టాటా గ్రూప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టాటా గ్రూప్
Typeప్రైవేట్
పరిశ్రమConglomerate
స్థాపన1868; 156 సంవత్సరాల క్రితం (1868)
Foundersజమ్‌షెడ్జీ టాటా
ప్రధాన కార్యాలయంబాంబే హౌస్, ముంబై, మహారాష్ట్ర, ఇండియా
Areas served
Worldwide
Key people
Products
RevenueIncreaseUS$103 billion[2] (FY 2021)
OwnerTata Sons (100%)
Number of employees
800,000[2] (FY 2021)
SubsidiariesList of entities associated with Tata Group
Websiteమూస:Officialsite

టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్  (The Tata Group ) జమ్‌షెడ్జీ టాటా(జమ్‌షెడ్జీ నుసర్వాన్జీ టాటా) చే 1868 సంవత్సర లో స్థాపించబడిన భారతదేశం లోని   పూర్వ కంపెనీ లలో ఒకటి. ఈ సంస్థను ఆరు ఖండాలలో 100కు పైగా దేశాల్లో 2,46,000 మంది ఉద్యోగులతో కంపెనీ తన  కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీస్ కు  రెండు మిలియన్లకు పైగా వాటాదారులు, సుమారు  విలువ  $ 57.7 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నాయి. ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న టాటా గ్రూప్ రసాయనాలు , వినియోగ దారుల ఉత్పత్తులు , ఎనర్జీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సర్వీసెస్ మొదలైన వాటితో సహా అనేక ప్రాథమిక వ్యాపార రంగాలను నిర్వహిస్తోంది.[3]

చరిత్ర[మార్చు]

1868లో జంషెడ్జీ టాటా స్థాపించిన ఈ సంస్థ అనేక అంతర్జాతీయ కంపెనీలను కొనుగోలు చేసిన తరువాత అంతర్జాతీయ గుర్తింపును పొందింది[4]. ప్రతి ఒక్క  టాటా కంపెనీ దాని స్వంత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల, వాటాదారుల మార్గదర్శకత్వం, పర్యవేక్షణలో స్వతంత్రంగా పనిచేస్థాయి[5] . టాటా గ్రూప్ స్థాపకుడిగా గుర్తింపు పొందిన జంషెట్జీ టాటాను కొన్నిసార్లు 'భారతీయ పరిశ్రమ పితామహుడు' గా భావిస్తారు. [6]

అభివృద్ధి[మార్చు]

జంషెట్జీ టాటా 1868 లో టాటా గ్రూపును ఒక ప్రైవేట్ ట్రేడింగ్ సంస్థగా స్థాపించారు. 1902 సంవత్సరంలో, ఈ బృందం తాజ్ మహల్ ప్యాలెస్ & టవర్ ను ముంబై లో ప్రారంభించడానికి ఇండియన్ హోటల్స్ కంపెనీని ఏర్పాటు చేసింది, ఈ హోటల్  దేశంలో మొట్టమొదటి లగ్జరీ హోటల్.[7] 1904లో జంషెట్జీ టాటా మరణించగా, ఆయన కుమారుడు సర్ దొరబ్ టాటా కంపెనీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి, అతని నాయకత్వంలో, ఈ సమూహం వేగంగా పురోగమించి, ఉక్కు (1907), విద్యుత్ (1910), విద్య (1911), వినియోగ వస్తువులు (1917),  విమానయానం (1932) వంటి వివిధ పరిశ్రమ విభాగాల్లోకి ప్రవేశించింది.1932లో దొరబ్ మరణం,  సర్ నౌరోజీ సక్లత్ వాలా  పదవి భాద్యతలు, ఆరేళ్ల తర్వాత జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాడు. అతని నాయకత్వం లో రసాయనాల పరిశ్రమ  (1939), కాస్మోటిక్స్ పరిశ్రమ  (1952), మార్కెటింగ్, ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ (1954), తేయాకు పరిశ్రమ (1962) సాఫ్ట్ వేర్ సర్వీసెస్ (1968)లతో సహా అనేక కొత్త పారిశ్రామిక  రంగాలపై కంపెనీ తన విస్తరణను చేపట్టడం జరిగింది. 1945 సంవత్సరంలో, టాటా గ్రూప్ టాటా ఇంజనీరింగ్, లోకోమోటివ్ కంపెనీని స్థాపించడం(, దీనిని 2003 సంవత్సరంలో టాటా మోటార్స్ గా పేరు మార్చారు). ఈ సంస్థ ఇంజనీరింగ్, లోకోమోటివ్ ఉత్పత్తులను చేస్తుంది. 1991లో జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా (జె.ఆర్.డి.టాటా) తరువాత ఆయన మేనల్లుడు రతన్ టాటా బాధ్యతలు స్వీకరించాడు. అతడు  వ్యాపారాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టి, ఈ గ్రూప్ 2000 సంవత్సరంలో లో లండన్ కు చెందిన టెట్లీ టీని కొనుగోలు, 2004 సంవత్సరం లో దక్షిణ కొరియాకు చెందిన డేవూ మోటార్స్  ట్రక్కు తయారీ కార్యకలాపాలను కొనుగోలు, 2001లో టాటా-ఎఐజి అనే బీమా కంపెనీని స్థాపించడానికి , ఈ గ్రూపు అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్, తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.[3]

ప్రగతి ( 2007- 2022)[మార్చు]

ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలో, టాటా గ్రూప్ వ్యూహాత్మక సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టిఎఎస్ఎల్), 2007 లో స్థాపించబడింది, ఇది రక్షణ రంగములో దేశీయ అభివృద్ధి, కీలకమైన ఏరోస్పేస్, రక్షణ పరిష్కారాల తయారీని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వమునకు సహకారం అందిస్తుంది. మౌలిక సదుపాయాల పరిశ్రమలో, టాటా గ్రూప్ భారతదేశం అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ టాటా పవర్ ను కలిగి ఉంది, అంతేకాకుండా ఈ పోర్ట్ ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి టాటా హౌసింగ్, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్, టాటా ప్రాజెక్ట్స్ , టాటా రియాల్టీ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లను కలిగి ఉంది. రిటైల్, కన్స్యూమర్ పరిశ్రమలలో టాటా గ్రూపుకు టాటా కెమికల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, వోల్టాస్, ట్రెంట్ , ఇన్ఫినిటీ రిటైల్ ఉన్నాయి, ఇది విభిన్న రకాల ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. టెలికాం, మీడియా పరిశ్రమలో, టాటా గ్రూప్ టాటా కమ్యూనికేషన్స్, టాటా ప్లే , టాటా టెలిసర్వీసెస్ ద్వారా తన వ్యాపారాలను విస్తరించింది.[8]

2007లో టాటా గ్రూప్ ఆంగ్లో-డచ్ ఉక్కు తయారీ సంస్థ కోరస్ గ్రూప్ ను కొనుగోలు చేసి, ఒక భారతీయ కంపెనీ అతిపెద్ద కార్పొరేట్ టేకోవర్ ను పూర్తి చేసింది. తర్వాత  ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రవేశించి. జనవరి 10, 2008న, టాటా మోటార్స్ నానో,  వాహన తయారీని ప్రారంభించి, జూలై 2009లో, మొదటి నానో భారతదేశంలో మార్కెట్ లోనికి వచ్చింది. టాటా మోటార్స్ 2008 సంవత్సరం లో ఫోర్డ్ మోటార్ కంపెనీ నుండి ఎలైట్ బ్రిటిష్ బ్రాండ్స్  జాగ్వార్- ల్యాండ్ రోవర్ ను కొనుగోలు చేసింది. నాలుగు సంవత్సరాల తరువాత రతన్ టాటా పదవీ విరమణ చేసి సైరస్ మిస్త్రీ తరువాత చైర్మన్ కావడం, వ్యాపార వ్యూహానికి సంబంధించి టాటా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మిస్త్రీని 2016 అక్టోబర్ లో చైర్మన్ పదవి నుంచి అకస్మాత్తుగా తొలగించి, రతన్ టాటా తాత్కాలిక  చైర్మన్  స్థానానికి తిరిగి వచ్చాడు . నటరాజన్ చంద్రశేఖరన్ ను ఈ పదవిలో నియమించడంతో రతన్ చైర్మన్ గా రెండోసారి 2017 సంవత్సరంలో  జనవరిలో ముగిసింది.

సెప్టెంబర్ 2017 సంవత్సరంలో  లో టాటా గ్రూప్ తన యూరోపియన్ ఉక్కు తయారీ కార్యకలాపాలను జర్మన్ ఉక్కు తయారీ సంస్థ థైస్సెన్ క్రుప్ తో విలీనం చేసే ప్రణాళికలను ప్రకటించింది. 2022లో టాటా గ్రూప్ 1932లో టాటా కుటుంబం స్థాపించిన ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది.[9]

సంక్షేమ- సేవా పథకాలు[మార్చు]

టాటా గ్రూప్  భారతీయుల ఉన్నత విద్య కోసం జెఎన్ టాటా ఎండోమెంట్ ను స్థాపించాడు. ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థలో  ముఖ్యమైన నిర్మాణకర్తలలో ఒకరిగా పరిగణించబడుతున్న జంషెట్జీ, మహిళా మిల్లు కార్మికుల పిల్లల కోసం అప్రెంటిస్ వ్యవస్థను, క్రెచెస్, ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టారు, ఉద్యోగులందరికీ ఉచిత వైద్య సహాయం. తన సిబ్బంది  శ్రేయస్సు కోసం, ప్రయోజనకరమైన వెంచర్ల విధానాలలో  ఉచిత పెన్షన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్, ప్రసూతి ప్రయోజన భత్యం,  ఉద్యోగులందరికీ ప్రమాదాలకు పరిహారం నిధి ఉన్నాయి. తన సంస్థ లో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమమే గాక ఇతర ట్రస్ట్ లను స్థాపించి వాటి ద్వారా ప్రజలందరికి ఉపయోగకరమైన ప్రయోజనాలను అందిస్తున్నారు. వాటిలో సర్ రతన్ టాటా ట్రస్ట్, 1919 లో స్థాపించబడిన సర్ రతన్ టాటా ట్రస్ట్ భారతదేశంలోని పురాతన దాతృత్వ సంస్థలలో ఒకటి, నవాజ్ బాయ్ రతన్ టాటా ట్రస్ట్ 1974లో సర్ రతన్ టాటా సతీమణి నవాజ్ బాయి జ్ఞాపకార్థం స్థాపించిన నవజ్ భాయ్ రతన్ టాటా ట్రస్ట్ సర్ రతన్ టాటా ట్రస్ట్ తో కలిసి గ్రాంట్లు మంజూరు చేయడానికి కలిసి పనిచేస్తుంది. టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, బాయి హీరాబాయి జేఎన్ టాటా నవ్సారి ఛారిటబుల్ ఇన్ స్టిట్యూషన్,సర్వజనిక్ సేవా ట్రస్ట్ మొదలైనవి ఉన్నాయి.[10]

విద్యా రంగము[మార్చు]

టాటా గ్రూప్ సంస్థ పారిశ్రామిక రంగాలలోనే గాక భారత దేశ విద్యా రంగ అభివృద్ధిలో తమవంతు సహాయ పడుతున్నాయి. ఈ సంస్థ ద్వారా దేశ పురోభివృద్హికి  ఉన్నత పరిశోధనలు జరగడానికి  గొప్ప విద్యా సంస్థలను స్థాపించడం, లేదా అత్యంత అట్టడుగు వర్గాలకు విద్యను దేశంలో  అందుబాటులోకి తీసుక  వచ్చింది. వాటిలో ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సైన్సెస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, నేషనల్ సెంటర్ ఫర్ ది పర్ఫామింగ్ ఆర్ట్స్ వంటి సంస్థలు స్టాఫించారు. ఇవిగాక గ్రామ ప్రాంతాలలో ప్రాథమిక విద్యాభివృద్ద్ధికి తోడ్పడుతున్నాయి[11].

.[12]    

మూలాలు[మార్చు]

  1. "Supreme Court stays NCLAT order restoring Cyrus Mistry as Tata Sons Executive Chairman". ET News. 11 January 2020. Retrieved 14 January 2020.
  2. 2.0 2.1 "Tata Group Business Overview". Tata Group.
  3. 3.0 3.1 Magazine, The CEO. "TATA GROUP- HISTORY, COMPANIES AND PHILOSOPHY". The CEO Magazine India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-13.
  4. "Tata Group | Details, Profile, Overview- Fincash". www.fincash.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-13.
  5. "Tata Sons | Tata group". www.tata.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-13.
  6. "Who was Jamsetji Tata? Everything You Need to Know". www.thefamouspeople.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-05-13.
  7. Trivedi, Vidushi (2016-06-29). "The History Of Mumbai's Taj Mahal Palace Hotel In 1 Minute". Culture Trip. Retrieved 2022-05-13.
  8. "Complete List Of All Companies Owned By The Tata Group After Air India Comeback". IndiaTimes (in Indian English). 2022-02-08. Retrieved 2022-05-13.
  9. "Tata Group | History, Companies, Subsidiaries, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-13.
  10. "About Tata Trusts". Tata Trusts (in ఇంగ్లీష్). Retrieved 2022-05-13.
  11. "Education | Tata and the community". www.tata.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-13.
  12. "Kohli Research Block Inaugurated". www.tcs.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-16. Retrieved 2022-05-13.