జె.ఆర్.డి.టాటా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జహంగీర్ రతన్ జీ దాదాభాయి టాటా
JRD TATA.jpg
జననం: (1904-07-29)జూలై 29, 1904
పారిస్, ఫ్రాన్సు
మరణం: 1993(1993-11-29) (వయసు 89)
జెనివా, స్విజర్లాండు
వృత్తి: పారిశ్రామికవేత్త
భర్త/భార్య: థెల్మా వికాజీ
వెబ్‌సైటు: www.tata.com

జె.ఆర్.డి.టాటా (జూలై 29, 1904 - నవంబరు 29, 1993) భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తొలి విమాన చోదకుడు. ఈయనకు 1992 లో భారతరత్న పురస్కారం ఇవ్వబడినది.

పారిసు లో జన్మించిన ఈయనను "జెహ్" లేక "జేఆర్డీ"గా సంబోధిస్తారు. ఈయన తల్లి ఫ్రాన్సు దేశస్థురాలు కావడంతో, ఈయన ఫ్రెంచి భాష ను మొదటి భాషగా నేర్చుకున్నాడు. 1929 లో ఈయన భారతదేశములోనే మొట్టమొదటి పైలట్ లైసెన్సు పొందాడు. 1932 లో ఈయన భారతదేశపు తొలి వాణిజ్య విమానసేవలను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రవేశపెట్టాడు. 1946లో అది "ఎయిర్ ఇండియా"గా రూపాంతరం చెందింది. తర్వాతికాలంలో ఆయన భారతదేశపు పౌరవిమానయాన పితామహుడుగా ప్రశంసింపబడ్డాడు.

34 ఏళ్ళ వయసులో ఆయన టాటా వ్యాపారసంస్థలకు పెట్టుబడిదారీ సంస్థ (Holding Company: హోల్డింగ్ కంపెనీ లేక మాతృసంస్థ) అయిన టాటా సన్స్ సంస్థకు చైర్మనుగా బాధ్యతలు చేపట్టి 1991 వరకు ఆ పదవిలో కొనసాగాడు. సుదీర్ఘమైన ఆయన హయాములో టాటా గ్రూపు ఆస్తులు అరవైరెండు కోట్ల రూపాయల నుండి పదివేల కోట్ల రూపాయల పైబడి పెరగగా, గ్రూపులో సంస్థలు పదిహేను నుండి నూటికి పైగా చేరుకున్నాయి.

మూస:టాటా గ్రూపు ఛైర్మన్లు