2018

(8)
2019

(8)
2020

(8)
2021

(8)
2022

(10)
2023

(10)
రాజస్థాన్ రాయల్స్ మొదటి 6వ 7వ 6వ 7వ 3వ 5వ 4వ Suspended 4వ 7వ 8వ 7వ 2వ 5వ
చెన్నై సూపర్ కింగ్స్ 2వ 4వ మొదటి మొదటి 2వ 2వ 3వ 2వ Suspended మొదటి 2వ 7వ మొదటి 9వ మొదటి
కోల్‌కతా నైట్ రైడర్స్ 6వ 8వ 6వ 4వ మొదటి 7వ మొదటి 5వ 4వ 3వ 3వ 5వ 5వ 2వ 7వ 7వ
ముంబై ఇండియన్స్ 5వ 7వ 2వ 3వ 4వ మొదటి 4వ మొదటి 5వ మొదటి 5వ మొదటి మొదటి 5వ 10వ 3వ
ఢిల్లీ క్యాపిటల్స్ / ఢిల్లీ డేర్ డెవిల్స్ 4వ 3వ 5వ 10వ 3వ 9వ 8వ 7వ 6వ 6వ 8వ 3వ 2వ 3వ 5వ 9వ
పంజాబ్ కింగ్స్/ కింగ్స్ XI పంజాబ్ 3వ 5వ 8వ 5వ 6వ 6వ 2వ 8వ 8వ 5వ 7వ 6వ 6వ 6వ 6వ 8వ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7వ 2వ 3వ 2వ 5వ 5వ 7వ 3వ 2వ 8వ 6వ 8వ 4వ 4వ 3వ 6వ
సన్‌రైజర్స్ హైదరాబాద్ - 4వ 6వ 6వ మొదటి 4వ 2వ 4వ 3వ 8వ 8వ 10వ
గుజరాత్ టైటాన్స్ - మొదటి 2వ
లక్నో సూపర్ జెయింట్స్ - 4వ 4వ
డెక్కన్ ఛార్జర్స్† 8వ మొదటి 4వ 7వ 8వ -
సహారా పూణే వారియర్స్ / పూణే వారియర్స్ ఇండియా† - 9వ 9వ 8వ -
కొచ్చి టస్కర్స్ కేరళ† - 8వ -
గుజరాత్ లయన్స్† - 3వ 7వ -
రైజింగ్ పూణే సూపర్‌జెయింట్† - 7వ 2వ -

రికార్డులు, గణాంకాలు

[మార్చు]

ఇండియన్ ప్రీమియర్ లీగ్ రికార్డుల జాబితా ఇక్కడ ఉంది.

బ్యాటింగ్ రికార్డులు
అత్యధిక పరుగులు విరాట్ కోహ్లీ (RCB) 7,263
అత్యధిక సగటు డెవాన్ కాన్వే (CSK) 48.63
అత్యధిక స్కోరు క్రిస్ గేల్ (RCB) 175* vs పూణే వారియర్స్ ఇండియా (ఏకానా)
అత్యధిక భాగస్వామ్యం క్వింటన్ డి కాక్ & KL రాహుల్ (LSG) 210* vs కోల్‌కతా నైట్ రైడర్స్ (ఏకానా)
అత్యధిక సంఖ్యలో సిక్సర్లు క్రిస్ గేల్ (KKR/RCB/PBKS) 357
అత్యధిక సంఖ్యలో ఫోర్లు శిఖర్ ధావన్ (DD/MI/DC/SRH/PBKS) 750
అత్యధిక సంఖ్యలో వందలు విరాట్ కోహ్లీ (RCB) 7
అత్యధికంగా యాభైలు డేవిడ్ వార్నర్ (DD/SRH) 65
బౌలింగ్ రికార్డులు
అత్యధిక వికెట్లు యుజ్వేంద్ర చాహల్ (MI/RCB/RR) 187
అత్యల్ప సగటు లసిత్ మలింగ (MI) 19.79
అత్యుత్తమ స్ట్రైక్ రేట్ లుంగీ ఎన్గిడి (CSK) 12.9
ఉత్తమ ఆర్థిక రేటు రషీద్ ఖాన్ (SRH/GT) 6.49
అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు అల్జారీ జోసెఫ్ (MI) 6/12 vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఏకానా)
ఫీల్డింగ్
అత్యధిక అవుట్‌లు ( వికెట్ కీపర్ ) MS ధోని (CSK/RPS) 180
అత్యధిక స్టంపింగ్‌లు ( వికెట్ కీపర్ ) MS ధోని (CSK/RPS) 42
అత్యధిక క్యాచ్‌లు ( వికెట్ కీపర్ ) MS ధోని (CSK/RPS) 138
అత్యధిక క్యాచ్‌లు ( ఫీల్డర్ ) సురేష్ రైనా (CSK/GL) 109
ఇతర రికార్డులు
అత్యధిక మ్యాచ్‌లు MS ధోని (CSK/RPS) 250
కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు MS ధోని (CSK/RPS) 226
కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు గెలిచినది MS ధోని (CSK/RPS) 133
జట్టు రికార్డులు
అత్యధిక మొత్తం సన్ రైజర్స్ హైదరాబాద్ 277/3 (20) vs ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)
అత్యల్ప మొత్తం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 49 (9.4) vs కోల్‌కతా నైట్ రైడర్స్ (ఏకానా)

బ్రాండ్ విలువ

[మార్చు]
బ్రాండ్ విలువ
జట్టు సంవత్సరం
2023 2022 2021
బ్రాండ్ విలువ Ref బ్రాండ్ విలువ Ref బ్రాండ్ విలువ Ref
ముంబై ఇండియన్స్ 9,962 crore (US$1.2 billion) [77] $83M [78] [79] [77] $80M [78]
కోల్‌కతా నైట్ రైడర్స్ 8,428 crore (US$1.1 billion) $77M $66M
చెన్నై సూపర్ కింగ్స్ 8,811 crore (US$1.1 billion) $74M $76M
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7,853 crore (US$983.5 million) $68M $50M
ఢిల్లీ క్యాపిటల్స్ 7,930 crore (US$993.1 million) $62M $56M
రాజస్థాన్ రాయల్స్ 7,662 crore (US$959.5 million) $61M $34M
సన్‌రైజర్స్ హైదరాబాద్ 7,432 crore (US$930.7 million) $49M $52M
గుజరాత్ టైటాన్స్ 6,512 crore (US$815.5 million) $47M N/A
పంజాబ్ కింగ్స్ 7,087 crore (US$887.5 million) $45M $36M
లక్నో సూపర్ జెయింట్స్ 8,236 crore (US$1.0 billion) $32M N/A

మైదానాలు

[మార్చు]

ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడానికి మొత్తం 18 మైదానాలు ఉపయోగించబడ్డాయి.

స్టేడియం పేరు సామర్థ్యం నగరం హోమ్ జట్టు
Current Grounds
అరుణ్ జైట్లీ స్టేడియం 41,842 ఢిల్లీ ఢిల్లీ రాజధానులు
ఈడెన్ గార్డెన్స్ 66,000 కోల్‌కతా కోల్‌కతా నైట్ రైడర్స్
ఎకానా క్రికెట్ స్టేడియం 50,000 లక్నో లక్నో సూపర్ జెయింట్స్
ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం 27,000 మొహాలి పంజాబ్ కింగ్స్
M. A. చిదంబరం స్టేడియం 50,000 చెన్నై చెన్నై సూపర్ కింగ్స్
ఎం. చిన్నస్వామి స్టేడియం 50,000 బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
నరేంద్ర మోదీ స్టేడియం 132,000 అహ్మదాబాద్ గుజరాత్ టైటాన్స్
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 55,000 హైదరాబాద్ Sunrisers Hyderabad

Deccan Chargers
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం 30,000 జైపూర్ రాజస్థాన్ రాయల్స్
వాంఖడే స్టేడియం 32,000 ముంబై ముంబై ఇండియన్స్
సెకండరీ గ్రౌండ్స్
అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 50,000 గౌహతి రాజస్థాన్ రాయల్స్
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 23,000 ధర్మశాల పంజాబ్ కింగ్స్
మాజీ గ్రౌండ్స్
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 37,000 పూణే చెన్నై సూపర్ కింగ్స్

Rising Pune Supergiant

Pune Warriors India

కింగ్స్ XI పంజాబ్
హోల్కర్ క్రికెట్ స్టేడియం 30,000 ఇండోర్ కింగ్స్ XI పంజాబ్

Kochi Tuskers Kerala
గ్రీన్ పార్క్ స్టేడియం 33,000 కాన్పూర్ గుజరాత్ లయన్స్
సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 28,000 రాజ్‌కోట్ గుజరాత్ లయన్స్
షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం 50,000 రాయ్పూర్ ఢిల్లీ డేర్ డెవిల్స్
ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 38,000 విశాఖపట్నం ముంబై ఇండియన్స్

Rising Pune Supergiants

Sunrisers Hyderabad

Deccan Chargers
JSCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 39,000 రాంచీ చెన్నై సూపర్ కింగ్స్

కోల్‌కతా నైట్ రైడర్స్
బారాబతి స్టేడియం 45,000 కటక్ Sunrisers Hyderabad

Deccan Chargers
డివై పాటిల్ స్టేడియం 55,000 నవీ ముంబై Pune Warriors India

Deccan Chargers

ముంబై ఇండియన్స్
జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం 60,000 కొచ్చి కొచ్చి టస్కర్స్ కేరళ
బ్రబౌర్న్ స్టేడియం 20,000 ముంబై ముంబై ఇండియన్స్
విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ 40,000 నాగ్‌పూర్ డెక్కన్ ఛార్జర్స్

ప్రసారకుల జాబితా

[మార్చు]

జూన్ 2022 మీడియా-హక్కుల వేలంలో, స్కై స్పోర్ట్స్, వయాకామ్18 UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో ప్రసార హక్కులను పొందగా, టైమ్స్ ఇంటర్నెట్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, అమెరికా హక్కులను పొందింది. [80]

భూభాగం ఛానెల్‌లు, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంవత్సరాలు
భారతదేశం స్టార్ స్పోర్ట్స్ 2023–2027 [81]
జియో సినిమా (ఇంటర్నెట్) 2023–2027 [82]
బంగ్లాదేశ్ T స్పోర్ట్స్, GTV 2022 [83]
T స్పోర్ట్స్ యాప్ 2023
ఆఫ్ఘనిస్తాన్ అరియానా టెలివిజన్ నెట్‌వర్క్ 2022 [84]
ఆఫ్రికా సూపర్‌స్పోర్ట్ 2023
ఆస్ట్రేలియా కయో స్పోర్ట్స్, ఫాక్స్ స్పోర్ట్స్ ఫాక్స్‌టెల్ (ఇంటర్నెట్) 2023 [81]
ఇండోనేషియా వీడియో (ఇంటర్నెట్) 2023–ప్రస్తుతం [85]
ఐర్లాండ్ స్కై స్పోర్ట్స్, DAZN 2023–ప్రస్తుతం
యునైటెడ్ కింగ్‌డమ్
మధ్యప్రాచ్యం టైమ్స్ ఇంటర్నెట్ 2023 [81]
ఉత్తర ఆఫ్రికా:
  • అల్జీరియా
  • ఈజిప్ట్
  • లిబియా
  • మొరాకో
  • ట్యునీషియా
  • మౌరిటానియా
  • సూడాన్
2023[81]
న్యూజిలాండ్ స్కై స్పోర్ట్ 2021–ప్రస్తుతం
దక్షిణ ఆఫ్రికా సూపర్‌స్పోర్ట్ 2023 [81]
సబ్-సహారా ఆఫ్రికా సూపర్‌స్పోర్ట్ 2021–ప్రస్తుతం
అమెరికా విల్లో టీవీ 2023 [81]

అంతర్జాతీయ క్రికెట్‌పై ప్రతికూల ప్రభావం

[మార్చు]

ఈ రోజుల్లో ఆటగాళ్లు భారత జట్టుకు ఆడటం లేదు గానీ, IPL లో మాత్రం అన్ని ఆటలనూ ఆడుతున్నారు అని కపిల్ దేవ్ అన్నాడు. ఈ లీగ్ కారణంగా భారత ఆటగాళ్లకు గాయాలు ఎక్కువయ్యాయని అతను పేర్కొన్నాడు. [86]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "How can the IPL become a global sports giant?". ESPNcricinfo. 28 June 2018. Archived from the original on 7 February 2021. Retrieved 20 February 2019.
  2. "IPL now has window in ICC Future Tours Programme". ESPNcricinfo. 12 December 2017. Archived from the original on 20 April 2022. Retrieved 20 February 2019.
  3. Barrett, Chris. "Big Bash League jumps into top 10 of most attended sports leagues in the world". The Sydney Morning Herald. Archived from the original on 4 May 2021. Retrieved 20 February 2019.
  4. "IPL matches to be broadcast live on Youtube". ESPNcricinfo. Archived from the original on 11 February 2021. Retrieved 20 February 2019.
  5. Hoult, Nick (20 January 2010). "IPL to broadcast live on YouTube". The Telegraph UK. Archived from the original on 11 January 2022. Retrieved 20 February 2019.
  6. Balakrishnan, Ravi; Bapna, Amit (5 October 2016). "War of leagues: With IPL & ISL, is India emerging as a sporting nation?". The Economic Times.
  7. "From IPL to ISL, sports leagues in India to watch out for". 26 September 2021.
  8. Bhatnagar, Sanskriti (2022-08-02). "How Tamil Nadu Premier League became a feeder series for IPL". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-20.
  9. "Big cash..." Inside sports.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  10. "Move over IPL, the Indian rural cricket league is here". Hindustan Times (in ఇంగ్లీష్). 2015-04-12. Retrieved 2023-07-25.
  11. December 2022, Cricket World Wednesday 21. "IPL valuation jumps 75% to USD 10.9 billion in 2022". Cricket World. Archived from the original on 24 December 2022. Retrieved 2022-12-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  12. "IPL 2015 contributed Rs. 11.5 bn to GDP: BCCI". The Hindu. IANS. 30 October 2015. Archived from the original on 19 June 2016. Retrieved 20 February 2019.
  13. Faruooqi, Javed (December 21, 2022). "IPL crosses $10 billion valuation to become a decacorn: D and P Advisory". Economic Times. Archived from the original on 23 March 2023. Retrieved March 22, 2023.
  14. "IPL 2023 Finals: JioCinema breaks world record with over 3.2 crore viewers during CSK vs GT final". 30 May 2023.
  15. "IPL media rights BCCI hits a six while star India and Viacom18 scramble for the ball". Financial Express. 20 June 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. "IPL media rights at ₹104 million IPL..." Times of India. 14 June 2022.{{cite news}}: CS1 maint: url-status (link)
  17. Scroll Staff (2023-05-30). "IPL 2023: As Chennai Super Kings clinch record-equalling fifth title, a look at the list of winners". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-26.
  18. "ICL announces team lists". Rediff. 14 November 2007. Archived from the original on 3 March 2016. Retrieved 20 February 2019.
  19. Press Trust of India (13 June 2007). "BCCI shoots down ICL". Rediff.com. Archived from the original on 18 December 2007. Retrieved 20 February 2019.
  20. Press Trust of India (21 June 2007). "BCCI hikes domestic match fees". Rediff.com. Archived from the original on 2 June 2021. Retrieved 20 February 2019.
  21. 21.0 21.1 21.2 21.3 "Indian Premier League: How it all started". The Times of India. 2 April 2013. Archived from the original on 12 September 2018. Retrieved 20 February 2019.
  22. 22.0 22.1 22.2 Alter, Jamie (13 September 2007). "Franchises for board's new Twenty20 league". ESPNcricinfo. Archived from the original on 13 May 2021. Retrieved 17 February 2019.
  23. Bull, Andy (11 January 2021). "Raw talent plus IPL cash point to an era of Indian dominance on cricket's world stage". The Guardian. Archived from the original on 27 April 2021.
  24. "Big business and Bollywood grab stakes in IPL". ESPNcricinfo. 24 January 2008. Archived from the original on 18 April 2021. Retrieved 20 February 2019.
  25. "Indian players told to shun new 10-over tournament". Stabroek News (in అమెరికన్ ఇంగ్లీష్). 2009-07-09. Retrieved 2023-06-26.
  26. "Biggest Innovation: Everyone wants a piece of the IPL". Business Today (in ఇంగ్లీష్). 2014-05-07. Retrieved 2023-06-26.
  27. "'Franchises don't want to risk Pakistan players' security in IPL'". The Economic Times. Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.
  28. "Shuja Pasha admitted ISI's role in Mumbai attack: ex-CIA chief". The Hindu. 23 February 2016. Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022 – via www.thehindu.com.
  29. 29.0 29.1 Ravindran, Siddarth; Gollapudi, Nagraj (21 March 2010). "Pune and Kochi unveiled as new IPL franchises". www.espncricinfo.com. Archived from the original on 9 June 2021. Retrieved 20 February 2019.
  30. "Kochi franchise terminated by BCCI". www.espncricinfo.com. 19 September 2011. Archived from the original on 10 August 2021. Retrieved 20 February 2019.
  31. "BCCI terminates Deccan Chargers franchise". www.espncricinfo.com. 14 September 2012. Archived from the original on 8 December 2021. Retrieved 20 February 2019.
  32. "Sun TV Network win Hyderabad IPL franchise". ESPN CricInfo. 25 October 2012. Archived from the original on 16 September 2018. Retrieved 20 February 2019.
  33. "Hyderabad IPL franchise named Sunrisers". ESPNcricinfo. 18 December 2012. Archived from the original on 26 January 2021. Retrieved 20 February 2019.
  34. "Pune Warriors pull out of IPL". ESPNcricinfo. 21 May 2013. Archived from the original on 13 August 2021. Retrieved 20 February 2019.
  35. K Shriniwas Rao (27 October 2013). "BCCI terminates contract with Sahara, Pune Warriors out of IPL". The Times of India. TNN. Archived from the original on 12 September 2018. Retrieved 20 February 2019.
  36. "IPL scandal: Chennai Super Kings and Rajasthan Royals suspended". BBC News. 14 July 2015. Archived from the original on 23 January 2019. Retrieved 20 February 2019.
  37. "Pune, Rajkot to host new IPL franchises". ESPN CricInfo. 8 December 2015. Archived from the original on 20 May 2016. Retrieved 20 February 2019.
  38. "IPL announce two new teams for 2016". cricket.com.au. Archived from the original on 15 October 2019. Retrieved 19 October 2022.
  39. "IPL 2020 in UAE: From new match timings to coronavirus replacements approved by Governing Council – 10 points". India Today (in ఇంగ్లీష్). 2 August 2020. Archived from the original on 2 August 2020. Retrieved 3 August 2020.
  40. Karhadkar, Amol (2 August 2020). "IPL 2020: Final on November 10, 24-player limit for each squad". Sportstar (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2020. Retrieved 3 August 2020.
  41. Gollapudi, Nagraj (31 August 2021). "IPL to become 10-team tournament from 2022". Cricinfo. Archived from the original on 20 September 2021. Retrieved 21 September 2021.
  42. Tagore, Vijay (14 September 2021). "New IPL team auction likely on October 17 through closed bids". Cricbuzz. Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  43. "RPSG, CVC Capital win bids for Lucknow, Ahmedabad IPL teams". Cricbuzz. 25 October 2021. Archived from the original on 25 October 2021. Retrieved 25 October 2021.
  44. "Lucknow and Ahmedabad become home to the two newest IPL franchises". ESPNcricinfo. Archived from the original on 25 October 2021. Retrieved 25 October 2021.
  45. "IPL..." WION.{{cite web}}: CS1 maint: url-status (link)
  46. "Indian Premier League Official Website". www.iplt20.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 April 2023. Retrieved 2023-04-09.
  47. Acharya, Shayan (2022-10-18). "Led by President Roger Binny, meet BCCI's new team". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). Archived from the original on 7 February 2023. Retrieved 2023-02-07.
  48. "BCCI AGM: Roger Binny elected BCCI president, takes over from Sourav Ganguly; Arun Dhumal appointed IPL chairman". Zee Business. 2022-10-18. Archived from the original on 7 February 2023. Retrieved 2023-02-07.
  49. "IPL Auction". IPLT20 website.
  50. "Kolkata to host IPL 2020 auction on December 19". Archived from the original on 3 April 2022. Retrieved 15 October 2019.
  51. "Instances in IPL when team played less than 4 overseas players". CricTracker. 5 May 2016. Archived from the original on 7 July 2018. Retrieved 20 February 2019.
  52. "Player regulations for IPL 2014". ESPNcricinfo. 24 December 2013. Archived from the original on 30 June 2022. Retrieved 20 February 2019.
  53. "IPL longlist features 651 uncapped players". ESPNcricinfo. 30 January 2014. Archived from the original on 6 February 2023. Retrieved 20 February 2019.
  54. "Australia stars in contrast dispute after Cricket Australia makes IPL cash grab". Fox Sports. 7 September 2010. Archived from the original on 15 November 2022. Retrieved 15 November 2022.
  55. "IPL cricketers world's No.2 sports earners". Emirates 24/7. 21 May 2015. Archived from the original on 3 April 2019. Retrieved 20 February 2019.
  56. Staff, The Wire (2023-05-02). "IPL Cricketers Get Only 18% of Revenue as Wages, Must Be 'Paid Fairly': International Federation". The Wire. Retrieved 2023-05-03.
  57. Wigmore, Tim (2023-03-29). "Think IPL players are well paid? They should be paid three times more". The Daily Telegraph. Retrieved 2023-05-03.
  58. Wigmore, Tim (2023-05-01). "IPL cricketers should be paid fairly and proportionately, says players' union". The Daily Telegraph. Retrieved 2023-05-03.
  59. Livemint (2022-05-29). "IPL final 2022: Prize money and all other awards. All you need to know". mint (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.
  60. Bureau, ABP News (2022-05-29). "IPL 2022 Final Prize Money: All You Need To Know About Prize Money, Other Awards". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.
  61. Amrit Mathur (22 April 2013). "IPL-onomics: where Indian players call the shots". ESPNcricinfo. Archived from the original on 6 February 2023. Retrieved 6 February 2023.
  62. "IPL 2008 season squads". ESPNcricinfo. Archived from the original on 26 January 2019. Retrieved 20 February 2019.
  63. "IPL 2009 season squads". ESPNcricinfo. Archived from the original on 27 January 2019. Retrieved 20 February 2019.
  64. "IPL 2010 season squads". ESPNcricinfo. Archived from the original on 21 April 2019. Retrieved 20 February 2019.
  65. "IPL 2011 season squads". ESPNcricinfo. Archived from the original on 24 February 2019. Retrieved 20 February 2019.
  66. "IPL 2012 season squads". ESPNcricinfo. Archived from the original on 17 February 2019. Retrieved 20 February 2019.
  67. "IPL 2013 season squads". ESPNcricinfo. Archived from the original on 17 February 2019. Retrieved 20 February 2019.
  68. "IPL 2014 season squads". ESPNcricinfo. Archived from the original on 19 February 2019. Retrieved 20 February 2019.
  69. "IPL 2015 season squads". ESPNcricinfo. Archived from the original on 17 February 2019. Retrieved 20 February 2019.
  70. "IPL 2016 season squads". ESPNcricinfo. Archived from the original on 13 December 2018. Retrieved 20 February 2019.
  71. "IPL 2017 Squads". ESPNcricinfo. Archived from the original on 17 February 2019. Retrieved 20 February 2019.
  72. "IPL 2018 Squads". ESPNcricinfo. Archived from the original on 1 March 2019. Retrieved 20 February 2019.
  73. "IPL 2019 season squads". ESPNcricinfo. Archived from the original on 6 February 2019. Retrieved 20 February 2019.
  74. "IPL 2020/21 squads". ESPN Cricinfo. Archived from the original on 27 October 2020. Retrieved 20 September 2020.
  75. "IPL 2021 squads". ESPN Cricinfo. Archived from the original on 15 April 2021. Retrieved 15 April 2021.
  76. "IPL 2022 squads". ESPN Cricinfo. Archived from the original on 17 May 2022. Retrieved 18 May 2022.
  77. 77.0 77.1 Ozanian, Mike. "Indian Premier League Valuations: Cricket Now Has A Place Among World's Most Valuable Sports Teams". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2023-04-18.
  78. 78.0 78.1 "IPL 2022 | Brand Value Ranking League Table | Brandirectory". brandirectory.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-18.
  79. "IPL brand value surges 77%; Mumbai Indians tops table". Moneycontrol. 22 December 2022. Retrieved 2023-04-18.
  80. "It's a deal! - Everything you need to know about final IPL media rights figures". The Times of India. 15 June 2022. Archived from the original on 21 September 2022. Retrieved 14 February 2023.
  81. 81.0 81.1 81.2 81.3 81.4 81.5 Frater, Patrick; Ramachandran, Naman (14 June 2022). "India Media Landscape Redrawn as Viacom18, Disney Carve up $6.2 Billion IPL Cricket Rights". Variety. Archived from the original on 18 August 2022. Retrieved 18 August 2022.
  82. "IPL Auction 2023: Check venue, time and live streaming details here".
  83. "Log into Facebook". Facebook (in ఇంగ్లీష్). Retrieved 2023-05-09. {{cite web}}: Cite uses generic title (help)
  84. "Afghans welcome ATN's move to secure broadcasting rights for this year's IPL | Ariana News". 22 March 2022. Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
  85. Vidio. "Liga kriket terbaik di dunia hadir di Vidio!" [The best cricket league in the world comes to Vidio!]. Twitter (in ఇండోనేషియన్). Retrieved 10 April 2023.
  86. "बुमराहवर आपण वेळ वाया घालवतोय, क. देव यांचं धक्कादायक विधान". Lokmat. 31 July 2023.

గమనికలు

[మార్చు]


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు